ఒక్క డిసెంబర్ నెలలోనే 6500కి పైగా బుకింగ్స్ దక్కించుకున్న మహీంద్రా థార్

గతేడాది చివర్లో భారత మార్కెట్లో విడుదలైన నెక్స్ట్ జనరేషన్ మహీంద్రా థార్ కొత్త సంవత్సరంలో కూడా టాక్ ఆఫ్ ది టౌన్‌గా కొనసాగుతోంది. స్టైలిషన్ డిజైన్, సరికొత్త ఫీచర్స్ మరియు పవప్‌ఫుల్ ఇంజన్స్‌తో వచ్చిన ఈ ఆఫ్-రోడర్ ఎస్‌యూవీ ఇప్పుడు అనేక మంది దృష్టిని ఆకర్షిస్తోంది.

ఒక్క డిసెంబర్ నెలలోనే 6500కి పైగా బుకింగ్స్ దక్కించుకున్న మహీంద్రా థార్

మహీంద్రా అసలు ఇప్పటి వరకూ ఎందుకు ఇలాంటి థార్‌ను తయారు చేయలేదని ఔత్సాహికులు తెగ సంబరపడిపోతున్నారు. మొదటిసారి ఆఫ్-రోడ్ వాహనాన్ని కొనుగోలు చేసే కస్టమర్లనే కాకుండా స్టాండర్డ్ ఎస్‌యూవీలకు ప్రత్యామ్నాయంగా కూడా దీని కొనుగోలు చేస్తున్నారు.

ఒక్క డిసెంబర్ నెలలోనే 6500కి పైగా బుకింగ్స్ దక్కించుకున్న మహీంద్రా థార్

గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త తరం మహీంద్రా థార్ అమ్ముడుపోతోంది. ఒక్క డిసెంబర్ నెలలోనే 2020 మహీంద్రా థార్ కోసం 6,500 యూనిట్ల బుకింగ్స్ వచ్చినట్లు కంపెనీ పేర్కొంది. థార్ కోసం అనూహ్యమైన డిమాండ్ రావటంతో దీని వెయిటింగ్ పీరియడ్ కూడా గణనీయంగా పెరిగిపోతోంది.

MOST READ:అటల్ టన్నెల్‌లో ఒకటి, రెండు కాదు ఏకంగా 82 వాహనాలు చిక్కుకున్నాయి.. కారణం ఇదే

ఒక్క డిసెంబర్ నెలలోనే 6500కి పైగా బుకింగ్స్ దక్కించుకున్న మహీంద్రా థార్

మహీంద్రా థార్ వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించేందుకు కంపెనీ ఇప్పుడు ఈ మోడల్ ఉత్పత్తిని వేగవంతం చేసింది. ఈ మేరకు వివిధ రకాల సప్లయర్ల నుండి విడిభాగాల సరఫరాను వేగవంతం చేయాల్సిందిగా కంపెనీ కోరుతోంది.

ఒక్క డిసెంబర్ నెలలోనే 6500కి పైగా బుకింగ్స్ దక్కించుకున్న మహీంద్రా థార్

కొత్త తరం మహీంద్రా థార్‌లో అత్యధికంగా అమ్ముడవుతోన్నది థార్ ఆటోమేటిక్ వెర్షన్. ఈ ఆఫ్-రోడ్ ఎస్‌యూవీ మొత్తం అమ్మకాల్లో దాదాపు 50 శాతం ఆటోమేటిక్ వేరియంట్ల నుంచి వచ్చాయని, ఫలితంగా ఈ ఆఫ్-రోడ్ ఎస్‌యూవీని ఒక అప్ మార్కెట్ మెయిన్‌స్ట్రీమ్ మహీంద్రా మోడల్‌గా మార్కెట్ చేయడానికి ఇది బ్రాండ్‌కు సహాయపడిందని మహీంద్రా ఆటో అండ్ ఫార్మ్ సెక్టార్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేష్ జెజురికర్ అన్నారు.

