2018 ట్రయంప్ టైగర్ 800 విడుదల: ధర రూ. 11.76 లక్షలు

By Anil Kumar

2018 ట్రయంప్ టైగర్ 800 మోటార్ సైకిల్ విపణిలోకి విడుదలయ్యింది. ట్రయంప్ మోటార్ సైకిల్స్ ఇండియా సరికొత్త 2018 టైగర్ 800 అడ్వెంచర్ బైకును రూ. 11.76 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో లాంచ్ చేసింది.

ట్రయంప్ టైగర్ 800

సరికొత్త 2018 ఎడిషన్ ట్రయంప్ టైగర్ 800 బైకులో ఇంజన్, ఛాసిస్, డిజైన్ మరియు ఫీచర్ల పరంగా స్వల్ప అప్‌డేట్స్ జరిగాయి. ట్రయంప్ టైగర్ 800 వేరియంట్లు, ధరలు మరియు పూర్తి విడుదల వివరాలు ఇవాళ్టి కథనంలో చూద్దాం రండి....

ట్రయంప్ టైగర్ 800

2018 ట్రయంప్ టైగర్ 800 మూడు విభిన్న వేరియంట్లలో విడుదలైంది. అవి, రోడ్ ఓరియంటెడ్ వేరియంట్లు - ఎక్స్ఆర్ మరియు ఎక్స్ఆర్ఎక్స్, ఆఫ్ రోడ్ ఓరియంటెడ్ వేరియంట్ ఎక్స్‌సిఎక్స్.

Variant Price
XR Rs 11.76 Lakh
XRx Rs 13.13 Lakh
XCx Rs 13.76 Lakh
ట్రయంప్ టైగర్ 800

2018 ట్రయంప్ టైగర్ 800 ఇంజన్ స్పెసిఫికేషన్స్

కొత్తగా విడుదలైన 2018 ట్రయంప్ టైగర్ 800 బైకులో 800సీసీ కెపాసిటి గల మూడు సిలిండర్ల లిక్విడ్ కూల్డ్ పెట్రోల్ ఇంజన్ కలదు. 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది 8,500ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 94బిహెచ్‌పి పవర్ మరియు 8,050ఆర్‌పిఎమ్ వద్ద 78.8ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

Recommended Video - Watch Now!
BMW G 310 GS ను షోకేస్ చేసిన BMW | BMW G 310 GS Full-Specifications - DriveSpark
ట్రయంప్ టైగర్ 800

ఆఫ్ రోడింగ్‌లో అత్యుత్తమ ట్రాక్షన్, తక్కువ వేగం వద్ద ఉత్తమమైన హ్యాండ్లింగ్ మరియు యాక్సిలరేషన్ కోసం 2018 ట్రయంప్ టైగర్ 800 బైకులో ఫస్ట్ గేర్ పొట్టిగా ఉంటుంది. ఇంజన్ మరియు ఛాసిస్‌లో 200కు పైగా అప్‌డేట్స్ జరిగాయి. ఎగ్జాస్ట్ వాయువులను సులభంగా బయటికి వెళ్లేలా రూపొందించిన ఎగ్జాస్ట్ సిస్టమ్ ఉంది.

ట్రయంప్ టైగర్ 800

2018 ట్రయంప్ టైగర్ 800 డిజైన్ మరియు ఫీచర్లు

నూతన ట్రయంప్ టైగర్ 800 బైకులో ఇంటిగ్రేటెడ్ డే టైమ్ రన్నింగ్ లైట్లు జోడింపుతో ఉన్న సరికొత్త హెడ్‌ల్యాంప్ క్లస్టర్ ఉంది. అడ్వెంచర్ మోటార్‌సైకిల్‌లో ప్రీమియమ్ బాడీ వర్క్, హై-క్వాలిటీ బ్యాడ్జెస్, గ్రాఫిక్స్ మరియు నూతన కలర్ స్కీమ్స్ ఉన్నాయి.

ట్రయంప్ టైగర్ 800

ట్రయంప్ టైగర్ 800 బైకులో ఫీచర్ల పరంగా, 5-అంగుళాల అడ్జస్టబుల్ టిఎఫ్‌టి ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, ఆల్-ఎల్ఇడి లైటింగ్, స్విచ్ క్యూబ్స్ మరియు జాయ్ స్టిక్ గల హ్యాండిల్ బార్, బ్యాక్‌లిట్ బటన్స్, ఐదు దిశలలో అడ్జెస్ట్ చేసుకునే వీలున్న విండ్ స్క్రీన్, అప్‌‌డేటెడ్ క్రూయిజ్ కంట్రోల్ మరియు ముందు వైపున బ్రెంబో బ్రేకులు ఉన్నాయి.

ట్రయంప్ టైగర్ 800

ట్రయంప్ టైగర్ 800 బైకులో నాలుగు విభిన్న రైడింగ్ మోడ్స్ ఉన్నాయి మరియు ఎక్స్‌సిఎక్స్ వేరియంట్లో ఆఫ్-రోడ్ ప్రో మోడ్‌తో మొత్తం ఐదు రైడింగ్ మోడ్స్ ఉన్నాయి.

ట్రయంప్ టైగర్ 800

అత్యంత కీలకమైన ఇతర ఫీచర్లలో ముందు మరియు వెనుక వైపు డబ్ల్యూపి అడ్జస్టబుల్ సస్పెన్షన్, హీటెడ్ గ్రిప్స్, హ్యాండ్ గార్డ్స్, అడ్డస్టబుల్ సీటు మరియు హ్యాండిల్ బార్, సంప్ గార్డ్, ఆఫ్ మరియు ఆన్ చేసుకునే వీలున్న యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ వంటివి ఉన్నాయి. ఎక్స్ఆర్ రేంజ్‌లో అల్లాయ్ వీల్స్ మరియు ఎక్స్‌సి వేరియంట్లో స్పోక్ వీల్స్ ఉన్నాయి.

ట్రయంప్ టైగర్ 800

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

సరికొత్త 2018 ట్రయంప్ టైగర్ 800 బైక్ అప్‍‌డేటెడ్ ఇంజన్, ఛాసిస్ మరియు డిజైన్‌తో వచ్చింది. సరికొత్త ఎల్ఇడి హెడ్‌ల్యాంప్ బైకు మొత్తానికి అడ్వెంచర్ లుక్ కల్పించింది. ట్రయంప్ టైగర్ 800 ఎక్స్ఆర్ శ్రేణి విపణిలో ఉన్న బిఎమ్‌డబ్ల్యూ ఎఫ్ 750 జిఎస్, డుకాటి మల్టీస్ట్రాడా 950 మరియు కవాసకి వెర్సేస్ 1000 బైకులకు గట్టి పోటీనిస్తుంది. అదే విధంగా టైగర్ 800 ఎక్స్‍‌సిఎక్స్ వేరియంట్ హోండా ఆఫ్రికా ట్విన్ మరియు బిఎమ్‌డబ్ల్యూ ఎఫ్ 850 జిఎస్ మోడళ్లను సవాల్ చేస్తోంది.

Most Read Articles

English summary
Read In Telugu: 2018 Triumph Tiger 800 Launched In India; Prices Start At Rs 11.76 Lakh
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X