అవని లేఖారా కోసం కొత్త కార్ ప్రకటించిన Anand Mahindra; పూర్తి వివరాలు

టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌ ఖాతాలో తొలి స్వర్ణం చేరింది. మహిళా షూటర్‌ అవని లేఖారా 10మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో బంగారు పతకం సాధించి చరిత్ర సృష్టించింది. పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన తొలి భారత మహిళగా రికార్డు నెలకొల్పింది. ఈ క్రమంలో అవని 2018లో ఉక్రెయిన్‌ క్రీడాకారిణి నెలకొల్పిన ప్రపంచ రికార్డును సమం చేసింది.

అవని లేఖారా కోసం కొత్త కార్ ప్రకటించిన Anand Mahindra; పూర్తి వివరాలు

గోల్డ్పారాలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించి చరిత్ర సృష్టించిన 'అవని లేఖారా' కి Mahindra And Mahindra చైర్మన్ Anand Mahindra ఒక అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ ఎస్‌యూవీని ప్రత్యేక ప్రతిభావంతులను అనుకూలంగా ఉండే విధముగా రూపొందించనున్నారు.

అవని లేఖారా కోసం కొత్త కార్ ప్రకటించిన Anand Mahindra; పూర్తి వివరాలు

Anand Mahindra సోషల్ మీడియా ద్వారా ఈ కొత్త ఎస్‌యూవీని అభివృద్ధి చేయాలనే కోరికను వ్యక్తం చేశారు. Anand Mahindra ఒక వారం క్రితం అథ్లెట్ వికలాంగుల కోసం ఒక SUV ని అభివృద్ధి చేయాలని సూచించారు. దీనికోసం ఛాలెంజ్‌ని స్వీకరించమని డెవెలప్మెంట్ హెడ్ మరియు తన సహోద్యోగి వేలును అడిగినట్లు తెలిపారు.

అవని లేఖారా కోసం కొత్త కార్ ప్రకటించిన Anand Mahindra; పూర్తి వివరాలు

Anand Mahindra (ఆనంద్ మహీంద్రా) తన ట్వీట్‌లో Mahindra And Mahindra గ్లోబల్ ప్రోడక్ట్ డెవలప్‌మెంట్ హెడ్ R Veluswamy గురించి ప్రస్తావించారు. మహీంద్రా ఇటీవల విడుదల చేసిన కొత్త Mahindra XUV 700 SUV అభివృద్ధి వెనుక వెలుస్వామి ఉన్నారని కూడా తెలిపారు.

అవని లేఖారా కోసం కొత్త కార్ ప్రకటించిన Anand Mahindra; పూర్తి వివరాలు

దేశీయ మార్కెట్లో ఆవిష్కరించబడిన కొత్త Mahindra XUV700 విషయానికి వస్తే, ఇది గత నెలలో భారతీయ మార్కెట్లో ఆవిష్కరించబడింది. కొత్త Mahindra XUV700 ప్రారంభ ధర రూ. 11.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ కొత్త SUV అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది.

అవని లేఖారా కోసం కొత్త కార్ ప్రకటించిన Anand Mahindra; పూర్తి వివరాలు

Mahindra XUV700 అద్భుతమై డిజైన్ కలిగి ఉంటుంది. ఇందులో అప్డేటెడ్ ఫీచర్స్ మరియు పరికరాలు అందుబాటులో ఉంటాయి. ఈ SUV లో సి- ఆకారపు ఎల్ఈడీ డిఆర్ఎల్ లతో కొత్త ఎల్ఈడీ హెడ్ లైట్ యూనిట్లను పొందుతుంది. ఈ SUV చాలా పొడవుగా ఉంటుంది. ఇది 18 ఇంచెస్ డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. వెనుక భాగంలో పెద్ద టెయిల్ లైట్, ఫాక్స్ స్కిడ్ ప్లేట్, రిఫ్లెక్టర్ వంటివి కూడా అందుబాటులో ఉంటుంది. అవి మాత్రమే కాకుండా ఇందులో రూఫ్ రైల్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా, ఫ్లష్ స్మార్ట్ డోర్ హ్యాండిల్స్ వాటి అధునాతన ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి.

అవని లేఖారా కోసం కొత్త కార్ ప్రకటించిన Anand Mahindra; పూర్తి వివరాలు

Mahindra XUV700 SUV లోని ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంది. సౌండ్ కోసం సోనీ సౌండ్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేయబడింది. దీనితో పాటు, ఆండ్రాయిడ్ మరియు ఆపిల్ కార్‌ప్లే, ఇ-సిమ్ ఆధారిత కనెక్ట్ చేయబడిన టెక్నాలజీ, వాయిస్ అసిస్టెంట్, యాంబియంట్ లైటింగ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఎయిర్ ప్యూరిఫయర్ వంటివి ఉన్నాయి. అంతే కాకూండా Mahindra XUV700 లో ఈ అడ్వాన్స్ డ్రైవర్ అసిస్టెడ్ సిస్టమ్ కూడా అందుబాటులో ఉంటుంది.

అవని లేఖారా కోసం కొత్త కార్ ప్రకటించిన Anand Mahindra; పూర్తి వివరాలు

మహీంద్రా XUV700 లో రెండు ఇంజన్ ఆప్షన్‌లు ఉన్నాయి, 2.0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ మరియు 2.2 లీటర్ టర్బో-డీజిల్ ఇంజిన్. దీని పెట్రోల్ ఇంజన్ 200 బిహెచ్‌పి పవర్ మరియు 300 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. చైనా డీజిల్ ఇంజిన్ 185 బిహెచ్‌పి పవర్ మరియు 420 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికను కలిగి ఉంది.

అవని లేఖారా కోసం కొత్త కార్ ప్రకటించిన Anand Mahindra; పూర్తి వివరాలు

Mahindra XUV700 లోఐ సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 7 ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్ విత్ ఇబిడి, ఎలక్ట్రానిక్ లాకింగ్ డిఫరెన్షియల్, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్ మరియు ఆటో హెడ్‌లైట్ బూస్టర్ వంటివి ఉన్నాయి. దేశీయ మార్కెట్లో కొత్త Mahindra XUV700 విడుదలైన తర్వాత Hyundai Alcazar, MG Hector Plus, Tata Safari మరియు రాబోయే Jeep Meridian వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

అవని లేఖారా కోసం కొత్త కార్ ప్రకటించిన Anand Mahindra; పూర్తి వివరాలు

ఆనంద్ మహీంద్రా ఇది వరకే జావ్లింగ్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రాకు కూడా మహీంద్రా XUV700 గిఫ్ట్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆనంద్ మహీంద్రా క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఈ విధమైన గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు.

Most Read Articles

English summary
Anand mahindra wants specially designed suv for para shooter avani lekhara details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X