సింగిల్ చార్జ్‌పై 165 కిమీ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ కార్గో త్రీవీలర్.. వ్యాపారస్థులకు ఇక పండగే..!

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వ్యాపారం జోరుగా సాగుతోంది. ఈవీ మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా కొత్త తయారీదారులు కూడా పుట్టుకొస్తున్నారు.

Recommended Video

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్

తాజాగా, ఎలక్ట్రిక్ మొబిలిటీ స్టార్టప్ దండేరా వెంచర్స్ (Dandera Ventures) భారతదేశంలో తమ కార్గో ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ ఆటువా (OTUA) ని విడుదల చేసింది. వివిధ రకాల సామర్థ్యాలతో లభించే దండేరా ఆటువా (Dandera Otua) ఎలక్ట్రిక్ కార్గో త్రీవీలర్ ధరలు రూ.3.5 లక్షల నుండి రూ.5.5 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి.

సింగిల్ చార్జ్‌పై 165 కిమీ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ కార్గో త్రీవీలర్.. వ్యాపారస్థులకు ఇక పండగే..!

దండేరా ఆటువా ఎలక్ట్రిక్ త్రీవీలర్ ట్రెడిషనల్ ఆటోరిక్షాల కన్నా భిన్నంగా, పెద్దదిగా ఉంటుంది. డ్రైవర్ కోసం ప్రత్యేకమైన క్యాబిన్ మరియు కార్గో కోసం సెపరేషన్‌ను కలిగి ఉంటుంది. ఈ కార్గో ఆటోరిక్షాలను ఒక్కసారిగా కొనుగోలు చేయలేని కస్టమర్ల కోసం కంపెనీ సబ్‌స్క్రిప్షన్ పద్ధతిని కూడా అందిస్తోంది. అత్యధిక వాల్యూమ్, అత్యధిక లోడ్ మోసే సామర్థ్యం (900 కేజీలు) కలిగి ఈ ఎలక్ట్రిక్ కార్గో త్రీవీలర్లు సింగిల్ చార్జ్ పై గరిష్టంగా 165 కిలోమీటర్ల సుదీర్ఘ రేంజ్‌ను అందిస్తాయని కంపెనీ పేర్కొంది.

సింగిల్ చార్జ్‌పై 165 కిమీ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ కార్గో త్రీవీలర్.. వ్యాపారస్థులకు ఇక పండగే..!

ఈ ఎలక్ట్రిక్ త్రీవీలర్లు అధిక రేంజ్‌ను అందించడంతో పాటుగా, ఇవి మోడ్రన్ కార్లలో మాదిరిగా అనేక ఇండస్ట్రీ-టాప్ ఫీచర్లను కలిగి ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఇ-వాహనాలు లాజిస్టిక్స్ మరియు లాస్ట్-మైల్ డెలివరీ కంపెనీల ఉపయోగం కోసం రూపొందించబడ్డాయని మరియు ఇవి భారతదేశం అంతటా ఎంపిక చేసిన మార్కెట్‌లలో వ్యక్తిగత డ్రైవర్లు లేదా యజమానుల ద్వారా రిటైల్ కొనుగోలుకు త్వరలోనే అందుబాటులోకి వస్తాయని దండేరా వెంచర్స్ తెలిపింది.

సింగిల్ చార్జ్‌పై 165 కిమీ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ కార్గో త్రీవీలర్.. వ్యాపారస్థులకు ఇక పండగే..!

అటువా (OTUA) అనేది పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనంగా రూపొందించబడింది మరియు ఇది 100 శాతం స్వదేశీ (మేడ్ ఇన్ ఇండియా) ఉత్పత్తి. ఈ ఎలక్ట్రిక్ త్రీవీలర్‌లో ఉపయోగించిన బ్యాటరీలతో సహా అన్ని విడిభాగాలు మరియు భాగాలను పూర్తిగా భారతదేశంలోనే తయారు చేయబడ్డాయి. ఇది పూర్తిగా భారతదేశంలోనే డిజైన్ చేయబడి రూపొందించబడిన పూర్తి మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తి అని కంపెనీ తెలిపింది. దండేరా వెంచర్స్ యొక్క ఆర్ అండ్ డి విభాగం OTUA యొక్క బ్యాటరీ మరియు డ్రైవ్‌ట్రెయిన్‌లను తుది కస్టమర్ అంచనాలు మరియు ప్రస్తుత పరిశ్రమ ప్రమాణం రెండింటినీ అధిగమించేలా డిజైన్ చేసి రూపొందించింది.

సింగిల్ చార్జ్‌పై 165 కిమీ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ కార్గో త్రీవీలర్.. వ్యాపారస్థులకు ఇక పండగే..!

