టాటా 'హెచ్‌బిఎక్స్' కాంపాక్ట్ ఎస్‌యూవీ లాంచ్ ఖరారు; ఈ ఏడాదిలోనే విడుదల!

భారత ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్, 'హెచ్‌బిఎక్స్' (HBX) అనే కోడ్ నేమ్‌తో దేశీయ మార్కెట్ కోసం ఓ కాంపాక్ట్ ఎస్‌యూవీని అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసినదే. గడచిన 2020 ఆటో ఎక్స్‌పోలో టాటా మోటార్స్ ఈ కారుకు సంబంధించిన ప్రోటోటైప్ కాన్సెప్ట్‌ను కూడా ప్రదర్శించింది.

టాటా 'హెచ్‌బిఎక్స్' కాంపాక్ట్ ఎస్‌యూవీ లాంచ్ ఖరారు; ఈ ఏడాదిలోనే విడుదల!

టాటా హెచ్‌బిఎక్స్ కాన్సెప్ట్‌ను ఆధారంగా చేసుకొని కంపెనీ ఈ మైక్రో ఎస్‌యూవీని తయారు చేస్తోంది. టాటా మోటార్స్ నుండి ఇది ఎంట్రీ లెవల్ ఎస్‌యూవీగా రానుంది. ప్రస్తుతం కంపెనీ విక్రయిస్తున్న టాటా నెక్సాన్ మోడల్‌కి దిగువన ఈ కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీని ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

టాటా 'హెచ్‌బిఎక్స్' కాంపాక్ట్ ఎస్‌యూవీ లాంచ్ ఖరారు; ఈ ఏడాదిలోనే విడుదల!

ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీకి సంబంధించిన ప్రొడక్షన్ వెర్షన్ మోడల్ 2021లో విడుదల కావచ్చని ఇదివరకు పుకార్లు వచ్చాయి. కాగా, ఇప్పుడు పుకార్లను నిజం చేస్తూ కార్‌వాలే ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం ప్రకారం, టాటా మోటార్స్ ప్రస్తుత సంవత్సరంలోనే తమ సరికొత్త మైక్రో ఎస్‌యూవీని విడుదల చేయనుంది.

MOST READ:కార్ టైర్ మారుస్తూ కనిపించిన డిప్యూటీ కమిషనర్ రోహిణి సింధూరి [వీడియో]

టాటా 'హెచ్‌బిఎక్స్' కాంపాక్ట్ ఎస్‌యూవీ లాంచ్ ఖరారు; ఈ ఏడాదిలోనే విడుదల!

టాటా మోటార్స్ ఇప్పటికే తమ హెచ్‌బిఎక్స్ మైక్రో ఎస్‌యూవీని భారత రోడ్లపై విస్తృతంగా పరీక్షిస్తోంది. ఇందుకు సంబంధించిన ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ స్పై చిత్రాలు కూడా గతంలో లీక్ అయ్యాయి.

టాటా 'హెచ్‌బిఎక్స్' కాంపాక్ట్ ఎస్‌యూవీ లాంచ్ ఖరారు; ఈ ఏడాదిలోనే విడుదల!

కొత్త టాటా హెచ్‌బిఎక్స్ మైక్రో ఎస్‌యూవీలో మౌంటెడ్ కంట్రోల్స్‌తో త్రీ-స్పోక్ ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూడిన ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు కారు లోపల సిల్వర్ యాక్సెంట్స్, బ్లాక్ కలర్‌లో ఫినిష్ చేయబడిన డాష్‌బోర్డ్, డాష్‌బోర్డ్ మధ్యలో వైపులా దీర్ఘచతురస్రాకారపు ఏసి వెంట్స్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి.

MOST READ:ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ర్యాలీ చేపట్టిన కలకత్తా సీఎం.. ఎందుకో తెలుసా!

టాటా 'హెచ్‌బిఎక్స్' కాంపాక్ట్ ఎస్‌యూవీ లాంచ్ ఖరారు; ఈ ఏడాదిలోనే విడుదల!

టాటా హెచ్‌బిఎక్స్ ఎక్స్టీరియర్ ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో డ్యూయెల్ హెడ్‌ల్యాంప్ సెటప్, బానెట్‌కి దిగువన అమర్చిన ఎల్‌ఈడి డిఆర్‌ఎల్స్, సన్నటి ఫ్రంట్ గ్రిల్, ఫాక్స్ స్కిడ్ ప్లేట్స్, రగ్గడ్ లుక్ కోసం కారు చుట్టూ బాడీ క్రింది భాగంలో ప్లాస్టిక్ క్లాడింగ్, కారుకి కూప్ లుక్ ఇవ్వటం కోసం వెనుక సి పిల్లర్ వద్ద అమర్చిన సెకండ్ డోర్ హ్యాండిల్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

టాటా 'హెచ్‌బిఎక్స్' కాంపాక్ట్ ఎస్‌యూవీ లాంచ్ ఖరారు; ఈ ఏడాదిలోనే విడుదల!

ఇంజన్ విషయానికి వస్తే, టాటా హెచ్‌బిఎక్స్ మైక్రో ఎస్‌యూవీని 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ ఇంజన్ గరిష్టంగా 83 బిహెచ్‌పి పవర్‌ను మరియు 114 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఫైవ్-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. టాప్-ఎండ్ వేరియంట్లలో ఫైవ్-స్పీడ్ ఆటోమేటిక్ వేరియంట్‌ను కూడా ఆఫర్ చేయవచ్చని సమాచారం.

MOST READ:మీ వాహనంపై ఈ స్టిక్కర్ ఉందా.. ఉంటే వెంటనే తీసెయ్యండి.. లేకుంటే ?

టాటా 'హెచ్‌బిఎక్స్' కాంపాక్ట్ ఎస్‌యూవీ లాంచ్ ఖరారు; ఈ ఏడాదిలోనే విడుదల!

టాటా మోటార్స్ భారత మార్కెట్ కోసం ప్లాన్ చేసిన అనేక మోడళ్లలో టాటా హెచ్‌బిఎక్స్ కూడా ఒకటి. మార్కెట్లో విడుదైలన తర్వాత ఇది టాటా మోటార్స్ నుండి ఎంట్రీ లెవల్ ఎస్‌యూవీగా మారుతుంది. కంపెనీ దీని ధరను కూడా చాలా అగ్రెసివ్‌గా ఉంచే అవకాశం ఉంది. మార్కెట్లో లాంచ్ అయిన తర్వాత, టాటా హెచ్‌బిఎక్స్ ఈ విభాగంలో మహీంద్రా కెయువి 100 మరియు మారుతి సుజుకి ఇగ్నిస్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Most Read Articles

English summary
Tata Motors To Launch HBX Micro SUV This Year, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X