కొత్త 2022 మోడల్ హ్యుందాయ్ వెన్యూ ఇంటీరియర్స్ ఎలా ఉన్నాయో చూడండి..

కొరియన్ కార్ బ్రాండ్ హ్యుందాయ్ (Hyundai) నుండి రాబోయే తర్వాతి కొత్త మోడల్ వెన్యూ (Venue) ఫేస్‌లిఫ్ట్. హ్యుందాయ్ వెన్యూ కాంపాక్ట్ ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేసి మూడేళ్లు పూర్తయిన నేపథ్యంలో, కంపెనీ ఇందులో ఓ కొత్త అప్‌డేటెడ్ మోడల్‌ను విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో, కొత్త 2022 మోడల్ హ్యుందాయ్ వెన్యూ (2022 Hyundai Venue) ఇప్పటికే డీలర్‌షిప్ లను చేరుకోవడం ప్రారంభించింది. తాజాగా, ఓ డీలర్ స్టాక్ యార్డులో ఉన్న వెన్యూ యొక్క ఇంటీరియర్ చిత్రాలు ఈ కారు విడుదలకే ముందే లీక్ అయ్యాయి.

కొత్త 2022 మోడల్ హ్యుందాయ్ వెన్యూ ఇంటీరియర్స్ ఎలా ఉన్నాయో చూడండి..

సమాచారం ప్రకారం, కొత్త 2022 హ్యుందాయ్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్ జూన్ 16, 2022 వ తేదీన భారత మార్కెట్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కంపెనీ ఈ కొత్త 2022 మోడల్ కోసం బుకింగ్‌లను కూడా ప్రారంభించింది. ఆసక్తిగల కస్టమర్లు కొత్త హ్యుందాయ్ వెన్యూ ఎస్‌‌యూవీని రూ.21,000 టోకెన్ అడ్వాన్స్ చెల్లించి హ్యుందాయ్ డీలర్‌షిప్‌లలో కానీ లేదా హ్యుందాయ్ ఇండియా వెబ్‌సైట్ లో క్లిక్ టు బై ప్లాట్‌ఫారమ్‌ ద్వారా కానీ బుక్ చేసుకోవచ్చు.

కొత్త 2022 మోడల్ హ్యుందాయ్ వెన్యూ ఇంటీరియర్స్ ఎలా ఉన్నాయో చూడండి..

ఓ డీలర్‌షిప్‌లో ఉన్న కొత్త 2022 హ్యుందాయ్ వెన్యూ యొక్క స్పై చిత్రాలను గమనిస్తే, ఈ సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ బ్లాక్ ఇంటీరియర్ థీమ్‌తో వస్తుందని తెలుస్తోంది. ఈ లీకైన ఫొటోలను గమనిస్తుంటే, ఇది బేస్ వేరియంట్ గా కనిపించడం లేదు, ఎందుకంటే ఈ మోడల్‌లో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు పుష్-బటన్ స్టార్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

కొత్త 2022 మోడల్ హ్యుందాయ్ వెన్యూ ఇంటీరియర్స్ ఎలా ఉన్నాయో చూడండి..

అంతేకాకుండా, ఈ ప్రత్యేకమైన వేరియంట్ తెలుపు రంగు ఎక్స్టీరియర్ పెయింట్‌ను కూడా కలిగి ఉంది. ఇంతకుముందు, 2022 హ్యుందాయ్ వెన్యూ ఎలాంటి క్యామోఫ్లేజ్ లేకుండా 'టైటాన్ గ్రే' ఎక్స్టీరియర్ కలర్ లో కనిపించింది. కొత్త హ్యుందాయ్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్ మొత్తం 7 ఎక్స్టీరియర్ కలర్ ఆప్షన్లలో అందించబడనుంది. వీటిలో టైఫూన్ సిల్వర్, టైటాన్ గ్రే, పోలార్ వైట్, ఫాంటమ్ బ్లాక్, డెనిమ్ బ్లూ, ఫైరీ రెడ్ మరియు ఫైరీ రెడ్ (డ్యూయల్-టోన్) కలర్ ఆప్షన్లు ఉన్నాయి.

కొత్త 2022 మోడల్ హ్యుందాయ్ వెన్యూ ఇంటీరియర్స్ ఎలా ఉన్నాయో చూడండి..

అలాగే, ఇదివరకు లీకైన కొత్త 2022 హ్యుందాయ్ వెన్యూ బ్రోచర్ ప్రకారం, ఈ ఎస్‌యూవీ 6 ట్రిమ్ స్థాయిలలో కూడా అందుబాటులో ఉంటుంది. ఈ బ్రోచర్ వెన్యూ యొక్క పవర్‌ట్రెయిన్ ఆప్షన్లను కూడా ధృవీకరించింది మరియు దాని ప్రకారం కొత్త 2022 హ్యుందాయ్ వెన్యూ మూడు ఇంజన్ ఆప్షన్లతో రానుంది. వీటిలో రెండు పెట్రోల్ యూనిట్లు మరియు ఒక డీజిల్ యూనిట్ ఉన్నాయి.

కొత్త 2022 మోడల్ హ్యుందాయ్ వెన్యూ ఇంటీరియర్స్ ఎలా ఉన్నాయో చూడండి..

