భారతీయ మార్కెట్లో విడుదలైన 'టాటా టిగోర్ XM iCNG': ధర & వివరాలు

'టాటా మోటార్స్' (Tata Motors) దేశీయ మార్కెట్లో ఎట్టకేలకు ఈ రోజు తన 'టిగోర్ ఎక్స్ఎమ్ ఐసిఎన్‌జి' (Tigor XM iCNG) వేరియంట్ విడుదల చేసింది. ఈ కొత్త వేరియంట్ ధర రూ. 7.40 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ప్రస్తుతం మార్కెట్లో సిఎన్‌జి వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఈ వేరియంట్ విడుదల చేయడం జరిగింది. దీని గురించి మరింత సమాచారం ఈ కథనంలో చూద్దాం.. రండి.

భారతీయ మార్కెట్లో విడుదలైన 'టాటా టిగోర్ XM iCNG': ధర & వివరాలు

టాటా మోటార్స్ భారతీయ మార్కెట్లో తన అమ్మకాలను మెరుగుపరుచుకోవడానికి మరియు ఈ విభాగంలో తన ఉనికిని మరింత బలపరుచుకోవడానికి కంపెనీ టియాగో మరియు టిగోర్‌లలో ఐసిఎన్‌జి టెక్నాలజీని ప్రవేశపెట్టింది.

భారతీయ మార్కెట్లో విడుదలైన 'టాటా టిగోర్ XM iCNG': ధర & వివరాలు

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త 'టిగోర్ ఎక్స్ఎమ్ ఐసిఎన్‌జి' వేరియంట్ మొత్తం నాలుగు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంది. అవి ఒపల్ వైట్, డేటోనా గ్రే, అరిజోనా బ్లూ మరియు డీప్ రెడ్ కలర్స్. ఇవన్నీ కూడా చూడటానికి చాలా ఆకర్శణీయంగా ఉంటాయి. మార్కెట్లో కంపెనీ యొక్క సిఎన్‌జి వేరియంట్స్ యొక్క అమ్మకాలు పెరగటంతో ఈ కొత్త టిగోర్ ఎక్స్ఎమ్ ఐసిఎన్‌జి వేరియంట్ ని మరింత సరసమైన ధర వద్ద విడుదల చేసింది.

భారతీయ మార్కెట్లో విడుదలైన 'టాటా టిగోర్ XM iCNG': ధర & వివరాలు

టాటా టిగోర్ యొక్క ఎంట్రీ-లెవల్ XM iCNG వేరియంట్ ఆకర్షణీయమైన డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది. ఇందులో 4 స్పీకర్ సౌండ్ సిస్టమ్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, సెంట్రల్ లాకింగ్, పవర్ విండోస్ మరియు హర్మాన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటివి ఉన్నాయి. అంతే కాకుండా యావరేజ్ మైలేజ్, సీట్ బెల్ట్ రిమైండర్, గేర్ షిఫ్ట్ డిస్‌ప్లే మొదలైన సమాచారాన్ని అందించే డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా అందుబాటులో ఉంది.

భారతీయ మార్కెట్లో విడుదలైన 'టాటా టిగోర్ XM iCNG': ధర & వివరాలు

కొత్త టాటా టిగోర్ సిఎన్‌జి 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో అందుబాటులో ఉంది. ఇది 73.4 బిహెచ్‌పి పవర్ మరియు 95 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ కి జతచేయబడి ఉంటుంది.

భారతీయ మార్కెట్లో విడుదలైన 'టాటా టిగోర్ XM iCNG': ధర & వివరాలు

కొత్త టాటా టిగోర్ సిఎన్‌జి అనేది CNG మోడల్ కావున దీని బూట్ స్పేస్ 205 లీటర్ల వరకు మాత్రమే ఉంటుంది. అయితే సాధారణ మోడల్ లో బూట్ స్పేస్ 419 లీటర్ల వరకు ఉంటుంది. అదే సమయంలో CNG మోడల్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ 165 మిమీ వరకు ఉంటుంది. టాటా టిగోర్ సిఎన్‌జిలో 35-లీటర్ ఫ్యూయెల్ ట్యాంక్ తో పాటు CNG కి 60-లీటర్స్ జత చేయడం జరిగింది.

భారతీయ మార్కెట్లో విడుదలైన 'టాటా టిగోర్ XM iCNG': ధర & వివరాలు

టాటా టిగోర్ యొక్క మొత్తం బుకింగ్స్ లో దాదాపు 75% బుకింగ్స్ దాని ICNG వేరియంట్‌కు అందుతున్నాయని కంపెనీ తెలిపింది. దీన్ని బట్టి చూస్తే కంపెనీ యొక్క CNG మోడల్స్ కి మంచి డిమాండ్ ఉందని స్పష్టంగా అర్థమవుతోంది.

భారతీయ మార్కెట్లో విడుదలైన 'టాటా టిగోర్ XM iCNG': ధర & వివరాలు

ఇందులోని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఎయిర్ బ్యాగులు, ఇంజిన్ ఇమ్మొబిలైజర్, ఏబీఎస్ విత్ ఈబిడి, రియర్ పార్కింగ్ సెన్సార్, ఆటో డోర్ లాక్ మరియు సీట్ బెల్ట్ ప్రీ-టెన్షనర్ వంటివి ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్ధరిస్తాయి.

భారతీయ మార్కెట్లో విడుదలైన 'టాటా టిగోర్ XM iCNG': ధర & వివరాలు

ఇక కంపెనీ యొక్క అమ్మకాల విషయానికి వస్తే, టాటా మోటార్స్ గత నెలలో మొత్తం 47,505 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలను విక్రయించినట్లు తెలిసింది. ఈ అమ్మకాలు 2021 జులై నెల కంటే 57 శాతం ఎక్కువ. అయితే కంపెనీ ఇప్పుడు దేశీయ మార్కెట్లో ఈ కొత్త CNG మోడల్ ని అతి తక్కువ ధర వద్దకే అందుబాటులోకి తీసుకురావడం వల్ల తప్పకుండా ఈ విభాగంలో మరింత మంచి అమ్మకాలు పొందే అవకాశం ఉంటుంది.

భారతీయ మార్కెట్లో విడుదలైన 'టాటా టిగోర్ XM iCNG': ధర & వివరాలు

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

నిజానికి మంచి పనితీరుని మరియు భద్రతకు టాటా కార్లు ప్రసిద్ధి చెందాయి. ఇందులో భాగంగానే టాటా మోటార్స్ యొక్క టిగోర్ కూడా ఇదే లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ కారణంగానే టిగోర్ CNG అమ్మకాలు భారీగా పెరిగాయి. అయితే ఇప్పుడు కంపెనీ మరింత ఎక్కువమంది కస్టమర్లను ఆకర్షించడానికి తక్కువ ధర వద్ద తన 'టిగోర్ ఎక్స్ఎమ్ ఐసిఎన్‌జి' విడుదల చేసింది. ఇది తప్పకుండా కంపెనీ యొక్క అమ్మకాలను పెంచుతుందని ఆశిస్తున్నాము. దీని గురించి ఎప్పటికప్పుడు అప్డేటెడ్ సమాచారం పొందటానికి మరియు కొత్త కార్లు మరియు బైకుల గురించి సమాచారం పొందటానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ పాలో అవ్వండి.

Most Read Articles

English summary
Tata tigor xm cng variant launched price features color details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X