పండుగ సీజన్‌లో రానున్న సరికొత్త ఎస్‌యూవీలు: Punch, XUV700, Astor..

భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎస్‌యూవీ విభాగం శరవేగంగా విస్తరిస్తోంది. ఈ విభాగంలో ఇప్పటికే అనేక కొత్త మోడళ్లు అందుబాటులోకి రాగా, త్వరలోనే మరిన్ని కొత్త కార్లు విడుదల కాబోతున్నాయి. ఆటోమొబైల్ కంపెనీలు ఇప్పటికే దేశీయ మార్కెట్లో ఆవిష్కరించిన తమ కొత్త ఎస్‌యూవీల అమ్మకాలను ఈ పండుగ సీజన్‌లో ప్రారంభించే అవకాశం ఉంది.

పండుగ సీజన్‌లో రానున్న సరికొత్త ఎస్‌యూవీలు: Punch, XUV700, Astor..

సాధారణంగా, భారతదేశంలో దీపావళి పండుగ సెంటిమెంట్ చాలా బలంగా ఉంటుంది. ఈ సీజన్ లో వాహనాల అమ్మకాలు కూడా జోరుగా ఉంటాయి. ఈ పండుగ సెంటిమెంట్ ను క్యాష్ చేసుకునేందు కార్ కంపెనీలు కూడా తమ కొత్త కార్లను ఇదే సమయంలో విడుదల చేస్తుంటారు. ఈ నేపథ్యంలో, ప్రస్తుత పండుగ సీజన్ లో విడుదల కాబోయే టాప్ 5 ఎస్‌యూవీల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం రండి...

పండుగ సీజన్‌లో రానున్న సరికొత్త ఎస్‌యూవీలు: Punch, XUV700, Astor..

1. Tata Punch

భారత ఆటోమొబైల్ దిగ్గజం Tata Motors నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిన్న ఎస్‌యూవీ 'Tata Punch' (టాటా పంచ్). మైక్రో ఎస్‌యూవీ విభాగంలో రానున్న ఈ చిన్న కారు ఇప్పటికే ఈ విభాగంలో ఉన్న మరికొన్ని మోడళ్లతో పాటుగా హ్యాచ్‌బ్యాక్ విభాగంలోని కాంపాక్ట్ కార్లతో కూడా పోటీపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.

పండుగ సీజన్‌లో రానున్న సరికొత్త ఎస్‌యూవీలు: Punch, XUV700, Astor..

సరసమైన ధర మరియు పవర్‌ఫుల్ ఇంజన్ తో ఇది బడ్జెట్ కార్ ప్రియులను మరియు చిన్న కుటుంబాలను ఆకర్షించే అవకాశం ఉంది. టాటా మోటార్స్ ఈ కారును రెండు ఇంజన్ ఆప్షన్లతో విడుదల చేయవచ్చని సమాచారం. ఇందులోని ఎంట్రీ లెవల్ వేరియంట్లలో 1.2-లీటర్, 3-సిలిండర్ రివోట్రాన్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 86 బిహెచ్‌పి పవర్‌ను మరియు 113 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఏఎమ్‌టి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభించే అవకాశం ఉంది.

పండుగ సీజన్‌లో రానున్న సరికొత్త ఎస్‌యూవీలు: Punch, XUV700, Astor..

ఇకపోతే, ఇందులోని రెండవ ఇంజన్ ఆప్షన్ 1.2-లీటర్, టర్బో-పెట్రోల్ ఇంజన్. దీనిని టాప్-ఎండ్ వేరియంట్లలో ఆఫర్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే టాటా ఆల్ట్రోజ్ ఐటర్బో వేరియంట్లో దీనిని ఉపయోగిస్తున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 110 బిహెచ్‌పి పవర్‌ను మరియు 140 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది.

పండుగ సీజన్‌లో రానున్న సరికొత్త ఎస్‌యూవీలు: Punch, XUV700, Astor..

టాటా మోటార్స్ యొక్క ఎంట్రీ లెవల్ ఎస్‌యూవీగా వస్తున్న Tata Punch ను కంపెనీ తమ పోర్ట్‌ఫోలియోలో టాటా నెక్సాన్ కు దిగువన ఉంచనుంది. భారత మార్కెట్లో ఇది Maruti Suzuki Ignis, Ford Freestyle మరియు Mahindra KUV100 వంటి కార్లతో పోటీపడుతుంది. అంతేకాకుండా, రాబోయే రోజుల్లో ఇది Hyundai Casper కి కూడా పోటీగా నిలిచే అవకాశం ఉంది. మార్కెట్లో టాటా పంచ్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 4.5 లక్షలతో ప్రారంభమవుతుందని అంచనా.

పండుగ సీజన్‌లో రానున్న సరికొత్త ఎస్‌యూవీలు: Punch, XUV700, Astor..

2. Mahindra XUV700

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా (Mahindra) ఆవిష్కరించిన తమ లేటెస్ట్ ఫుల్లీ టెక్ లోడెడ్ ఎస్‌యూవీ మహీంద్రా ఎక్స్‌యూవీ 700 (Mahindra XUV700) ని అక్టోబర్ 2వ తేదీన అధికారికంగా మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ కారు 5-సీటర్ మరియు 7-సీటర్ కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంటుంది.

పండుగ సీజన్‌లో రానున్న సరికొత్త ఎస్‌యూవీలు: Punch, XUV700, Astor..