వీటిలో మొదటిది 1.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, ఇది గరిష్టంగా 81.8 బిహెచ్‌పి పవర్ ను మరియు 114 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. కాగా, రెండవది మరింత శక్తివంతమైన టర్బోచార్జ్డ్ త్రీ-సిలిండర్ 1.0-లీటర్ పెట్రోల్ ఇంజ. ఈ ఇంజన్ గరిష్టంగా 118.4 బిహెచ్‌పి పవర్ ను మరియు 172 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే, ఇందులో ఉన్న ఏకైక డీజిల్ ఇంజన్ ఆప్షన్ 1.5-లీటర్ యూనిట్. ఇది గరిష్టంగా 98.6 బిహెచ్‌పి పవర్ ను మరియు 240 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ ని ఉత్పత్తి చేస్తుంది.

కొత్త 2022 మోడల్ హ్యుందాయ్ వెన్యూ ఇంటీరియర్స్ ఎలా ఉన్నాయో చూడండి..

కొత్త 2022 మోడల్ హ్యుందాయ్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్ మోడల్ ముందు మరియు వెనుక వైపున పూర్తి రీడిజైన్‌ను కలిగి ఉంటుంది. రివైజ్డ్ ఫ్రంట్ గ్రిల్, బానెట్ క్రింది భాగంలో ఎల్ఈడి టర్న్ ఇండికేటర్లు మరియు సన్నటి ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన స్మోక్డ్ హెడ్‌ల్యాంప్ క్లస్టర్, బంపర్ క్రింది భాగంలో సిల్వర్ స్కఫ్ ప్లేట్ వంటి మార్పులతో ఇది ముందు వైపు నుండి చాలా కొత్తగా కనిపిస్తుంది.

కొత్త 2022 మోడల్ హ్యుందాయ్ వెన్యూ ఇంటీరియర్స్ ఎలా ఉన్నాయో చూడండి..

అలాగే, దీని రియర్ డిజైన్ కూడా రివైజ్ చేయబడింది. ఇక్కడ ఇందులో కొత్త టెయిల్ ల్యాంప్స్ మరియు రెండు టెయిల్ ల్యాంప్స్ ను కలుపుతూ పోయే సన్నటి ఎల్ఈడి లైట్ స్ట్రిప్, రీప్రొఫైల్ చేయబడిన రియర్ బంపర్, కొత్త అల్లాయ్ వీల్స్, సిల్వర్ కలర్ రూఫ్ రెయిల్స్ మరియు రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్‌తో ఇది చాలా స్పోర్టీగా కనిపిస్తుంది. కొత్త హ్యుందాయ్ వెన్యూలో కొత్త 2 స్టెప్ రిక్లైనింగ్ రియర్ సీట్లు కూడా ఉంటాయి. ఇది హ్యుందాయ్ నుండి రాబోయే ప్రీమియం ఎస్‌యూవీ టూసాన్ నుండి స్ఫూర్తి పొంది డిజైన్ చేయబడింది.

కొత్త 2022 మోడల్ హ్యుందాయ్ వెన్యూ ఇంటీరియర్స్ ఎలా ఉన్నాయో చూడండి..

ఇంకా ఇందులోని ఫీచర్ల విషయానికి వస్తే, బ్లూలింక్ కనెక్టింగ్ టెక్నాలజీ ద్వారా 60 కి పైగా కనెక్ట్ చేయబడిన కార్ టెక్ ఫీచర్‌లు, పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డ్రైవ్ మోడ్‌లు, అలెక్సా మరియు గూగుల్ అసిస్టెంట్‌తో కూడిన హోమ్ టు కార్ ఫంక్షన్, 10 ప్రాంతీయ భాషలను సపోర్ట్ చేసే ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ మొదలైనవి చాలానే ఉన్నాయి.

కొత్త 2022 మోడల్ హ్యుందాయ్ వెన్యూ ఇంటీరియర్స్ ఎలా ఉన్నాయో చూడండి..

ఈ ఫీచర్లే కాకుండా, కొత్త 2022 హ్యుందాయ్ వెన్యూలో 10.1 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, యాపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, కూల్డ్ గ్లోవ్ బాక్స్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్ వంటి ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది. వీటిలో హోమ్-టు-కార్ (Home-to-car) అనే ఫీచర్ చాలా ప్రత్యేకమైనది మరియు ఈ సెగ్మెంట్లో మొదటిది.

కొత్త 2022 మోడల్ హ్యుందాయ్ వెన్యూ ఇంటీరియర్స్ ఎలా ఉన్నాయో చూడండి..

ఈ ఫీచర్ అమెజాన్ అలెక్సా మరియు గూగుల్ అసిస్టెంట్‌తో వాయిస్ కమాండ్ ఆధారితంగా పనిచేస్తుంది. ఇది ఇంగ్లీష్ మరియు హిందీలో వాయిస్ కమాండ్స్‌ ను అనుమతిస్తుంది. ఈ హోమ్ టు కార్ ఫీచర్ సాయంతో కస్టమర్ తమ ఇంటిలో ఉండే అమేజాన్ అలెక్సా లేదా గూగుల్ అసిస్టెంట్ డిజైజ్ ను ఉపయోగించి వాయిస్ కమాండ్ సాయంతో కొత్త 2022 హ్యుందాయ్ వెన్యూ కారులోని ఏసి (ఎయిర్ కండిషనింగ్) ను రిమోట్ గా స్టార్ట్ చేయవచ్చు. కేవలం ఏసి మాత్రమే కాకుండా, అనేక ఇతర ఫీచర్లను కూడా ఈ వాయిస్ కమాండ్స్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు.

ఫొటో మూలం: యూట్యూబ్

Most Read Articles

English summary
Hyundai venue facelift interior images and features revealed ahead of launch details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X