మీ అందరికీ Hyundai Eon గుర్తుందా? ఇప్పుడు ఈ బుజ్జి కారు ఏమైంది?

టూవీలర్ నుండి ఫోర్-వీలర్‌కు అప్‌గ్రేడ్ కావాలనుకునే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు మొదటగా చూసేది ఎంట్రీ లెవల్ స్మాల్ కార్లనే. ఇలాంటి చిన్న కార్లు తక్కువకే ధరకే అందుబాటులో ఉండి, ఒక కారులో ఉండాల్సిన అవసరమైన అన్ని బేసిక్ ఫీచర్లను కలిగి ఉంటాయి. నిజానికి మారుతి సుజుకి తమ ఎమ్800 కారుతో దేశంలో కార్ల వ్యాపారాన్ని ప్రారంభించింది.

మీ అందరికీ Hyundai Eon గుర్తుందా? ఇప్పుడు ఈ బుజ్జి కారు ఏమైంది?

ఆ తర్వాత పాపులర్ ఆల్టో కారుతో పాటుగా మరిన్ని ఇతర చిన్న కార్లను ప్రవేశపెట్టింది. అయితే, మారుతి సుజుకి సంస్థ అందించే కార్లకు పోటీనిచ్చేందుకు కొరియన్ కార్ బ్రాండ్ హ్యుందాయ్ కూడా గట్టిగానే పోటీ పడింది. మారుతి చిన్న కార్లకు పోటీగా హ్యుందాయ్ తమ శాంత్రో మరియు ఐ10 వంటి చిన్న హ్యాచ్‌బ్యాక్ కార్లను ప్రవేశపెట్టింది.

మీ అందరికీ Hyundai Eon గుర్తుందా? ఇప్పుడు ఈ బుజ్జి కారు ఏమైంది?

ప్రత్యేకించి, మారుతి సుజుకి ఆల్టో (Maruti Suzuki Alto) కి పోటీగా ఈ కొరియన్ కంపెనీ హ్యుందాయ్ ఇయాన్ (Hyundai Eon) అనే ఓ చిన్న కారును రెండు రకాల ఇంజన్లతో (800 సిసి మరియు 1000 సిసి) విడుదల చేసింది. ఇది ప్రత్యేకంగా భారతీయుల కోసం అభివృద్ధి చేయబడిన ఎంట్రీ లెవల్ స్మాల్ కార్ కావడం విశేషం.

మీ అందరికీ Hyundai Eon గుర్తుందా? ఇప్పుడు ఈ బుజ్జి కారు ఏమైంది?

శాంత్రో కారు ద్వారా దేశీయ మార్కెట్లోకి ప్రవేశించిన హ్యుందాయ్, మధ్యతరగతి ప్రజల ఆదరణ కారణంగా, భారతదేశంలోనే రెండవ అతిపెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థగా అవతరించింది. హ్యుందాయ్ శాంత్రో మరియు ఐ10 మోడళ్ల మధ్య అంతరాన్ని తగ్గించడానికి, కంపెనీ 2011 సంవత్సరంలో హ్యుందాయ్ ఇయాన్ (Hyundai Eon) కారుని ఆవిష్కరించింది.

మీ అందరికీ Hyundai Eon గుర్తుందా? ఇప్పుడు ఈ బుజ్జి కారు ఏమైంది?

భారత ప్యాసింజర్ కార్ మార్కెట్లోని 800 సిసి విభాగంలో అగ్రగామిగా ఉన్న మారుతి ఆల్టో ని పడగొట్టమే హ్యుందాయ్ ఇయాన్ ఏకైక లక్ష్యం. ఆ సమయంలో ఈ సరికొత్త మోడల్ గొప్ప విజయాన్ని సాధించిందనే చెప్పాలి. ఆల్టో కన్నా మోడ్రన్ డిజైన్ మరియు అధునాతన ఫీచర్లతో కంపెనీ ఈ కారును ప్రవేశపెట్టింది. నిజానికి ఇది పరిమాణంలో ఆల్టో కారు కన్నా పెద్దదిగా ఉంటుంది.

మీ అందరికీ Hyundai Eon గుర్తుందా? ఇప్పుడు ఈ బుజ్జి కారు ఏమైంది?

