బుకింగ్స్‌లో దూసుకెళ్తున్న ఎమ్‌జి జెడ్ఎస్ ఎలక్ట్రిక్ కార్; కొత్త ఫైనాన్స్ స్కీమ్స్

చైనీస్ కార్ బ్రాండ్ ఎమ్‌జి మోటార్, భారత మార్కెట్లో విక్రయిస్తున్న ఏకైక ఎలక్ట్రిక్ కార్ ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ అమ్మకాలు క్రమంగా పెరుగుతున్నాయి. గడచిన జులై నెలలో ఈ కారు కోసం 600 బుకింగ్స్ వచ్చాయని కంపెనీ పేర్కొంది. ఈ విషయంపై ఎమ్‌జి మోటార్ ఇండియా ప్రెసిడెంట్ రాజీవ్ ఛాబా మాట్లాడుతూ, భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల డిమాండ్ నెమ్మదిగానే ఉన్నప్పటికీ, ఇది క్రమంగా పెరుగుతోందని అన్నారు.

బుకింగ్స్‌లో దూసుకెళ్తున్న ఎమ్‌జి జెడ్ఎస్ ఎలక్ట్రిక్ కార్; కొత్త ఫైనాన్స్ స్కీమ్స్

గత కొన్ని నెలలుగా తమ ఎలక్ట్రిక్ కార్ గురించి వచ్చే ఎంక్వైరీల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని ఆయన చెప్పారు. ప్రజలు ఎలక్ట్రిక్ కార్లను ఉపయోగించే మార్గాల గురించి మరియు వాటి వలన కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకోవాలని అన్నారు. దాదాపు 30-40 శాతం మంది కస్టమర్లు ఎలక్ట్రిక్ కార్లకు మారడానికి సిద్ధంగా ఉన్నారని ఇటీవలి సర్వేలు తెలియజేస్తున్నాయి.

బుకింగ్స్‌లో దూసుకెళ్తున్న ఎమ్‌జి జెడ్ఎస్ ఎలక్ట్రిక్ కార్; కొత్త ఫైనాన్స్ స్కీమ్స్

ఆటోమొబైల్ కంపెనీలు కూడా దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు గాను వాటి ఛార్జింగ్ సదుపాయాలను విస్తృతంగా ఏర్పాటు చేస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థలు కార్ల ఉత్పత్తితో పాటు, ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధిపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంటుందని రాజీవ్ చాబా అన్నారు.

బుకింగ్స్‌లో దూసుకెళ్తున్న ఎమ్‌జి జెడ్ఎస్ ఎలక్ట్రిక్ కార్; కొత్త ఫైనాన్స్ స్కీమ్స్

ప్రస్తుతం దాదాపుగా 90 శాతం మంది కస్టమర్లు ఇంట్లోనే తమ ఎలక్ట్రిక్ కార్లను ఛార్జ్ చేస్తున్నారని ఆయన చెప్పారు. ఒకవేళ కస్టమర్లు తమ ఇంటి వద్దనే మెరుగైన మరియు వేగవంతమైన ఛార్జింగ్ సౌకర్యాన్ని పొందినట్లయితే, ఛార్జింగ్ మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగంగా చేయవచ్చని ఆయన అభిప్రాయ పడ్డారు.

బుకింగ్స్‌లో దూసుకెళ్తున్న ఎమ్‌జి జెడ్ఎస్ ఎలక్ట్రిక్ కార్; కొత్త ఫైనాన్స్ స్కీమ్స్

ప్రస్తుతం భారతదేశంలో ఇంధన ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో, దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ విషయానికి వస్తే, ఈ ఎలక్ట్రిక్ కారుని భారతదేశంలో తొలిసారిగా జనవరి 2020లో విడుదల చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో కంపెనీ ఇందులో ఓ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ని కూడా విడుదల చేసింది.

బుకింగ్స్‌లో దూసుకెళ్తున్న ఎమ్‌జి జెడ్ఎస్ ఎలక్ట్రిక్ కార్; కొత్త ఫైనాన్స్ స్కీమ్స్

ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ ధరలు:

భారత మార్కెట్లో ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ ఎలక్ట్రిక్ కారు రెండు వేరియంట్లలో లభిస్తుంది. వీటిలో మొదటిది ఎక్సైట్ అనే బేస్ వేరియంట్ మరియు దాని ధర రూ.20.99 లక్షలుగా ఉంది. కాగా, రెండవది ఎక్స్‌క్లూజివ్ అనే టాప్-ఎండ్ వేరియంట్ మరియు దీని ధర రూ.24.18 లక్షలు (రెండు ధరలు, ఎక్స్-షోరూమ్)గా ఉంది.

