ఒలంపిక్స్‌లో ఓడినా Mary Kom కి Renault Kiger గిఫ్ట్; ఎందుకో తెలుసా?

ఇటీవల టోక్యోలో హోరాహోరీగా జరిగిన Olympic Games లో భారతీయ ఆటగాళ్లు అద్భుతమైన ప్రతిభను కనపరచి మొత్తం 7 మెడల్స్ కైవసం చేసుకున్నారు. Tokyo Olympics లో గెలిచిన ఆటగాళ్లను యావత్ భారతదేశం ఎంతగానో కొనియాడుతోంది. అంతే కాకుండా వీరిని మరింత ప్రోత్సహించడానికి ప్రభుత్వాలు మరియు ప్రవైట్ వ్యక్తులు చాలా గిఫ్ట్స్ కూడా అందిస్తున్నారు.

Mary Kom కి Renault Kiger గిఫ్ట్; ఎందుకో తెలుసా?

Olympic మెడల్స్ గెలిచిన మీరాబాయి చాను మరియు లవ్లినా బోర్గోహైన్ కు Renault Company కొత్త Renault Kiger ఎస్‌యూవీలను అందించారు. అయితే ఇప్పుడు Wrestling లో గెలిచిన రవికుమార్ దహియా, బజరంగ్ పునియా ఇద్దరికీ కూడా కంపెనీ Renault Kiger ఎస్‌యూవీలను అందించింది. ఈ ఒలంపిక్ గేమ్స్ లో చివరిదాకా అది ఓడిపోయిన ఆటగాళ్లను కూడా కంపెనీలు ప్రోత్సిస్తున్నాయి. ఇందులో భాగంగానే టాటా మోటార్స్ కంపెనీ హాకీలో చివరియాదాకా ఆడి ఓడిన వారికి టాటా ఆల్ట్రోజ్ గిఫ్ట్ గా అందించింది.

Mary Kom కి Renault Kiger గిఫ్ట్; ఎందుకో తెలుసా?

అయితే ఇప్పుడు Renault కంపెనీ తన కొత్త Kiger SUV ని Mary Kom (మేరీ కోమ్) కి అందించింది. అయితే మేరీ కోమ్ 2020 ఒలంపిక్ గేమ్స్ లో బాక్సింగ్ విభాగంలో పోరాడి ఓడిపోయింది. కానీ Mary Kom యొక్క ప్రతిభను గుర్తించి, భవిష్యత్ లో ఆడబోయే ఆటల్లో ఉత్తమ ప్రతిభ చూపాలని ప్రోత్సహిస్తూ కంపెనీ SUV ని అందించింది. Mary Kom 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచింది.

Mary Kom కి Renault Kiger గిఫ్ట్; ఎందుకో తెలుసా?

Renault India తన Kiger Suv RXT(O) వేరియంట్‌ను ఇటీవల మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త Renault Kiger Suv RXT(O) ప్రారంభ ధర రూ. 7.37 లక్షలు. Kiger Suv RXT(O) పెట్రోల్ ఇంజిన్‌తో మాత్రమే అందించబడుతుంది. అయితే, ఇది మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ల ఎంపికను పొందుతుంది.

Mary Kom కి Renault Kiger గిఫ్ట్; ఎందుకో తెలుసా?

Kiger యొక్క కొత్త RXT(O) వేరియంట్ ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఆర్ఎక్స్‌టి వేరియంట్ మీద ఆధారపడి ఉంటుంది. కొత్త వేరియంట్ Kiger RXZ వేరియంట్ ని టాప్-స్పెక్ వేరియంట్ క్రింద ఉంచబడింది. ఇది అనేక అదనపు ఫీచర్స్ కలిగి ఉంటుంది.

Mary Kom కి Renault Kiger గిఫ్ట్; ఎందుకో తెలుసా?

కొత్త RXT(O) వేరియంట్ అనేక ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ తో పాటు పిఎమ్2.5 అడ్వాన్స్‌డ్ అట్మాస్ఫియరిక్ ఎయిర్ ఫిల్టర్ ఉంది, ఇది క్యాబిన్లోని గాలిని శుద్ధి చేయడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఫీచర్ ఇందులో చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు.

Mary Kom కి Renault Kiger గిఫ్ట్; ఎందుకో తెలుసా?

ఇవి మాత్రమే కాకూండా ఇందులో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే ఉన్నాయి. ఇది 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు స్టీరింగ్-మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్‌ను కూడా పొందుతుంది. ఈ కొత్త వేరియంట్ క్విడ్ మరియు ట్రైబర్ మాదిరిగానే ఎల్ఈడీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు పుష్-బటన్ స్టార్ట్‌తో కీలెస్ ఎంట్రీ వంటి వాటిని కలిగి ఉంటుంది.

Mary Kom కి Renault Kiger గిఫ్ట్; ఎందుకో తెలుసా?

Renault కంపెనీ తన కొత్త Kiger యొక్క కొత్త RXT(O) వేరియంట్‌ను ప్రారంభించడంతో, భారతీయ మార్కెట్లో తన పోర్ట్‌ఫోలియోను విస్తరించాలని చూస్తోంది. అంతే కాకుండా కంపెనీ యొక్క విక్రయాలను కూడా పెంచడానికి సన్నాహాలను సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉండే కొత్త RXT(O) వేరియంట్‌ నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి RXE, RXL, RXT మరియు RXZ వేరియంట్స్.

Mary Kom కి Renault Kiger గిఫ్ట్; ఎందుకో తెలుసా?

Kiger RXT(O) వేరియంట్ లోని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో నాలుగు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబిడీ, రియర్ పార్కింగ్ సెన్సార్లు, రియర్ వ్యూ కెమెరా మరియు ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్ వంటి వాటిని కలిగి ఉంటుంది. ఇవన్నీ కూడా వాహనదారుని భద్రతకు అనుకూలంగా ఉంటాయి.

Mary Kom కి Renault Kiger గిఫ్ట్; ఎందుకో తెలుసా?

Kiger RXT రెండు ఇంజిన్ ఆప్షన్‌లలో అమ్ముడవుతోంది. ఇందులో ఒకటి 1.0-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ కాగా, మరొకటి 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్. ఇందులోని 1.0-లీటర్ న్యాచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 72 బిహెచ్‌పి పవర్ మరియు 96 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ మరియు 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికతో అందించబడింది.

Mary Kom కి Renault Kiger గిఫ్ట్; ఎందుకో తెలుసా?

అదేవిధంగా 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ 99 బిహెచ్‌పి పవర్ మరియు 160 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది మాన్యువల్ గేర్‌బాక్స్ ఎంపికతో మాత్రమే కంపెనీ ఈ ఇంజిన్‌ను మార్కెట్‌లో విక్రయిస్తోంది. మొత్తానికి Kiger RXT వాహనదారునికి చాలా అనుకూలంగా ఉంటుంది.దేశీయ మార్కెట్లో ఉన్న Renault Kiger RXT అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఇది దేశీయ మార్కెట్లో కంపెనీ మంచి అమ్మకాలు జరపడానికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది.

Most Read Articles

English summary
Renault india gifts new kiger suv to olympic medalist mc mary kom details
Story first published: Monday, August 30, 2021, 15:27 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X