Mahindra XUV700 రెండు ఇంజన్ ఆప్షన్‌లలో అందించబడుతుంది, ఇందులో మొదటిది 2.0-లీటర్ ఎమ్‌స్టాలియన్ టర్బో-పెట్రోల్ ఇంజన్. ఇది గరిష్టంగా 188 బిహెచ్‌పి పవర్‌ను మరియు 380 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే, రెండవది 2.2-లీటర్ డీజిల్ ఇంజన్, ఇది గరిష్టంగా 153 బిహెచ్‌పి పవర్‌ను మరియు 360 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది.

పండుగ సీజన్‌లో రానున్న సరికొత్త ఎస్‌యూవీలు: Punch, XUV700, Astor..

Mahindra XUV700 ఎస్‌యూవీని కంపెనీ ఫస్ట్ ఇన్ సెగ్మంట్ ఫీచర్లతో ప్రవేశపెట్టనుంది. బహుళ వేరియంట్లలో విడుదల కానున్న ఈ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ. 11.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంటుంది. ఇందులో లెవల్-1 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) సేఫ్టీ ఫీచర్లను కంపెనీ అందించనుంది. వీటిలో సెగ్మెంట్-ఫస్ట్ అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, బ్లైండ్‌స్పాట్ డిటెక్షన్, అటానమస్ బ్రేకింగ్ మరియు లేన్-లీప్ అసిస్ట్ వంటి మరెన్నో ఫీచర్లు ఉన్నాయి. ఇది ఈ విభాగంలో Tata Safari, MG Hector Plus మరియు Hyundai Alcazar వంటి కార్లతో పోటీపడుతుంది.

పండుగ సీజన్‌లో రానున్న సరికొత్త ఎస్‌యూవీలు: Punch, XUV700, Astor..

3. MG Astor

చైనాకి చెందిన కార్ల తయారీ సంస్థ MG Motor India దేశీయ విపణిలో విక్రయిస్తున్న MG ZS EV ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ యొక్క పెట్రోల్ వెర్షన్ ఎస్‌యూవీ MG Aster (ఎమ్‌జి ఆస్టర్) ను కూడా కంపెనీ ఈ పండుగ సీజన్ లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అసిస్టెంట్ మరియు అడ్వాన్స్‌డ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) వంటి అధునాతన టెక్నాలజీలను కలిగి ఉంటుంది.

పండుగ సీజన్‌లో రానున్న సరికొత్త ఎస్‌యూవీలు: Punch, XUV700, Astor..

ఈ కారులో అటానమస్ లెవల్-2 సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ ఉంటుందని సమాచారం. ఇంకా ఇందులో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్-కీప్ అసిస్ట్ వంటి అనేక స్మార్ట్ ఫీచర్లు ఉంటాయని తెలుస్తోంది. MG Aster ఇంజన్‌ను కంపెనీ వెల్లడించలేదు. అయితే, సమాచారం ప్రకారం, ఈ ఎస్‌యూవీలో కేవలం ఒకేఒక ఇంజన్ ఆప్షన్ మాత్రమే ఉంటుందని తెలుస్తోంది. ఇందులో ఉపయోగించబోయే 1.3-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 163 బిహెచ్‌పి పవర్‌ను మరియు 230 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది.

పండుగ సీజన్‌లో రానున్న సరికొత్త ఎస్‌యూవీలు: Punch, XUV700, Astor..

4. Volkswagen Taigun

జర్మన్ కార్ బ్రాండ్ Volkswagen నుండి ఎదురుచూస్తున్న మోడళ్లలో Taigun (టైగన్) ఎస్‌యూవీ కూడా ఒకటి. Volkswagen Taigun ఎస్‌యూవీని కంపెనీ సెప్టెంబర్ 23వ తేదీ మార్కెట్లో విడుదల చేయనుంది. స్కోడా విడుదల చేసిన కుషాక్ (Kushaq) ను తయారు చేసిన MQB-A0-IN ప్లాట్‌ఫామ్ పైనే ఈ కొత్త ఎస్‌యూవీని కూడా నిర్మించనున్నారు.

పండుగ సీజన్‌లో రానున్న సరికొత్త ఎస్‌యూవీలు: Punch, XUV700, Astor..

ఇది 1.0-లీటర్ టిఎస్ఐ మరియు 1.5-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. మార్కెట్లో ఈ కారు ప్రారంభ ధర రూ. 10 లక్షల (ఎక్స్-షోరూమ్) గా ఉంటుందని అంచనా. ఇది ఈ విభాగంలో Kia Seltos, Hyundai Creta, Skoda Kushaq, Renault Duster మరియు Nissan Kicks వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

పండుగ సీజన్‌లో రానున్న సరికొత్త ఎస్‌యూవీలు: Punch, XUV700, Astor..

5. 2021 Force Gurkha

ఆఫ్-రోడ్ ప్రియులను అలరించేందుకు వస్తున్న కొత్త 2021 ఫోర్స్ గూర్ఖా (2021 Force Gurkha) పూర్తిగా సరికొత్త డిజైన్ మరియు లేటెస్ట్ టెక్ ఫీచర్లతో అందుబాటులోకి రానుంది. శక్తివంతమైన బిఎస్6 ఇంజన్, మోడ్రన్ డిజైన్, స్పేసియస్ ఇంటీరియర్స్ తో ఇది ఈ విభాగంలో Mahindra Thar కి గట్టి పోటీ ఇవ్వనుంది. ఈ ఎస్‌యూవీలో 140 బిహెచ్‌పి పవర్ మరియు 321 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే మెర్సిడెస్ బెంజ్ నుండి సేకరించిన 2.2 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు.

Most Read Articles

English summary
Top 5 upcoming suv s to be launched in india in this festive season details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X