MOST READ:2021 డాకర్ ర్యాలీ స్టేజ్ 1 ఫలితాలు వచ్చేశాయ్.. భారతీయ రేసర్లు ఏ స్టేజ్‌లో ఉన్నారో చూడండి

ఒక్క డిసెంబర్ నెలలోనే 6500కి పైగా బుకింగ్స్ దక్కించుకున్న మహీంద్రా థార్

థార్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని కంపెనీ దీని వేరియంట్లలో మార్పులు కూడా చేసింది. మహీంద్రా ఇప్పుడు తమ 6-సీటర్ బేస్ వేరియంట్ థార్‌ను మార్కెట్ నుండి తొలగించింది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఎక్కువ మంది వినియోగదారులు టాప్-స్పెక్ ఎల్ఎక్స్ వేరియంట్‌ను ఎంచుకుంటున్న నేపథ్యంలో బేస్ వేరియంట్‌ను నిలిపివేస్తున్నట్లు మహీంద్రా పేర్కొంది.

ఒక్క డిసెంబర్ నెలలోనే 6500కి పైగా బుకింగ్స్ దక్కించుకున్న మహీంద్రా థార్

మహీంద్రా మొదట్లో కొత్త తరం థార్‌ను రూ.9.80 లక్షల ప్రారంభ ధరతో విడుదల చేసింది. ఇప్పుడు బేస్ వేరియంట్‌ను నిలిపివేయడంతో, తాజాగా అప్‌డేట్ చేసిన బ్రోచర్ ప్రకారం కొత్త థార్ ప్రారంభ ధర రూ.11.90 లక్షలుగా మారింది. ఇందులో టాప్-ఎండ్ వేరియంట్ అయిన ఎల్ఎక్స్ ధర రూ.13.75 లక్షలుగా ఉంది (పైన పేర్కొన్న అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

MOST READ:ఒక ఛార్జ్‌తో 100 కి.మీ డ్రైవింగ్.. ధర తక్కువ & డ్రైవింగ్ లైసెన్స్ అవసరమే లేదు

ఒక్క డిసెంబర్ నెలలోనే 6500కి పైగా బుకింగ్స్ దక్కించుకున్న మహీంద్రా థార్

మహీంద్రా థార్ కోసం ఇటీవల గ్లోబల్ ఎన్‌క్యాప్ నిర్వహించిన క్రాష్ టెస్టులో, వయోజనుల సేఫ్టీ విషయంలో ఇది 17 పాయింట్లకు గాను 12.52 పాయింట్లు సాధించింది. ఇక పిల్లల సేఫ్టీ విషయంలో 49 పాయింట్లకు గాను 41.11 పాయింట్ల స్కోరును సాధించి మొత్తంగా 4-స్టీర్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకుంది. ఈ సేఫ్టీ రేటింగ్ కూడా థార్ అమ్మకాల పెరుగదలకు దోహదపడింది.

ఒక్క డిసెంబర్ నెలలోనే 6500కి పైగా బుకింగ్స్ దక్కించుకున్న మహీంద్రా థార్

కొత్త 2020 థార్‌ను సరికొత్త 2.0 లీటర్ టి-జిడిఐ ఎమ్‌స్టాలియన్ పెట్రోల్ ఇంజన్ మరియు 2.2 లీటర్ ఎమ్‌హాక్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో ప్రవేశపెట్టారు. ఇందులోని పెట్రోల్ ఇంజన్ 150 బిహెచ్‌పి పవర్ మరియు 320 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే, డీజిల్ ఇంజన్ 130 బిహెచ్‌పి పవర్ మరియు 300 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

MOST READ:సంక్రాంతి కానుకగా వస్తున్న టాటా ఆల్ట్రోజ్ టర్బో వేరియంట్ - ఫొటోలు

ఒక్క డిసెంబర్ నెలలోనే 6500కి పైగా బుకింగ్స్ దక్కించుకున్న మహీంద్రా థార్

ఈ రెండు వేరియంట్లు షిఫ్ట్-ఆన్-ఫ్లై ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌తో పాటుగా మెకానికల్ లాకింగ్ డిఫరెన్షియల్స్‌ను స్టాండర్డ్‌గా కలిగి ఉంటాయి. ఇవి రెండు కొత్త 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో కానీ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో కానీ లభిస్తాయి.

Most Read Articles

English summary
Mahindra Thar Gets 6,500 Bookings In December 2020. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X