హ్యుందాయ్ ఇయాన్ వెనుక సీటులో కూర్చునే ప్రయాణీకుల కోసం మెరుగైన సౌకర్యాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో కంపెనీ, ఈ ఇయాన్ కారుని దాని ప్రధాన ప్రత్యర్థి అయిన ఆల్టో కంటే 75 మిమీ ఎక్కువ వెడల్పు మరియు 40 మిమీ ఎక్కువ పొడవు ఉండేలా డిజైన్ చేసింది. అంతేకాకుండా, దీని వీల్‌బేస్ ఆల్టో కంటే పెద్దదిగా ఉంటుంది. ఖచ్చితంగా చెప్పాలంటే, హ్యుందాయ్ ఇయాన్ పొడవు 3,495 మిమీ, వెడల్పు 1,550 మిమీ, ఎత్తు 1500 మిమీ, వీల్‌బేస్‌లో 2,380 మిమీ మరియు గ్రౌండ్ క్లియరెన్స్‌ 170 మిమీగా ఉంటుంది.

మీ అందరికీ Hyundai Eon గుర్తుందా? ఇప్పుడు ఈ బుజ్జి కారు ఏమైంది?

ఈ చిన్న కారు డిజైన్‌ను గమనిస్తే, హ్యుందాయ్ నుండి అత్యంత పాపులర్ అయిన 'ఫ్లూయిడ్ డిజైన్' ఫిలాసఫీ ఆధారంగా ఇయాన్ ను డిజైన్ చేసింది. ఆ సమయంలో హ్యుందాయ్ వెర్నా వంటి ప్రీమియం సెడాన్ కార్లను ఈ డిజైన్ ఫిలాసఫీతో రూపొందించారు. ఇది సాంప్రదాయ బాక్సీ హ్యాచ్‌బ్యాక్‌ల మాదిరిగా కాకుండా, చాలా స్టైలిష్ డిజైన్ ను కలిగి ఉండేది.

మీ అందరికీ Hyundai Eon గుర్తుందా? ఇప్పుడు ఈ బుజ్జి కారు ఏమైంది?

హ్యుందాయ్ ఇయాన్ ఎక్స్టీరియర్స్ మరియు ఇంటీరియర్స్ లో చాలా విషయాలు ఉన్నాయి. మొదటి చూపులో ఇయాన్ కస్టమర్ల దృష్టిని ఆకట్టుకునే స్టైల్ ని కలిగి ఉంటుంది. ఇందులో పదునైన, కోణీయ, డిజైన్ అంశాలు, బాడీ లైన్స్, టాల్‌బాయ్ డిజైన్ మరియు అధునాతన ఇంటీరియర్‌ల కలయిక ఉంటుంది. చిన్న సైజు, హ్యుందాయ్ బ్రాండ్ యొక్క విశ్వసనీయత మరియు అద్భుతమైన డ్రైవింగ్ డైనమిక్స్ కారణంగా ఇయాన్ కంపెనీకి అత్యధికంగా అమ్ముడైన మోడల్‌గా నిలిచింది.

మీ అందరికీ Hyundai Eon గుర్తుందా? ఇప్పుడు ఈ బుజ్జి కారు ఏమైంది?

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ కార్లలో కూడా లభించని అనేక ఫీచర్లను హ్యుందాయ్ తమ ఇయాన్ కారులో అందించింది. మారుతి ఆల్టోతో పోలిస్తే, హ్యుందాయ్ ఇయాన్ కారులో కంపెనీ చాలా ఫీచర్లను జోడించింది. డ్యూయల్ టోన్ ఇంటీరియర్ థీమ్, ఇంటిగ్రేటెడ్ ఆడియో సిస్టమ్ మరియు కీలెస్ ఎంట్రీ వంటి అనేక ఫీచర్లు ఉందులో ఉన్నాయి. అలాగే క్యాబిన్‌ లోపల ఉపయోగించిన ప్లాస్టిక్ మెటీరియల్ నాణ్యత కూడా అద్భుతంగా ఉండేది.

మీ అందరికీ Hyundai Eon గుర్తుందా? ఇప్పుడు ఈ బుజ్జి కారు ఏమైంది?

ఇంజన్ పవర్, పెర్ఫార్మెన్స్ ల పరంగా ఇయాన్, ఆల్టో కన్నా మెరుగ్గా ఉండేది. మారుతి సుజుకి ఆల్టో 800 కారులో ఉపయోగించిన 796 సిసి, 3-సిలిండర్, ఎఫ్8డి టైప్ పెట్రోల్ ఇంజన్ 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 48 పిఎస్‌ల గరిష్ట శక్తిని, 3,500 ఆర్‌పిఎమ్ వద్ద 69 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో జతచేయబడి ఉంటుంది.

