Maruti Suzuki సంస్థకి భారీ షాక్.. రూ.200 కోట్ల జరిమానా విధించిన సిసిఐ!

భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ Maruti Suzuki అన్యాయమైన వాణిజ్య పద్ధతులకు పాల్పడిందన్న ఆరోపణల నేపథ్యంలో భారత కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) రూ. 200 కోట్ల జరిమానా విధించింది. సిసిఐ అన్ని ప్రాంతాలలో అన్యాయమైన వ్యాపార పద్ధతులను నిషేధించేందుకు కృషి చేస్తుంది.

Maruti Suzuki సంస్థకి భారీ షాక్.. రూ.200 కోట్ల జరిమానా విధించిన సిసిఐ!

ఈ ఆరోపణల ప్రకారం, Maruti Suzuki India కార్లపై అందించే డిస్కౌంట్లను పరిమితం చేయాలని తమ డీలర్లను బలవంతం చేసింది. ఇలా చేయడం వలన డీలర్ల మధ్య పోటీని తగ్గించడమే కాకుండా, ఆ అధిక భారాన్నంతా కస్టమర్‌లే భరించాల్సి వచ్చింది. ఈ పోటీ వ్యతిరేక పద్ధతులకు గాను సదరు సంస్థపై సిసిఐ 200 కోట్ల రూపాయల జరిమానాను విధించింది.

Maruti Suzuki సంస్థకి భారీ షాక్.. రూ.200 కోట్ల జరిమానా విధించిన సిసిఐ!

సాధారణంగా, Maruti Suzuki కంపెనీ తరఫు నుండి తమ కార్లపై ఎలాంటి డిస్కౌంట్లు అందించకపోయినప్పటికీ, కంపెనీ డీలర్లు మాత్రం తమ స్థాయికి తగినట్లుగా కార్లపై డిస్కౌంట్లు అందిస్తుంటారు. అయితే, ఈ డీలర్ స్థాయి డిస్కౌంట్లపై కంపెనీ ఆంక్షలు విధించడంతో కస్టమర్లు అధిక ధర చెల్లించి వాటిని కొనుగోలు చేయాల్సి వస్తుంది.

Maruti Suzuki సంస్థకి భారీ షాక్.. రూ.200 కోట్ల జరిమానా విధించిన సిసిఐ!

అంతేకాకుండా, డీలర్లు తమ తరపున కస్టమర్లకు డిస్కౌంట్లను అందించడం వలన ఇది వారిలో పోటీ వాతావరణాన్ని సృష్టిస్తుంది మరియు కస్టమర్‌లు కూడా తక్కువ ధరకే కారును పొందడం వల్ల ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు.

Maruti Suzuki సంస్థకి భారీ షాక్.. రూ.200 కోట్ల జరిమానా విధించిన సిసిఐ!

సిసిఐ జారీ చేసిన ఒక ప్రకటన సారాంశం ఇలా ఉంది: "డిస్కౌంట్ అమలు చేయడం ద్వారా ప్యాసింజర్ వాహన విభాగంలో రీసేల్ ప్రైస్ మెయింటెనెన్స్ (RPM) యొక్క పోటీ-వ్యతిరేక ప్రవర్తనకు పాల్పడినందుకు గానూ Maruti Suzuki India Limited (MSIL) కు వ్యతిరేకంగా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) తుది ఉత్తర్వును జారీ చేస్తూ, సదరు సంస్థకు రూ. 200 కోట్ల పెనాల్టీ విధించడమైనది" అని పేర్కొంది.

Maruti Suzuki సంస్థకి భారీ షాక్.. రూ.200 కోట్ల జరిమానా విధించిన సిసిఐ!

సిసిఐ 2019 లోనే ఈ ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభించింది మరియు ఇప్పుడు తుది తీర్పుని ఇస్తూ Maruti Suzuki కి భారీ జరిమానా విధించింది. ఈ కంపెనీ డిస్కౌంట్ కంట్రోల్ పాలసీని అమలు చేయడం ద్వారా పోటీ వ్యతిరేక ప్రవర్తనకు పాల్పడినందని, అందుకే జరిమానా విధించామని సిసిఐ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.

Maruti Suzuki సంస్థకి భారీ షాక్.. రూ.200 కోట్ల జరిమానా విధించిన సిసిఐ!

సిసిఐ ప్రకటన ప్రకారం, Maruti Suzuki తన డీలర్లతో ఒక ఒప్పందాన్ని కలిగి ఉందని సిసిఐ కనుగొంది, దీని ద్వారా కంపెనీ నిర్దేశించిన దానికంటే ఎక్కువ డిస్కౌంట్లను వినియోగదారులకు అందించకుండా డీలర్లు నిరోధించబడ్డారని తెలిపింది. మరో మాటలో చెప్పాలంటే, కంపెనీ తన డీలర్లపై 'డిస్కౌంట్ కంట్రోల్ పాలసీ'ని అమలు చేసింది.

Maruti Suzuki సంస్థకి భారీ షాక్.. రూ.200 కోట్ల జరిమానా విధించిన సిసిఐ!

ఇలా చేయటం వలన Maruti Suzuki డీలర్లు, కంపెనీ అనుమతించిన దానికంటే మించి వినియోగదారులకు అదనపు డిస్కౌంట్లు, ఉచితాలు మొదలైనవి ఇవ్వకూడదు. ఒకవేళ ఎవరైనా డీలర్ తమ కస్టమర్‌కి అదనపు డిస్కౌంట్లను అందించాలనుకుంటే, Maruti Suzuki నుండి ముందస్తు ఆమోదం పొందడం తప్పనిసరి.

