ఒక్క ఛార్జ్‌తో 500 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందించే 'ప్రవైగ్ డిఫై' (Pravaig Defy): ధర మరియు వివరాలు

బెంగళూరు బేస్డ్ ఆటోమోటివ్ స్టార్టప్ కంపెనీ 'ప్రవైగ్' (Pravaig) తన మొట్ట మొదటి ఎలక్ట్రిక్ SUV అయిన 'డిఫై' (Defy) ని లాంచ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ SUV డిజైన్, ఫీచర్స్, రేంజ్ వంటి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త 'ప్రవైగ్ డిఫై' (Pravaig Defy) ధర రూ. 39.50 లక్షలు (ఎక్స్-షోరూమ్). కంపెనీ ఈ SUV కోసం బుకింగ్స్ కూడా ప్రారంభించింది. కావున ఆసక్తి కలిగిన కస్టమర్లు రూ. 51,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. అయితే డెలివరీలు 2023 ఏప్రిల్ నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. ఈ SUV చాలా వరకు ఒక కొత్త డిజైన్ పొందినట్లు చూడగానే అర్థమవుతుంది.

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త ప్రవైగ్ డిఫై

కొత్త ప్రవైగ్ డిఫై ఎలక్ట్రిక్ SUV బాక్సీ డిజైన్‌ను కలిగి ఉంది. ఇందులో లైట్‌బార్ స్టైల్ హెడ్‌లైట్‌లు మినహా ఫ్రంట్ ఎండ్ దాదాపు పూర్తిగా మూసివేయబడింది. అంతే కాకుండా.. ముందు మరియు వెనుక విండ్‌స్క్రీన్‌లు మరియు కూపే వంటి రూప్ కలిగి ఉంటుంది. ఇందులో పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్‌ కూడా అందుబాటులో ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్‌, టెయిల్‌గేట్ మరియు లైట్‌బార్ స్టైల్ టైల్‌లైట్‌లను చూడవచ్చు.

ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో 15.6 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే ఉంటుంది. ఈ SUV ఫ్రెంచ్ ఆడియో స్పెషలిస్ట్ బ్రాండ్ డెవియలెట్ (Devialet) నుండి 3D సౌండ్‌ ను పొందుతుంది. సీట్లు సిక్స్ వే పవర్ అడ్జస్ట్‌మెంట్ మరియు వెంటిలేషన్‌ను పొందుతాయి. ఇందులో 1,050 మిమీ హెడ్‌రూమ్ మరియు 1,215 మిమీ లెగ్‌రూమ్‌ ఉండటం వల్ల ప్రయాణికులు చాలా కంఫర్ట్ గా ఉండవచ్చు.

ఫీచర్స్ విషయానికి వస్తే, ముందు మరియు వెనుక ప్రయాణీకుల కోసం ప్రత్యేక క్లైమేట్ కంట్రోల్ జోన్‌లు మరియు ఇంటీరియర్‌లను కనెక్ట్ చేయబడిన కార్ యాప్ ద్వారా ముందే కండిషన్ చేయవచ్చు. మల్టిపుల్ వైర్‌లెస్ ఛార్జర్‌లు, ల్యాప్‌టాప్‌లను ఛార్జ్ చేయగల రెండు హై-పవర్ USB-C పోర్ట్‌లు ఇందులో లభిస్తాయి. అంతే కాకుండా ఈ SUV ప్రత్యేకమైన కీ కార్డ్‌తో వస్తుంది. కావున కనెక్టెడ్ కార్ టెక్ ద్వారా లాక్/అన్‌లాక్ చేయవచ్చు.

కొత్త ప్రవైగ్ డిఫై 402 బిహెచ్‌పి మరియు 620 ఎన్ఎమ్ టార్క్ టార్క్‌ అందించే రెండు ఎలక్ట్రిక్ మోటార్‌ల ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 4.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. టాప్ స్పీడ్ 210 కిమీ/గం. ఇందులో ఒక పెద్ద 90.2 kWh బ్యాటరీ ప్యాక్‌ ఉంటుంది. కావున ఇది ఒక ఛార్జ్‌పై 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుంది.

ఇక ఛార్జింగ్ విషయానికి వస్తే, ఫాస్ట్ డిసి ఛార్జర్ ద్వారా కేవలం 30 నిముషాల్లో 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకుంటుంది. అయితే హోమ్ ఛార్జర్‌తో ఛార్జ్ చేస్తే సుమారు ఎనిమిది గంటల్లో 300 కిమీ రేంజ్ అందించడానికి కావాల్సిన ఛార్జింగ్ చేసుకోగలదు. ప్రవైగ్ డెఫీ అనేది 4.94 మీటర్ల పొడవు, 1.65 మీటర్ల ఎత్తు మరియు 1.94 మీటర్ల వెడల్పు, వీల్‌బేస్ 3.03 మీటర్ల వరకు ఉంటుంది.

ఇదిలా ఉండగా కంపెనీ డీలర్‌షిప్ వివరాలను వెల్లడించనప్పటికీ, ఎమర్జెన్సీ రోడ్ సైడ్ అసిస్టెన్స్‌తో పాటు భారతదేశం అంతటా 34,000 పిన్ కోడ్‌లతో Defy SUV కోసం సర్వీస్ అందిస్తామని తెలిపారు. అంతే కాకుండా బ్రాండ్ 1 సంవత్సరం కాంప్లిమెంటరీ సర్వీస్ అందిస్తుంది, దీనిని నాలుగు సంవత్సరాల వరకు పొడిగించుకోవచ్చు. 'ప్రవైగ్ డిఫై' పటిష్టమైన సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది. కావున వినియోగదారుల భద్రతకు ఏ లోటు లేదు.

Most Read Articles

English summary
Pravaig defy electric suv launched price range battery features details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X