మీ అందరికీ Hyundai Eon గుర్తుందా? ఇప్పుడు ఈ బుజ్జి కారు ఏమైంది?

కాగా, హ్యుందాయ్ ఇయాన్‌ కారులో ఉపయోగించిన 815 సిసి, 3-సిలిండర్, 9-వాల్వ్ ఎస్ఓహెచ్‌సి టైప్ ఇంజన్ 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 56 పిఎస్‌ల గరిష్ట శక్తిని, 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 76.5 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో జతచేయబడి ఉంటుంది. దీని పవర్, టార్క్ గణాంకాలు ఆల్టో కన్నా బెటర్ గా ఉంటాయి.

మీ అందరికీ Hyundai Eon గుర్తుందా? ఇప్పుడు ఈ బుజ్జి కారు ఏమైంది?

హ్యుందాయ్ ఇయాన్ కారును ప్రారంభించిన సమయంలో, కార్లలోని సేఫ్టీ ఫీచర్ల విషయంలో ప్రత్యేక నియమాలు ఏవీ లేవు. కాబట్టి, హ్యుందాయ్ ఇయాన్ యొక్క బేస్ వేరియంట్‌లలో ఎయిర్‌బ్యాగ్‌లు లేవు. అలాగే, టాప్-ఎండ్ వేరియంట్లలో కూడా ఎయిర్‌బ్యాగులు ఆప్షనల్ గా మాత్రమే లభించేవి. ఫలితంగా, గ్లోబల్ ఎన్‌క్యాప్ నిర్వహించిన క్రాష్ టెస్ట్‌లలో హ్యుందాయ్ ఇయాన్ 'జీరో' సేఫ్టీ రేటింగ్ పొందింది.

మీ అందరికీ Hyundai Eon గుర్తుందా? ఇప్పుడు ఈ బుజ్జి కారు ఏమైంది?

భారతదేశంలో గ్లోబల్ క్రాష్ టెస్ట్‌లో జీరో స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన కార్లలో హ్యుందాయ్ ఇయాన్ కూడా ఒకటి. BNVSAP నిబంధనల ప్రకారం, ఏప్రిల్ 1, 2019 తర్వాత భారతదేశంలో విక్రయించే అన్ని కార్లు తప్పనిసరిగా ఏబిఎస్, డ్రైవర్ ఎయిర్‌బ్యాగులు, రియర్ పార్కింగ్ సెన్సార్స్ మరియు సీట్‌బెల్ట్ రిమైండర్‌ వంటి ప్రాధమిక భద్రతా ఫీచర్లు తప్పనిసరిగా కలిగి ఉండాలి.

మీ అందరికీ Hyundai Eon గుర్తుందా? ఇప్పుడు ఈ బుజ్జి కారు ఏమైంది?

కానీ, ఆ ధర వద్ద ఈ ప్రాథమిక భద్రతా లక్షణాలతో హ్యుందాయ్ ఇయాన్‌ను సవరించడానికి హ్యుందాయ్ అప్పట్లో సిద్ధంగా లేదు. అందువల్ల, భారతదేశంలో ఇయాన్ అమ్మకాలు సన్నగిల్లాయి. మరోవైపు ఏప్రిల్ 2020 లో BS-VI కాలుష్య ఉద్గార ప్రమాణాలు అమల్లోకి రావడం కూడా హ్యుందాయ్ ఇయాన్ ముగింపుకు ఓ కారణంగా చెప్పుకోవచ్చు.

మీ అందరికీ Hyundai Eon గుర్తుందా? ఇప్పుడు ఈ బుజ్జి కారు ఏమైంది?

గడచిన 2011 లో భారతదేశంలో ప్రారంభించబడిన హ్యుందాయ్ ఇయాన్, సరిగ్గా ఎనిమిది సంవత్సరాల ప్రయాణం తర్వాత మార్కెట్ నుండి దూరమైంది. ఆ తర్వాత, తిరిగి చిన్న కార్ మార్కెట్ వాటాను క్యాష్ చేసుకునేందుకు హ్యుందాయ్ తమ శాంత్రో కారుని తిరిగి అప్‌గ్రేడ్ చేసి, సరికొత్తగా ప్రవేశపెట్టింది. అయితే, భారత రోడ్లపై ఇప్పుడు కూడా కనిపించే చిన్న కార్లలో ఇయాన్ కూడా ఒకటి. సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్‌లో ఈ మోడల్‌కు అధిక డిమాండ్ మరియు అధిక ధర కూడా ఉంది.

Most Read Articles

English summary
Hyundai eon the best looking entry level hatchback from the past
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X