ఆగష్టు 14 న మీ ముందుకు రానున్న మహీంద్రా XUV700; పూర్తి వివరాలు

భారతీయ మార్కెట్లో ప్రముఖ వాహన తయారీ సంస్థ అయిన 'మహీంద్రా అండ్ మహీంద్రా' దేశీయ మార్కెట్లో కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ700 లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఈ కొత్త కారుకి సంబంధించి కొంత సమాచారాన్ని కంపెనీ అందించింది. అయితే ఇప్పుడు తాజాగా కంపెనీ ఈ కారుని 2021 ఆగష్టు 14 న పరిచయం చేయనున్నట్లు ప్రకటించింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

ఆగష్టు 14 న మీ ముందుకు రానున్న మహీంద్రా XUV700; పూర్తి వివరాలు

మార్కెట్లో విడుదల కానున్న కొత్త ఎక్స్‌యూవీ700 అనేక కొత్త ఫీచర్లు మరియు పరికరాలను కలిగి ఉండటంతో పాటు, కొత్త టెక్నాలజీని కూడా కలిగి ఉంటుంది. మహీంద్రా ఎక్స్‌యూవీ700 యొక్క టీజర్‌లు కూడా ఇప్పటికే విడుదలయ్యాయి. ఈ టీజర్ వీడియోలలో అనేక కొత్త విషయాలు వెల్లడయ్యాయి.

ఆగష్టు 14 న మీ ముందుకు రానున్న మహీంద్రా XUV700; పూర్తి వివరాలు

మహీంద్రా కంపెనీ తన కొత్త ఎక్స్‌యూవీ700 కారుని పరిచయం చేయడానికి ముందే కస్టమర్లలో మంచి క్రేజ్ తీసుకురావడానికి, గతంలో అతిపెద్ద సన్ రూఫ్, ఆటో బూస్టర్ హెడ్‌లైట్ వంటి వాటిని వెల్లడించడంతో పాటు, మహీంద్రా ఎక్స్‌యూవీ700 యొక్క కొత్త లోగోను తెలిపే వీడియోను కూడా వెల్లడించింది.

ఆగష్టు 14 న మీ ముందుకు రానున్న మహీంద్రా XUV700; పూర్తి వివరాలు

ఇప్పుడు కంపెనీ తన కొత్త లోగోతో ఎక్స్‌యూవీ700 పరిచయ తేదీ మరియు సమయం వంటివి అధికారికంగా వెల్లడించింది. మహీంద్రా ఎక్స్‌యూవీ700 యొక్క కొత్త టీజర్ 'స్మార్ట్ ఫిల్టర్ టెక్నాలజీ'ని ప్రదర్శిస్తుంది మరియు క్యాబిన్ నుండి 99 శాతం బ్యాక్టీరియా మరియు 95 శాతం వైరస్‌లను తొలగిస్తుందని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి వ్యాపించినప్పటినుంచి అనేక ఆటో కంపెనీలు ఈ ఫీచర్‌ను అందిస్తున్నాయి.

ఆగష్టు 14 న మీ ముందుకు రానున్న మహీంద్రా XUV700; పూర్తి వివరాలు

మహీంద్రా ఎక్స్‌యువి700 ఎస్‌యూవీ 2021 ఆగష్టు 14 న సాయంత్రం 4 గంటలకు ఆవిష్కరించబడుతుంది. ఎక్స్‌యూవీ700 దాని విభాగంలో మెర్సిడెస్ బెంజ్ లోని డ్యూయల్-డిస్‌ప్లే సెటప్‌ను కలిగి ఉన్న మొదటి ఎస్‌యూవీ అవుతుంది. ఈ డిస్‌ప్లే 'ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌'గా పనిచేస్తుంది. దీనితో పాటు, లెవల్ -2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్ట్ సిస్టమ్ కూడా అందించబడుతుంది.

