వారెవ్వా.. Mahindra XUV700 యొక్క ఈ ఫీచర్స్ ‘నెవర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్’

దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra) యొక్క XUV700 అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్ గా అవతరించింది. మార్కెట్లో విడుదలైన తక్కువ సమయంలోనే కంపెనీ యొక్క విజయవంతమైన ఉత్పత్తిగా నిరూపించబడింది. మహీంద్రా XUV700 కారు ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలతో నిక్షిప్తమై ఉంటుంది.

వారెవ్వా.. Mahindra XUV700 యొక్క ఈ ఫీచర్స్ ‘నెవర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్’

మహీంద్రా XUV700 లేటెస్ట్ ADAS వంటి అనేక ఫీచర్లతో కంపెనీ ఈ కారును విడుదల చేసింది. ADAS యొక్క లక్షణాలలో ఒకటి ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్. ఇటీవల గ్లోబల్ NCAP ఈ ఫీచర్‌ను ప్రదర్శించడానికి ఒక వీడియోను విడుదల చేసింది. కస్టమర్లలో అవగాహన పెంచేందుకు మాత్రమే గ్లోబల్ ఎన్‌సీఏపీ ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. వీడియోలో మీరు చూసే XUV700 వైట్ కలర్ ఉంది. ఈ వీడియోలో ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ ఫీచర్‌ని చూడవచ్చు.

వారెవ్వా.. Mahindra XUV700 యొక్క ఈ ఫీచర్స్ ‘నెవర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్’

ఈ వీడియోలో మీరు గమనించినట్లయితే మహీంద్రా ఎక్స్‌యూవీ700 కి ఎదురుగా డమ్మీ కారు వచ్చి ఉండటం వల్ల అది తనంతట తానే ఆగిపోతుంది. అంతే కాకుండా, ఇందులోని ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ ఒక డమ్మీ మనిషితో కూడా టెస్ట్ చేయడం జరిగింది. మహీంద్రా XUV700 కి ఎదురుగా ఒక డమ్మీ మనిషి రావడం వల్ల XUV700 తనంతట తానే నిలిచిపోయింది. ఇది నిజంగా ఈ కొత్త SUV లోని అద్భుతమైన ఫీచర్.

వారెవ్వా.. Mahindra XUV700 యొక్క ఈ ఫీచర్స్ ‘నెవర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్’

ఇందులోని ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్ వాహనం ముందు అమర్చిన వివిధ సెన్సార్లు మరియు రాడార్‌లను ఉపయోగించుకుని పనిచేస్తుంది. ఈ సెన్సార్‌లు SUV కి ఎదురుగా ఏదైనా వాహనాలు ఉన్నాయా, లేదా మనుషులు ఉన్నారా అని గుర్తిస్తుంది. అప్పుడు డ్రైవర్ బ్రేకులు వేయకపోతే, అదే తనకు తానుగా బ్రేక్‌లు వేసి కారుని నిలిపివేస్తుంది.

వారెవ్వా.. Mahindra XUV700 యొక్క ఈ ఫీచర్స్ ‘నెవర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్’

అంతే కాకుండా, కారు ముందు భాగంలో కొలీషియన్ వార్ణింగ్ సిస్టం కూడా అందుబాటులో ఉంటుంది. ఈ సిస్టం వల్ల SUV ముందు భాగంలో ఏదైనా తాకబోయే అవకాశం ఉన్నప్పుడు, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌లో హెచ్చరికను చూపుతుంది. మొత్తానికి కొత్త మహీంద్రా XUV700 లో ఉన్న అధునాతన డ్రైవర్ ఎయిడ్ సిస్టమ్ అనేక గొప్ప ఫీచర్లను అందిస్తుంది.

