Just In
- 12 hrs ago
మతిపోగొడుతున్న హ్యుందాయ్ మార్చ్ నెల డిస్కౌంట్స్.. దేనిపై ఎంతో చూసారా..!
- 15 hrs ago
భారత్‌లో విడుదలైన 3 కొత్త NIJ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. చీప్ కాస్ట్ & మోర్ ఫీచర్స్
- 15 hrs ago
గుడ్ న్యూస్! ఇకపై ఈ సేవల కోసం ఆర్టీఓ చుట్టూ తిరగక్కర్లేదు, అన్నీ ఆన్లైన్లోనే..
- 16 hrs ago
కేవలం 65,920 రూపాయలకే కొత్త బజాజ్ ప్లాటినా 110 ఎబిఎస్ బైక్ ; వివరాలు
Don't Miss
- News
రఘురామ మళ్లీ కౌంటర్.. సీఎం జగన్ కూడా భాగస్వాములే.. హాట్ కామెంట్స్..
- Movies
చరిత్ర సృష్టించిన సుడిగాలి సుధీర్: వాళ్లందరిపై ఆధిపత్యం చూపిస్తూ.. ఊహించని రికార్డు సొంతం
- Lifestyle
శనివారం దినఫలాలు : ఓ రాశి ఉద్యోగులకు ఉన్నతాధికారులతో మంచి సమన్వయం ఉంటుంది...!
- Finance
ధరలు ఎలా ఉన్నాయంటే? 44వేలకు దిగొచ్చిన బంగారం, వెండి రూ.66 వేల దిగువన
- Sports
ఆ విషయంలో రోహిత్ శర్మను చూసి విరాట్ కోహ్లీ నేర్చుకోవాలి: మనోజ్ తివారీ
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
భారతదేశంలోఅతిపెద్ద ద్విచక్ర వాహన తయారీసంస్థ అయిన హీరో మోటోకార్ప్ ఇటీవల 100 మిలియన్ల ఉత్పత్తిని పూర్తి చేసినట్లు అధికారికంగా ప్రకటించింది. సంస్థ తమ 100 మిలియన్ల ద్విచక్ర వాహనమైన ఎక్స్ట్రీమ్ 160 ఆర్‌ను ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లోని బ్రాండ్ వద్ద విడుదల చేసింది.

హీరో మోటోకార్ప్ 1984 వ సంవత్సరంలో మార్కెట్లోకి ప్రవేశించింది. తర్వాత అతి తక్కువ కాలంలోనే హీరో మోటోకార్ప్ కంపెనీ 1985 లో ధారుహెరాలో ప్లాంట్‌ను ప్రారంభించింది. అంతే కాకుండా ఇదే సంవత్సరం కంపెనీ మొదటి మోడల్ ఆయిన సిడి 100 ను తీసుకువచ్చింది.

హీరో మోటోకార్ప్ కంపెనీ దీని తర్వాత 1987 లో దాదాపు 1 లక్ష యూనిట్లను దాటింది. ఈ సంఖ్య క్రమంగా అభివృద్ధి చెందుతూ తన ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచే ప్రయత్నాలు చేసింది. తర్వాత 2004 లో కంపెనీ 10 మిలియన్ల ఉత్పత్తి మార్కును దాటింది.
MOST READ:మాట నిలబెట్టుకున్న జగన్మోహన్రెడ్డి.. రేషన్ డోర్ డెలివరీకి సర్వం సిద్ధం

హీరో మోటోకార్ప్ 2011 లో తన భాగస్వామి అయిన హోండాతో విడిపోయింది. దీని తరువాత కంపెనీ అనేక కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. తరువాత 2013 లో 50 మిలియన్ల యూనిట్లను మరియు 2017 లో 75 మిలియన్ల సంఖ్యను దాటింది. ఇప్పుడు ఏకంగా 100 మిలియన్లకు చేరుకుంది.

ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ద్విచక్ర వాహనాలను విక్రయిస్తుంది మరియు ప్రస్తుతం 40 దేశాలలో తన ఉనికిని కలిగి ఉంది. సంస్థ యొక్క ఉత్పత్తి మరియు ఆర్ అండ్ డి సౌకర్యం భారతదేశంలోని హలోల్, ధారుహేరా, గురుగ్రామ్, హరిద్వార్ వంటి నగరాల్లో లభిస్తుంది. సంస్థ ఒక్క భారతదేశంలో మాత్రమే కాకుండా ఇతరదేశాలలో కూడా తన ఉనికిని చాటుకుంటోంది.
MOST READ:అమెరికా కొత్త ప్రెసిడెంట్ జో బైడెన్ ఉపయోగించే 'దెయ్యం' కారు గురించి తెలుసా?

హీరోమోటోకార్ప్ ప్రస్తుతం కొలంబియా, జర్మనీ, బంగ్లాదేశ్ వంటి దేశాలలో తన ఉనికిని కలిగి ఉంది. ఈ సంస్థ ఇప్పటికీ దేశంలోనే అత్యధికంగా వాహనాలు అమ్ముడవుతున్న సంస్థ మరియు దాని పోర్ట్‌ఫోలియోలో బైక్‌లు, స్కూటర్లను అందిస్తుంది.

100 మిలియన్ ద్విచక్ర వాహనాల హీరో ఎక్స్ట్రీమ్ 160 ఆర్ మోడల్ బైక్‌ను గత ఏడాది జూన్‌లో తీసుకువచ్చారు. దీని ధర రూ. 99,950 (ఎక్స్-షోరూమ్). ఇది రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీనితో పాటు, హీరో మాస్ట్రో, డెస్టినీ, ఎక్స్ట్రీమ్, స్ప్లెండర్, గ్లామర్ ఫ్యాషన్ ప్రో మోడల్స్ ని విడుదల చేసింది.
MOST READ:బువ్వ తిను, బుల్లెట్ బైక్ పట్టుకెళ్లు: రాయల్ ఎన్ఫీల్డ్ 'బుల్లెట్' థాలి ఛాలెంజ్

హీరో మోటోకార్ప్‌తో సహా ద్విచక్ర వాహనాల ఉత్పత్తిలో ఒక భారతీయ కంపెనీ ఇంత పెద్ద సంఖ్యలో ఉత్పత్తి చేయడం నిజంగా భారతదేశానికి గర్వకారణం. హీరో మోటోకార్ప్ అమ్మకాలు ఇప్పుడు కూడా మెరుగుపడుతున్నాయి. ఇంకా చాలా కొత్త ఉత్పత్తులు కూడా త్వరలో దేశీయ మార్కెట్లో విడుదలవుతాయి. ఏది ఏమైనా 100 మిలియన్ల యూనిట్లు దాటటం అనేది నిజంగా చాలా గొప్ప విషయం.