Maruti Suzuki సంస్థకి భారీ షాక్.. రూ.200 కోట్ల జరిమానా విధించిన సిసిఐ!

ఈ విషయంలో Maruti Suzuki డిస్కౌంట్ కంట్రోల్ పాలసీని ఉల్లంఘించిన ఏ డీలర్ అయినా, డీలర్‌షిప్‌పై మాత్రమే కాకుండా, డైరెక్ట్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, రీజినల్ మేనేజర్, షోరూమ్ మేనేజర్, టీమ్ లీడర్ మొదలైన వారిపై కూడా కంపెనీ పెనాల్టీ విధించే ప్రమాదం ఉంది. డీలర్ డిస్కౌంట్‌లకు సంబంధించిన పోటీ వ్యతిరేక నియమాలను తక్షణమే "మూసివేసి, ఆపేవేసి" 60 రోజుల్లోగా జరిమానాను చెల్లించాలని సిసిఐ Maruti Suzuki ని కోరింది.

Maruti Suzuki సంస్థకి భారీ షాక్.. రూ.200 కోట్ల జరిమానా విధించిన సిసిఐ!

కొన్ని ప్రాంతాల్లో Maruti Suzuki ద్వారా రీసేల్ ధర నిర్వహణను ఆరోపిస్తూ, కంపెనీకి వ్యతిరేకంగా అనామకంగా ఒక ఈ-మెయిల్ పంపిన తర్వాత ఈ విషయం తలెత్తిందని సిసిఐ ఇదివరకు విడుదల చేసిన 10 పేజీల నివేదికలో పేర్కొంది. Maruti Suzuki ఇలాంటి డిస్కౌంట్ కంట్రోల్ పాలసీని భారతదేశమంతటా (ప్రత్యేకంగా, ఒకే నగరంలో ఐదుగురు కంటే ఎక్కువ డీలర్లు పనిచేసే నగరాల్లో) అమలు చేస్తున్నట్లు సిసిఐ తమ నివేదికలో వెల్లడించింది.

Maruti Suzuki సంస్థకి భారీ షాక్.. రూ.200 కోట్ల జరిమానా విధించిన సిసిఐ!

అంతేకాకుండా, Maruti Suzuki తమ డీలర్‌షిప్ కేంద్రాలలో డిస్కౌంట్ కంట్రోల్ పాలసీని సమర్థవంతంగా అమలు చేయడానికి, మిస్టరీ షాపింగ్ ఏజెన్సీలను (MSA)లను కూడా నియమించినట్లు తాజా సిసిఐ విచారణలో వెల్లడైంది. అంటే, కంపెనీ నియమించిన వ్యక్తులే కస్టమర్ల రూపంలో కొన్ని డీలర్‌షిప్‌లను సందర్శించి కార్ల డిస్కౌంట్లకు సంబంధించిన వివరాలను సేకరిస్తారు.

Maruti Suzuki సంస్థకి భారీ షాక్.. రూ.200 కోట్ల జరిమానా విధించిన సిసిఐ!

ఇలా సేకరించిన సమాచారాన్ని తిరిగి వారు కంపెనీకి తెలియజేస్తారు. ఎవరైనా డీలర్ ఎక్కువ డిస్కౌంట్లను ఆఫర్ చేసినట్లయితే, ఈ ఎమ్ఎస్ఏలు కంపెనీ మేనేజ్‌మెంట్‌కు రుజువు (ఆడియో/ వీడియో రికార్డింగ్) తో పాటుగా రిపోర్ట్ చేస్తారు. కంపెనీ ఈ రిపోర్ట్ అందుకున్న తర్వాత, అధిక డిస్కౌంట్ల విషంలో సదరు డీలర్‌షిప్ నుండి Maruti Suzuki వివరణ కోరుతుంది. అవసరమైతే, వారిపై జరిమానాలు కూడా విధిస్తుంది.

Maruti Suzuki సంస్థకి భారీ షాక్.. రూ.200 కోట్ల జరిమానా విధించిన సిసిఐ!

ఈ విషయంలో ఆరోపణలు ఎదుర్కుంటున్న డీలర్, Maruti Suzuki ని సంతృప్తి పరచేలా వివరణ ఇవ్వకపోయినట్లయితే, సదరు డీలర్‌షిప్ మరియు దాని ఉద్యోగులపై కంపెనీ జరిమానా విధిస్తుంది. అంతేకాదు, కొన్ని సందర్భాల్లో, సరఫరా నిలిపివేసే ప్రమాదం కూడా ఉంది.

Maruti Suzuki సంస్థకి భారీ షాక్.. రూ.200 కోట్ల జరిమానా విధించిన సిసిఐ!

కాగా, ఈ సిసిఐ ఆర్డర్‌పై Maruti Suzuki స్పందిస్తూ.. "ఆగస్టు 23, 2021 వ తేదీ నాటి ఆర్డర్‌ను తాము పరిశీలిస్తున్నామని మరియు చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. Maruti Suzuki India Limited ఎల్లప్పుడూ తమ వినియోగదారుల ఉత్తమ ప్రయోజనాల కోసం పనిచేస్తుందని మరియు భవిష్యత్తులోనూ దీనిని కొనసాగిస్తుందని తెలిపింది."

Most Read Articles

English summary
Maruti suzuki violates business practices cci imposes rs 200 crore penalty details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X