వారెవ్వా.. Mahindra XUV700 యొక్క ఈ ఫీచర్స్ ‘నెవర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్’

మహీంద్రా XUV700 కారు అడాప్టివ్ క్రూయిస్ కంట్రోల్ ఫీచర్‌తో కూడా వస్తుంది. ఇందులోని సెన్సార్‌లు మరియు రాడార్ మీ ముందు ఉన్న కారును ట్రాక్ చేస్తాయి. కావున స్వయంచాలకంగా వేగాన్ని పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. ఇది కాకుండా, స్మార్ట్ పైలట్ అసిస్ట్ ఫీచర్ కూడా ఇందులో అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ కారును ఆటోమేటిక్‌గా నడిపేందుకు సెన్సార్‌లు మరియు రాడార్‌లను ఉపయోగిస్తుంది.

వారెవ్వా.. Mahindra XUV700 యొక్క ఈ ఫీచర్స్ ‘నెవర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్’

మహీంద్రా XUV700 లేన్ కీప్ అసిస్ట్‌తో వస్తుంది, ఇది SUV కి నిర్దిష్ట లేన్‌లో ఉండడానికి సహాయపడుతుంది. ఇది కంపెనీ లేన్ డిపార్చర్ వార్నింగ్ ఫీచర్‌ను కూడా పొందుతుంది, ఇది SUV లేన్ నుండి బయటికి వచ్చినప్పుడు డ్రైవర్‌ను హెచ్చరిస్తుంది. మహీంద్రా XUV700 ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్ ఫీచర్‌ను కూడా పొందుతుంది. ఈ ఫీచర్ రోడ్డు గుర్తును గుర్తించి, దానిని ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో ప్రదర్శిస్తుంది. ADAS హై బీమ్ అసిస్ట్ ఫీచర్‌ను కూడా పొందుతుంది.

మహీంద్రా XUV700 లో లగ్జరీ ప్యాక్ కోసం వెళితే, మీరు అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్‌తో పాటు స్టాప్ అండ్ గో ఫంక్షన్‌ను కూడా పొందుతారు. మహీంద్రా XUV700 ధర గురించి విషయానికి వస్తే, ఈ కారు ప్రారంభ ధర రూ. 12.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే దీని టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ. 22.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.

వారెవ్వా.. Mahindra XUV700 యొక్క ఈ ఫీచర్స్ ‘నెవర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్’

ఇదిలా ఉండగా ఇటీవల కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra) చిప్ కొరత కారణంగా తన కొత్త SUV అయిన XUV700 లో కూడా కొన్ని ఫీచర్స్ తీసివేయనున్నట్లు తెలిపింది. దీనికి ప్రధాన కారణం చిప్ కొరత. ఈ నేపథ్యంలో భాగంగానే కంపెనీ ఇప్పుడు మహీంద్రా XUV700 SUV ని కొన్ని తక్కువ ఫీచర్స్ తో అందిస్తుంది. అయితే దీని ధర కూడా కొంత తక్కువగానే ఉంటుంది.

వారెవ్వా.. Mahindra XUV700 యొక్క ఈ ఫీచర్స్ ‘నెవర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్’

ఇటీవల మహీంద్రా XUV700 కోసం గ్లోబల్ NCAP నిర్వహించిన క్రాష్ టెస్టులో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకుంది. అడల్ట్ సేఫ్టీ విషయంలో ఈ కారు 17 పాయింట్లకు గాను 16.03 పాయింట్లను స్కోర్ చేసింది. అలాగే, పిల్లల భద్రతలో ఇది 49 పాయింట్లకు గాను 41.66 పాయింట్లను స్కోర్ చేసి మొత్తానికి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ కైవసం చేసుకుంది.

Mahindra XUV700 రెండు ఇంజన్ ఆప్షన్‌లలో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో మొదటిది 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు రెండవది 2.2-లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్‌. పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 153 బిహెచ్‌పి పవర్‌ను మరియు 360 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక రెండవ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 2.2-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్, ఇది 188 బిహెచ్‌పి పవర్ మరియు 380 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది కూడా 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలను కలిగి ఉంటుంది.

Most Read Articles

English summary
Global ncap show mahindra xuv700 automatic emergency braking details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X