Mahindra XUV700 నెక్స్ట్ బ్యాచ్ డెలివరీస్ ఎప్పుడో తెలుసా?

భారతీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన మహీంద్రా ఎక్స్‌యువి700 (Mahindra XUV700) యొక్క నెక్స్ట్ బ్యాచ్ డెలివరీలను 2021 నవంబర్ 25 నుండి ప్రారంభం కానుంది. ఈ SUV యొక్క 700 కంటే ఎక్కువ యూనిట్లు దీపావళి సమయంలో డెలివరీ చేయబడతాయని కూడా కంపెనీ ఇప్పటికే తెలిపింది. అయితే ఇప్పుడు నవంబర్ 25 నుండి డెలివరీ ప్రారంభమవుతుందని ఈ-మెయిల్ ద్వారా వినియోగదారులకు సమాచారం అందుతోంది.

Mahindra XUV700 నెక్స్ట్ బ్యాచ్ డెలివరీస్ ఎప్పుడో తెలుసా..?

మహీంద్రా ఎక్స్‌యువి700 యొక్క డెలివరీలు 2022 జనవరి 14 లోపు మొత్తం 14,000 యూనిట్లు జరగనున్నాయి. కంపెనీ యొక్క ఈ కొత్త అప్డేటెడ్ SUV ఇప్పటికే 70,000 కంటే ఎక్కువ బుకింగ్స్ స్వీకరించింది. కంపెనీ XUV700 యొక్క పెట్రోల్ మోడల్ డెలివరీలను 2021 అక్టోబర్ 30 ప్రారంభించింది. అయితే డీజిల్ మోడల్ డెలివరీలు ఈ నెల చివరికి ప్రారంభం కానున్నాయి.

Mahindra XUV700 నెక్స్ట్ బ్యాచ్ డెలివరీస్ ఎప్పుడో తెలుసా..?

మహీంద్రా కంపెనీ గత అక్టోబర్ నెలలో మొత్తం 3,400 యూనిట్ల వాహనాలను డెలివరీ చేసింది. కావున అటువంటి పరిస్థితిలో, నవంబర్ మరియు డిసెంబర్ నెలల్లో కూడా అదే వేగంతో వాహనాలను డెలివరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. కావున డెలివరీలు శరవేగంగా జరిగనున్నాయి.

Mahindra XUV700 నెక్స్ట్ బ్యాచ్ డెలివరీస్ ఎప్పుడో తెలుసా..?

ప్రస్తుతం భారతీయ మార్కెట్లోని ఆటో మొబైల్ పరిశ్రమలు, సెమీ కండక్టర్ చిప్ కొరతల వల్ల డెలివరీ టైమ్‌లైన్‌ను కూడా కంపెనీ కస్టమర్‌లకు స్పష్టంగా చెప్పలేకపోయింది. అయితే కస్టమర్లకు సరైన సమయంలో డెలివరీలు చేయడానికి కంపెనీ బాగా కృషి చేస్తుంది. ఇటీవల విడుదలైన మహీంద్రా XUV700 మాత్రమే కాకుండా మహీంద్రా థార్ వెయిటింగ్ పీరియడ్ కూడా ఈ చిప్ కొరతల మరింత పెరుగుతోంది.

Mahindra XUV700 నెక్స్ట్ బ్యాచ్ డెలివరీస్ ఎప్పుడో తెలుసా..?

ఇంతటి క్లిష్టమైన పరిస్థితిలో కూడా కంపెనీ తమ కష్టమర్లకు డెలివరీలను త్వరగా చేయాలనే నెపంతో నెక్స్ట్ బ్యాచ్ డెలివరీలు నవంబర్ 25 అని తెలిపింది. కంపెనీ సగటున 3,500 యూనిట్లను డెలివరీ చేయబోతోంది, కావున దీని ప్రకారం, ఇటీవల బుక్ చేసుకున్న వినియోగదారులు ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం ఈ SUV కోసం వేచి ఉండవలసి ఉంది.

Mahindra XUV700 నెక్స్ట్ బ్యాచ్ డెలివరీస్ ఎప్పుడో తెలుసా..?