ఆగష్టు 14 న మీ ముందుకు రానున్న మహీంద్రా XUV700; పూర్తి వివరాలు

మహీంద్రా ఎక్స్‌యువి700 ఎస్‌యూవీలో వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఆటో హోల్డ్‌తో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, కీలెస్ ఎంట్రీ, పుష్ స్టార్ట్/స్టాప్ బటన్ వంటి అప్డేటెడ్ ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి.

మహీంద్రా ఎక్స్‌యూవీ700లో కంపెనీ ఇప్పటి వరకూ వెల్లడి చేసిన ఫీచర్లలో కారు వేగాన్ని బట్టి ఎక్కువ దూరం ప్రకాశించే 'ఆటో బూస్టర్ హెడ్‌ల్యాంప్', సెగ్మెంట్లో కెల్లా అతిపెద్ద 'స్కైరూఫ్', కారు హై-స్పీడులో వెళ్తుంటే వేగాన్ని తగ్గించమని చెప్పే 'పర్సనలైజ్డ్ సేఫ్టీ అలెర్ట్స్', టెస్లా వంటి కార్లలో కనిపంచే ఫ్లష్ టైప్ 'స్మార్ట్ డోర్ హ్యాండిల్స్' మొదలైనవి ఉన్నాయి.

ఆగష్టు 14 న మీ ముందుకు రానున్న మహీంద్రా XUV700; పూర్తి వివరాలు

మహీంద్రా ఎక్స్‌యువి700లోని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో మల్టిపుల్ ఎయిర్‌బ్యాగులు, క్రూయిజ్ కంట్రోల్, పార్కింగ్ సెన్సార్లు, టైర్ ప్రెజర్ మానిటర్, మరియు ఏబీఎస్ విత్ ఈబిడి వంటివి అందుబాటులో ఉంటాయి.

ఆగష్టు 14 న మీ ముందుకు రానున్న మహీంద్రా XUV700; పూర్తి వివరాలు

మహీంద్రా ఎక్స్‌యువి700 డీజిల్ మరియు పెట్రోల్ ఇంజిన్ల ఎంపికతో అందించబడుతుంది. ఇందులోని 2.2 లీటర్ డీజిల్ యూనిట్ ద్వారా 153 బిహెచ్‌పి పవర్ మరియు 360 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. అదేవిధంగా 2.0 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ 188 బిహెచ్‌పి పవర్ మరియు 380 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ కారు ఆల్-వీల్ డ్రైవ్ లేదా మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లలో 4 వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో అందించబడుతుంది.

మహీంద్రా కంపెనీ ఇటీవల ప్రకటించిన కొత్త లోగోతో వస్తున్న మొదటి ఎస్‌యూవీ ఈ మహీంద్రా ఎక్స్‌యువి700. మహీంద్రా ఈ ఎస్‌యూవీని చాలా కాలంగా పరీక్షిస్తోంది. అయితే ఈ కొత్త కారుని వచ్చే నెలలో లాంచ్ చేయవచ్చని భావిస్తున్నారు. కానీ ఈ ఎస్‌యూవీ బుకింగ్స్ మరియు లాంచ్ తేదీ 2021 ఆగష్టు 14 కంపెనీ అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.

ఆగష్టు 14 న మీ ముందుకు రానున్న మహీంద్రా XUV700; పూర్తి వివరాలు

భారతీయ మార్కెట్లో విడుదల కానున్న మహీంద్రా కంపెనీ యొక్క మహీంద్రా ఎక్స్‌యువి700 ఎస్‌యూవీ ఒక ముఖ్యమైన వాహనం కానుంది. ఈ మహీంద్రా ఎక్స్‌యువి700 తో కంపెనీ కొత్త యుగాన్ని ప్రారంభించడానికి శ్రీకారం చుట్టనుంది. మార్కెట్లో విడుదల కానున్న ఈ కొత్త ఎస్‌యూవీలో చాలావరకు అప్డేటెడ్ ఫీచర్స్ మరియు టెక్నాలజీ వంటివి అందుబాటులో ఉండనున్నాయి.

Most Read Articles

English summary
All new mahindra xuv700 suv to unveil on 14th august details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X