ఈ సందర్భంగా, దండేరా వెంచర్స్ వ్యవస్థాపకుడు మరియు సీఈఓ క్షితిజ్ బజాజ్ మాట్లాడుతూ, "కార్గో ఈవీ నుండి లాస్ట్ మైల్ డెలివరీ డ్రైవర్లు మరియు ఫ్లీట్ ఓనర్‌లు ఆశించే ప్రతి అంశాన్ని ఆటువా తృప్తిపరుస్తుంది. వరల్డ్ క్లాస్ మరియు ఇండస్ట్రీ లీడింగ్ డ్రైవర్ ఎర్గోనామిక్స్ మరియు సేఫ్టీతో రేంజ్, వాల్యూమ్, సామర్థ్యం పరంగా పూర్తి పనితీరును అందించే ఆటువా, గ్లోబల్ లాజిస్టిక్స్ మరియు లాస్ట్ మైల్ డెలివరీ పరిశ్రమ కోసం స్థిరమైన మొబిలిటీకి మారడానికి రాజీలేని దృష్టిని అందించే మొదటి కార్గో ఈవీ" అని అన్నారు.

సింగిల్ చార్జ్‌పై 165 కిమీ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ కార్గో త్రీవీలర్.. వ్యాపారస్థులకు ఇక పండగే..!

ఆటువా లాంచ్ గురించి దండేరా వెంచర్స్ సహ-వ్యవస్థాపకుడు మరియు సీఓఓ, కనవ్ మంచాందా మాట్లాడుతూ, "దండేరా దాని ఇండస్ట్రీ లీడింగ్ కమర్షియల్ ఈవీల పోర్ట్‌ఫోలియోతో లాజిస్టిక్స్ పరిశ్రమ స్థిరమైన మొబిలిటీకి మారడాన్ని సపోర్ట్ చేయడమే కాకుండా వేగంగా ట్రాక్ చేయడానికి కట్టుబడి ఉంది. ఆటువా మరియు దండేరా రెండూ ఈవీ పరిశ్రమలో కొత్త ప్రమాణాలను సెట్ చేయడానికి అభివృద్ధి చేయబడ్డాయి. ఆటువా భారతదేశం యొక్క అత్యంత అధునాతన ఈవీగా గుర్తించబడిన చోట, దాని రోల్-అవుట్ కూడా సమర్థవంతమైన అనుకూలతను ఎనేబుల్ చేసే పద్ధతిలో ప్లాన్ చేయబడింది. ఇక భవిష్యత్తు మనదే" అని చెప్పారు.

సింగిల్ చార్జ్‌పై 165 కిమీ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ కార్గో త్రీవీలర్.. వ్యాపారస్థులకు ఇక పండగే..!

భారతదేశంలో లాస్ట్ మైల్ డెలివరీ మరియు లాజిస్టిక్స్ వ్యాపారం రాబోయే రెండు సంవత్సరాల్లో 5 బిలియన్ డాలర్కు పెరుగుతుందని అంచనా వేయబడింది. ఈ విభాగంలో కర్బన వ్యర్థాలను (కార్బన్ ఫుట్‌ప్రింట్) తగ్గించే ప్రయత్నాలలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలు మరియు ఇతర స్థిరమైన మొబిలిటీ పరిష్కారాల వైపు వినియోగదారులు మరియు తయారీదారులలో అవగాహన పెరుగుతోంది.

సింగిల్ చార్జ్‌పై 165 కిమీ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ కార్గో త్రీవీలర్.. వ్యాపారస్థులకు ఇక పండగే..!

దెండేరా వెంచర్స్ విషయానికి వస్తే, 2018లో స్థాపించబడిన, దండేరా అనేది సస్టైనబల్ మొబిలిటీపై దృష్టి సారించిన ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ కంపెనీ. ఇది ప్రపంచ స్థాయి సస్టైనబల్ మొబిలిటీ ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి మరియు మార్కెట్ చేయడానికి బలమైన దృక్పథంతో తన వ్యాపారాన్ని ప్రారంభించింది. దండేరా సంస్థను స్థాపించిన క్షితిజ్ బజాజ్ మరియు కనవ్ మంచాందాలు సీనియర్ పరిశ్రమ నిపుణులు, ఆటోమోటివ్ డిజైన్, వ్యాపార నిర్వహణ మరియు వాటి కార్యకలాపాలలో దశాబ్దాల అనుభవాన్ని కలిగి ఉన్నవారు.

సింగిల్ చార్జ్‌పై 165 కిమీ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ కార్గో త్రీవీలర్.. వ్యాపారస్థులకు ఇక పండగే..!

భారత్‌లో 'మోంట్రా ఎలక్ట్రిక్ ఆటో' విడుదల

ఇదిలా ఉంటే, దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా, తాజాగా తమిళనాడుకు చెందిన మురుగప్ప గ్రూప్ కంపెనీ 'ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఆఫ్ ఇండియా' అనుబంధ సంస్థ టిఐ క్లీన్ మొబిలిటీ మంగళవారం చెన్నైలో 'మోంట్రా ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ ఆటో' విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త 'మోంట్రా ఎలక్ట్రిక్' (Montra Electric) త్రీ-వీలర్ ఆటో ధర రూ. 3.02 లక్షలు (ఎక్స్-షోరూమ్, చెన్నై) గా ఉంది. ఇది పూర్తి చార్జ్ పై 197 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Dandera otua cargo electric three wheeler launched in india price
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X