భారత మార్కెట్లో కొత్త వేరియంట్ లాంచ్ చేసిన టాటా మోటార్స్; ధర & పూర్తి వివరాలు

భారతదేశంలో ప్రముఖ వాహన తయారీ సంస్థగా పేరుగాంచిన టాటా మోటార్స్ తన బ్రాండ్ నుంచి కొత్త వేరియంట్ ని విడుదల చేసింది. కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త వేరియంట్ 'టాటా టియాగో ఎక్స్‌టి (ఓ)'. దేశీయ మార్కెట్లో ఈ కొత్త వేరియంట్ ధర రూ. 5.48 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌). ఈ కొత్త వేరియంట్ ప్రస్తుతం ఉన్న టియాగో యొక్క ఎక్స్‌టి వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది.

భారత మార్కెట్లో కొత్త వేరియంట్ లాంచ్ చేసిన టాటా మోటార్స్; ధర & పూర్తి వివరాలు

కంపెనీ ఇప్పుడు ఈ కొత్త వేరియంట్ ని కూడా తన అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం ఈ కొత్త వేరియంట్ కేవలం ఒక మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మార్కెట్లో ప్రారంభించబడింది. టాటా మోటార్స్ ఈ వేరియంట్‌ను టియాగో బేస్ ఎక్స్‌ఇ మరియు మిడ్ ఎక్స్‌టి వేరియంట్ మధ్య ఉంచారు.

భారత మార్కెట్లో కొత్త వేరియంట్ లాంచ్ చేసిన టాటా మోటార్స్; ధర & పూర్తి వివరాలు

టియాగో ఎక్స్‌ఇ వేరియంట్‌తో పోలిస్తే కొత్త ఎక్స్‌టి (ఓ) వేరియంట్‌కు ధర రూ. 47,900 ఎక్కువగా ఉంటుంది. ఈ వేరియంట్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండి, వాహనదారునికి చాలా అనుకూలంగా ఉంటుంది.

భారత మార్కెట్లో కొత్త వేరియంట్ లాంచ్ చేసిన టాటా మోటార్స్; ధర & పూర్తి వివరాలు

టాటా టియాగో ఎక్స్‌టిలో ఎల్‌ఈడీ టర్న్ ఇండికేటర్, బాడీ-కలర్ డోర్ హ్యాండిల్స్, 14 ఇంచెస్ స్టీల్ రిమ్స్, స్టీరింగ్ వీల్‌పై ప్రీమియం పియానో ​​బ్లాక్ ఫినిషింగ్, ఇంటీరియర్ లాంప్స్ మరియు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో బాడీ-కలర్ డోర్ ఓఆర్‌విఎంలు మాత్రమే కాకుండా, చుట్టూ పియానో ​​బ్లాక్ ఫినిషింగ్ ఇవ్వబడింది.

భారత మార్కెట్లో కొత్త వేరియంట్ లాంచ్ చేసిన టాటా మోటార్స్; ధర & పూర్తి వివరాలు

ఇవి మాత్రమే కాకూండా ఈ వేరియంట్‌లో స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్స్, డే అండ్ నైట్ ఐఆర్‌విఎంలు, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్‌విఎంలు, నాలుగు స్పీకర్లు, కీలెస్ ఎంట్రీ, ఫ్రంట్ అండ్ రియర్ పవర్ విండోస్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ వంటి ఫీచర్స్ కూడా ఇందులో ఉంటాయి.

భారత మార్కెట్లో కొత్త వేరియంట్ లాంచ్ చేసిన టాటా మోటార్స్; ధర & పూర్తి వివరాలు

ఈ కొత్త వేరియంట్ లో రియర్ వ్యూ మానిటర్, హర్మాన్ ఆడియో, ఆపిల్ కార్ప్లే & ఆండ్రాయిడ్ ఆటో, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్స్ అందుబాటులో లేదు.

భారత మార్కెట్లో కొత్త వేరియంట్ లాంచ్ చేసిన టాటా మోటార్స్; ధర & పూర్తి వివరాలు

ఈ కొత్త వేరియంట్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, కంపెనీ కొత్త టాటా టియాగో ఎక్స్‌టి (ఓ) యొక్క ఇంజిన్‌లో ఎటువంటి మార్పులు చేయలేదు. ఇందులో ప్రస్తుతం ఉన్న బీఎస్ 6 ఆధారిత 1.2-లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజన్ ఉపయోగించబడింది. ఈ ఇంజన్ 6000 ఆర్‌పిఎమ్ వద్ద 85 బిహెచ్‌పి పవర్ మరియు 3300 ఆర్‌పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇందులో 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఉపయోగించబడింది.

భారత మార్కెట్లో కొత్త వేరియంట్ లాంచ్ చేసిన టాటా మోటార్స్; ధర & పూర్తి వివరాలు

కొత్త టియాగో భారత మార్కెట్లో మారుతి సుజుకి సెలెరియో, వాగన్ ఆర్, హ్యుందాయ్ సాంట్రో మరియు డాట్సన్ గో వంటి వాటికీ ప్రత్యర్థిగా ఉంటుంది.

కంపెనీ ఇటీవల అందించిన అధికారిక సమాచారం ప్రకారం, 2025 నాటికి కంపెనీ కొత్తగా 10 బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు తెలిసింది. దీని గురించి కంపెనీ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ అధికారికంగా సమాచారం అందించారు.

Most Read Articles

English summary
Tata Tiago XT(O) Launched In India At Rs 5.48 Lakh. Read in Telugu.
Story first published: Wednesday, June 30, 2021, 9:41 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X