పెరిగిన 2021 ఎమ్‌జి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ ధరలు; కొత్త ధరల జాబితా

చైనీస్ కార్ బ్రాండ్ ఎమ్‌జి మోటార్ ఇండియా, ఇటీవలే భారత మార్కెట్లో విడుదల చేసిన కొత్త 2021 హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త మోడల్‌లో ఎంపిక చేసిన వేరియంట్‌లపై గరిష్టంగా రూ.10,000 వరకు ధరలు పెరిగాయి.

పెరిగిన 2021 ఎమ్‌జి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ ధరల; కొత్త ధరల జాబితా

ధరల పెంపు తర్వాత కొత్త 2021 ఎమ్‌జి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ ధరలు ఇప్పుడు రూ.12.90 లక్షల నుండి రూ.18.63 లక్షల మధ్యలో ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను ఈ ఏడాది జనవరిలోనే మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే.

పెరిగిన 2021 ఎమ్‌జి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ ధరల; కొత్త ధరల జాబితా

ఎమ్‌జి హెక్టర్ స్టైల్, సూపర్, స్మార్ట్ మరియు షార్ప్ అనే నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. వీటిలో ‘స్టైల్' మరియు ‘సూపర్' వేరియంట్ల ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. టాప్-ఎండ్ వేరియంట్ల ధరలు మాత్రం పెరిగాయి.

MOST READ:సైకిల్‌పై కేరళ నుంచి కాశ్మీర్ ప్రయాణానికి సిద్దమైన టీ అమ్మే కుర్రాడు, ఎందుకో మరి

పెరిగిన 2021 ఎమ్‌జి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ ధరల; కొత్త ధరల జాబితా

కొత్త 2021 ఎమ్‌జి హెక్టర్ ఎస్‌యూవీ వేరియంట్ వారీ ధరలను క్రింది పట్టికలో గమనించవచ్చు:

Petrol Old Price New Price Difference
Style ₹12.90 Lakh
Super ₹13.89 Lakh
Smart DCT ₹16.42 Lakh ₹16.52 Lakh ₹10,000
Sharp DCT ₹18.00 Lakh ₹18.10 Lakh ₹10,000
Sharp DCT Dual Tone ₹18.20 Lakh ₹18.30 Lakh ₹10,000
Petrol - Hybrid
Super ₹14.40 Lakh
Smart ₹15.66 Lakh ₹15.76 Lakh ₹10,000
Sharp ₹17.00 Lakh ₹17.10 Lakh ₹10,000
Diesel
Style ₹14.21 Lakh
Super ₹15.31 Lakh
Smart ₹16.92 Lakh ₹17.02 Lakh ₹10,000
Sharp ₹18.33 Lakh ₹18.43 Lakh ₹10,000
Sharp Dual Tone ₹18.53 Lakh ₹18.63 Lakh ₹10,000

గమనిక: అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ)

పెరిగిన 2021 ఎమ్‌జి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ ధరల; కొత్త ధరల జాబితా

ధరలలో మార్పు మినహా కొత్త 2021 ఎమ్‌జి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్‌లో వేరే ఏ ఇతర మార్పులు లేవు. ఇటీవలే విడుదలైన ఈ కొత్త మోడల్ ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్లలో భారీ మార్పులు ఉన్నాయి.

MOST READ:విమనాలు ల్యాండ్ అయ్యేటప్పుడు వాటర్ సెల్యూట్ ఎదుకు చేస్తారో మీకు తెలుసా..?

పెరిగిన 2021 ఎమ్‌జి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ ధరల; కొత్త ధరల జాబితా

ముందుగా ఎక్స్టీరియర్ మార్పులను గమనిస్తే, ఈ కొత్త 2021 ఎమ్‌జి హెక్టర్ ఇప్పుడు సరికొత్త క్రోమ్-స్టడెడ్ ఫ్రంట్ గ్రిల్, పెద్ద 18-ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఎల్‌ఈడి టెయిల్స్ లైట్స్ మధ్యలో రెడ్ స్ట్రిప్‌ను రీప్లేస్ చేసే బ్లాక్-అవుట్ ఎలిమెంట్ మరియు పైన రూఫ్ బ్లాక్ కలర్‌తో కూడిన డ్యూయల్-టోన్ పెయింట్ స్కీమ్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.

పెరిగిన 2021 ఎమ్‌జి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ ధరల; కొత్త ధరల జాబితా

ఇంటీరియర్స్ విషయానికి వస్తే, కొత్త ఎమ్‌జి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్‌లో ఆటో-డిమ్మింగ్ ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్, వైర్‌లెస్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్ మరియు ‘హింగ్లిష్' వాయిస్ కమాండ్స్‌ను సపోర్ట్ చేసే కొత్త ఐ-స్మార్ట్ కనెక్టింగ్ టెక్నాలజీ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

MOST READ:అంబానీ ఇంట చేరిన మరో 3 లగ్జరీ కార్లు ; వివరాలు

పెరిగిన 2021 ఎమ్‌జి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ ధరల; కొత్త ధరల జాబితా

పాత తరం మోడల్‌లో కనిపించిన 10.4 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్ వంటి మరెన్నో ఫీచర్లు ఈ కొత్త మోడల్‌లోనూ ఉన్నాయి.

పెరిగిన 2021 ఎమ్‌జి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ ధరల; కొత్త ధరల జాబితా

ఇంజన్ పరంగా కొత్త 2021 ఎమ్‌జి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్‌లో ఎలాంటి మార్పులు లేవు. ఇందులోని 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ 140 బిహెచ్‌పి పవర్‌ను మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ పెట్రోల్ ఇంజన్ ఆప్షనల్ 48వి హైబ్రిడ్ సిస్టమ్‌తో లభిస్తుంది.

MOST READ:ఔరా.. ఏమి క్రియేషన్.. స్కూటర్ సైకిల్ అయిపోయింది

పెరిగిన 2021 ఎమ్‌జి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ ధరల; కొత్త ధరల జాబితా

ఇది డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో కూడా లభిస్తుంది. ఇందులోని 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ 170 బిహెచ్‌పి పవర్‌ను మరియు 350 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటాయి. పెట్రోల్ ఆప్షనల్ సెవన్-స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.

Most Read Articles

English summary
New 2021 MG Hector Facelift Prices Increased On Select Variants; New Price List. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X