బుకింగ్స్‌లో దూసుకెళ్తున్న ఎమ్‌జి జెడ్ఎస్ ఎలక్ట్రిక్ కార్; కొత్త ఫైనాన్స్ స్కీమ్స్

ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ పవర్‌ట్రైన్:

ఎమ్‌జి జెడ్ఎస్ ఎలక్ట్రిక్ కారులో ఉపయోగించిన ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 141 బిహెచ్‌పి శక్తిని మరియు 353 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కారులో అమర్చిన 44.5 కిలో వాట్ అవర్ బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఇది కేవలం 8.5 సెకన్లలోనే గంటకు 0 - 100 కిమీ వేగాన్ని చేరుకోగలదు. ఈ కారు మూడు డ్రైవింగ్ మోడ్‌లతో పాటుగా రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది.

బుకింగ్స్‌లో దూసుకెళ్తున్న ఎమ్‌జి జెడ్ఎస్ ఎలక్ట్రిక్ కార్; కొత్త ఫైనాన్స్ స్కీమ్స్

ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ రేంజ్:

ఇక రేంజ్ విషయానికి వస్తే, కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ పూర్తి చార్జ్‌పై గరిష్టంగా 419 కిమీ రేంజ్‌ను ఆఫర్ చేస్తుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇది ఈ విభాగంలో లభిస్తున్న టాటా నెక్సాన్ ఈవీ రేంజ్ (312 కిమీ) కన్నా ఎక్కువ మరియు హ్యుందాయ్ కోన ఆఫర్ చేసే రేంజ్ (452 ​​కిమీ) కన్నా తక్కువ.

బుకింగ్స్‌లో దూసుకెళ్తున్న ఎమ్‌జి జెడ్ఎస్ ఎలక్ట్రిక్ కార్; కొత్త ఫైనాన్స్ స్కీమ్స్

ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ చార్జింగ్ టైం:

ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీని హోమ్ ఛార్జర్ ద్వారా 80 శాతం వరకూ ఛార్జ్ చేయటానికి సుమారు 6 నుండి 7 గంటల సమయం పడుతుంది. అదే 50 కిలోవాట్ల డిసి ఫాస్ట్ ఛార్జర్ ద్వారా అయితే, కేవలం 50 నిమిషాల్లోనే ఈ ఎస్‌యూవీని 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ కారులోని బ్యాటరీ ప్యాక్ ఎనిమిది సంవత్సరాల వారంటీతో వస్తుంది.

బుకింగ్స్‌లో దూసుకెళ్తున్న ఎమ్‌జి జెడ్ఎస్ ఎలక్ట్రిక్ కార్; కొత్త ఫైనాన్స్ స్కీమ్స్

ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ ఫీచర్లు:

ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు బ్రాండ్ యొక్క 'ఐ-స్మార్ట్' కనెక్టింగ్ టెక్నాలజీని సపోర్ట్ చేసే పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌, పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 2.5 పిఎమ్ ఎయిర్-ఫిల్టర్, కీలెస్ ఎంట్రీ, పుష్-బటన్ స్టార్ట్ / స్టాప్ మరియు స్మార్ట్‌ఫోన్ ద్వారా లేదా ఏఐ సహాయంతో మీ కారును కంట్రోల్ చేయటానికి 60కి పైగా కమాండ్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

బుకింగ్స్‌లో దూసుకెళ్తున్న ఎమ్‌జి జెడ్ఎస్ ఎలక్ట్రిక్ కార్; కొత్త ఫైనాన్స్ స్కీమ్స్

ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్:

ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ కోసం కంపెనీ ఇటీవల ఓ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను కూడా ప్రకటించింది. కస్టమర్లు ఇప్పుడు ఈ కారును ప్రతినెలా రూ.49,999 నెలవారీ చందాతో సొంతం చేయవచ్చు. ఒకేసారిగా పూర్తి మొత్తాన్ని చెల్లించి ఈ కారుని సొంతం చేసుకోలేని కస్టమర్లను దృష్టిలో ఉంచుకొని కంపెనీ ఈ చందా ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.

బుకింగ్స్‌లో దూసుకెళ్తున్న ఎమ్‌జి జెడ్ఎస్ ఎలక్ట్రిక్ కార్; కొత్త ఫైనాన్స్ స్కీమ్స్

ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ ఈఎమ్ఐ ప్లాన్:

ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ ఎలక్ట్రిక్ కారుని రూ.2.20 లక్షల డౌన్ పేమెంట్‌తో ఇంటికి తీసుకెళ్లవచ్చు. ఈ కారు ధర రూ.22 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). డౌన్‌పేమెంట్ తర్వాత, మీరు 9.8 శాతం వడ్డీ రేటు వద్ద ఈ కారు కోసం మొత్తం రూ.19.81 లక్షల రుణం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రుణాన్ని 5 సంవత్సరాలలో తిరిగి చెల్లించవచ్చు.

Most Read Articles

English summary
Mg zs electric car bags 600 bookings in july 2021 details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X