డెలివరీ ప్రక్రియను సులభతరం చేయడానికి అల్గారిథమిక్ ఆధారిత ప్రక్రియను అమలు చేయడానికి మహీంద్రా ఒక కన్సల్టెన్సీ కంపెనీతో కలిసి పని చేస్తోంది. మహీంద్రా XUV700 ప్రారంభ ధర ఇప్పుడు రూ. 12.49 లక్షలు (ఎక్స్-షోరూమ్), టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ. 22.99 లక్షలు (ఎక్స్-షోరూమ్).

Mahindra XUV700 నెక్స్ట్ బ్యాచ్ డెలివరీస్ ఎప్పుడో తెలుసా..?

మహీంద్రా XUV700 ఈ కారును మొత్తం నాలుగు వేరియంట్లలో విక్రయిస్తోంది. అవి MX3, AX3, AX5 మరియు AX7 వేరియంట్స్. ఇవి పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్‌ ల ఎంపికలో అందుబాటులో ఉంటుంది. కానీ, MX5 ట్రిమ్ కేవలం 3 వేరియంట్‌లకు పరిమితం చేయబడింది. ఇందులో పెట్రోల్ మాన్యువల్, పెట్రోల్ ఆటోమేటిక్ మరియు డీజిల్ మాన్యువల్ వేరియంట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా 5 సీటర్ ఆప్షన్‌తో లభిస్తాయి.

Mahindra XUV700 నెక్స్ట్ బ్యాచ్ డెలివరీస్ ఎప్పుడో తెలుసా..?

Mahindra XUV700 రెండు ఇంజన్ ఆప్షన్‌లలో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో మొదటిది 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు రెండవది 2.2-లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్‌. పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 153 బిహెచ్‌పి పవర్‌ను మరియు 360 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Mahindra XUV700 నెక్స్ట్ బ్యాచ్ డెలివరీస్ ఎప్పుడో తెలుసా..?

ఇక రెండవ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 2.2-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్, ఇది 188 బిహెచ్‌పి పవర్ మరియు 380 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది కూడా 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలను కలిగి ఉంటుంది. Mahindra XUV700 నాలుగు డ్రైవింగ్ మోడ్స్ కలిగి ఉంటుంది. అవి జిప్, జామ్, జూమ్ మరియు కస్టమ్ డ్రైవింగ్ మోడ్స్.

Mahindra XUV700 నెక్స్ట్ బ్యాచ్ డెలివరీస్ ఎప్పుడో తెలుసా..?

మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఇటీవల జరిగిన గ్లోబల్ NCAP క్రాష్ టెస్టులో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకుంది. పెద్దల సేఫ్టీ విషయంలో ఈ కారు 17 పాయింట్లకు గాను 16.03 పాయింట్లను స్కోర్ చేసింది. అలాగే, పిల్లల భద్రత విషయంలో ఇది 49 పాయింట్లకు గాను 41.66 పాయింట్లను స్కోర్ చేసి ఓవరాల్ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది.

Mahindra XUV700 నెక్స్ట్ బ్యాచ్ డెలివరీస్ ఎప్పుడో తెలుసా..?

ఈ కారుకి అడల్ట్ సేఫ్టీ విషయంలో 5-స్టార్ మరియు చైల్డ్ సేఫ్టీ విషయంలో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీలో కంపెనీ రెండు ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబిఎస్, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్స్ వంటి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లను అందిస్తోంది. అయితే, సైడ్ బాడీ ఎయిర్‌బ్యాగ్‌లు, సైడ్ హెడ్ కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), మరియు అన్ని సీటింగ్ పొజిషన్‌లలో త్రీ పాయింట్ బెల్ట్‌లు వంటి ఫీచర్లను స్టాండర్డ్ ఫీచర్లుగా జోడించడం ద్వారా మహీంద్రా XUV700ని మరింత మెరుగుపరచవచ్చని టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది.

Most Read Articles

English summary
Mahindra xuv700 next batch delivery to begin on 25th november details
Story first published: Friday, November 12, 2021, 19:43 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X