కొత్త 2022 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 మొదటి టీజర్ విడుదల.. త్వరలోనే లాంచ్!

క్లాసిక్ మోటార్‌సైకిల్ కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) అందిస్తున్న పాపులర్ అడ్వెంచర్ మోటార్‌సైకిల్ హిమాలయన్ (Himalayan) లో ఓ శక్తివంతమైన వెర్షన్ మార్కెట్లోకి రానున్నట్లు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే.

Recommended Video

Royal Enfield నుంచి కొత్త Hunter 350 వచ్చేసింది | ధర & వివరాలు

కాగా, ఇప్పుడు కంపెనీ ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ సరికొత్త 2022 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 (2022 Royal Enfield Himalayan 450) యొక్క మొదటి టీజర్ ను అధికారికంగా విడుదల చేసింది. దీన్నిబట్టి చూస్తుంటే, త్వరలోనే హిమాలయన్ 450 మార్కెట్లో విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

కొత్త 2022 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 మొదటి టీజర్ విడుదల.. త్వరలోనే లాంచ్!

హిమాలయన్ 450 బైక్ తో లడఖ్ ప్రాంతంలో కఠినమైన రోడ్లను దాటుతున్నట్లుగా చిత్రీకరించిన టీజర్ వీడియోని కంపెనీ రిలీజ్ చేసింది. ఈ టీజర్ వీడియో రాబోయే రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 మోటార్‌సైకిల్‌ను చూపుతున్నప్పటికీ, ఇందులో హిమాలయన్ 450 యొక్క ముందు భాగం మాత్రమే వెల్లడైంది. ఈ టీజర్ వీడియోలని వాటర్ స్ప్లాష్ మోటార్‌సైకిల్ యొక్క ముఖ్యమైన లక్షణాలను పూర్తిగా కవర్ చేసినప్పటికీ, దీని హెడ్‌లైట్, టర్న్ ఇండికేటర్‌లు మరియు విండ్‌స్క్రీన్‌లు మాత్రం స్పష్టంగా కనిపిస్తాయి.

కొత్త 2022 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 మొదటి టీజర్ విడుదల.. త్వరలోనే లాంచ్!

ఈ కొత్త మోటార్‌సైకిల్ యొక్క హెడ్‌లైట్ అవుట్‌గోయింగ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 411 వంటి వృత్తాకార యూనిట్ మాదిరిగానే కనిపిస్తుంది. కాకపోతే, ఈ కొత్త 2022 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450లో హెడ్‌లైట్ లైటింగ్ కోసం ఇదివరకటి మోడళ్లలో ఉపయోగించిన హాలోజన్ బల్బుకు బదులుగా ఆధునిక ఎల్ఈడి లైటును ఉపయోగించినట్లు తెలుస్తోంది. కొత్త హిమాలయన్ 450లో డిజైన్ పరంగా పెద్ద మార్పులు లేకపోయినప్పటికీ, యాంత్రికంగా ఇందులో పెద్ద మార్పు ఉండనుంది.

కొత్త 2022 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 మొదటి టీజర్ విడుదల.. త్వరలోనే లాంచ్!

కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ మోటార్‌సైకిల్ లో కంపెనీ అధునాతన లిక్విడ్-కూల్డ్, 450సీసీ, సింగిల్-సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. ఈ ఇంజన్ సుమారుగా 40 బిహెచ్‌పి గరిష్ట శక్తిని మరియు 40-45 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. అలాగే, ఈ మోటార్‌సైకిల్ స్లిప్ మరియు అసిస్ట్ క్లచ్‌తో కూడిన 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో వచ్చే అవకాశం ఉంది.

కొత్త 2022 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 మొదటి టీజర్ విడుదల.. త్వరలోనే లాంచ్!

పోల్చి చూస్తే, ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాయలన్ 411 బైక్‌లో ఉపయోగిస్తున్న 411సీసీ ఇంజన్ గరిష్టంగా 6500 ఆర్‌పిఎమ్ వద్ద 24 బిహెచ్‌పి శక్తిని మరియు 4000 ఆర్‌పిఎమ్ నుండి 4500 ఆర్‌పిఎమ్ మధ్యలో 32 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. కాగా, కొత్త హిమాలయన్ 450లో ఈ ఇంజన్ సామర్థ్యాన్ని 411సీసీ నుండి 450సీసీకి పెంచడం ద్వారా కంపెనీ దాని పవర్, టార్క్ గణాంకాలను పెంచి, మోటార్‌సైకిల్ పనితీరును మరింత వేగవంతం చేయాలని చూస్తోంది.

కొత్త 2022 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 మొదటి టీజర్ విడుదల.. త్వరలోనే లాంచ్!

కొత్త హిమాలయన్ 450లో చేయబోయే ఇతర ప్రధానమైన మార్పులలో వెడల్పాటి ఫ్రంట్ అండ్ రియర్ టైర్లు, ముందు వైపున మరింత అధునాతనమైన అడ్జస్టబుల్ అప్ సైడ్ డౌన్ ఫోర్కులు, కొత్త రైడ్ మోడ్‌లు, రైడర్ కు మరింత ఎక్కువ సమాచారాన్ని అందించే ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు దూర ప్రయాణాలను ఉద్దేశించి రూపొందించిన పెద్ద ఫ్యూయల్ ట్యాంక్ వంటి మార్పులు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం, విక్రయించబడుతున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ ఇప్పటికే మంచి అడ్వెంచర్ టూరింగ్ మోటార్‌సైకిల్ అయినప్పటికీ, దీని ఇంజన్ లో పూర్తి పంచ్ లేదు.

కొత్త 2022 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 మొదటి టీజర్ విడుదల.. త్వరలోనే లాంచ్!

ఈ నేపథ్యంలో, ఈ కొత్త 450సీసీ ఇంజన్ లో దాని టార్క్ అవుట్‌పుట్‌ను పెంచడం ద్వారా మెరుగైన లో-రేంజ్ రేస్పాన్స్‌ను సాధించడం కోసం రాయల్ ఎన్‌ఫీల్డ్ దాని దాని గరిష్ట పవర్ అవుట్‌పుట్‌ను త్యాగం చేసే అవకాశం ఉంది. కొత్తగా రాబోయే రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450, ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న హిమాలయన్ మోటార్‌సైకిల్ తో పాటు విక్రయించబడుతుందా లేక కస్టమర్లను కన్ఫ్యూజ్ చేయడం ఎందుకని కంపెనీ తమ పాత మోడల్ హిమాలయన్ ని డిస్‌కంటిన్యూ చేసి, కేవలం కొత్త మరియు శక్తివంతమైన హిమాలయన్ 450 ని మాత్రమే విక్రయిస్తుందా అనేదానిపై ఇంకా స్పష్టత లేదు.

కొత్త 2022 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 మొదటి టీజర్ విడుదల.. త్వరలోనే లాంచ్!

ఆన్‌లైన్ లో లీకైన సమాచారం ప్రకారం, కొత్త 2022 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 మోటార్‌సైకిల్ దాని అవుట్‌గోయింగ్ మోడల్ కంటే కొంచెం పెద్దదిగా ఉంటుందని తెలుస్తోంది. అలాగే, ఇది ముందు వైపు మరింత షార్ప్ గా ఉండే నోస్ డిజైన్, గుండ్రని హెడ్‌లైట్లు, పెద్ద ఇంధన ట్యాంక్, స్పోక్డ్ వీల్స్ మరియు తేలికపాటి స్టీల్ ట్రేల్లిస్ ఫ్రేమ్ వంటి లక్షణాలను కలిగి ఉందని ఈ చిత్రాలు వెల్లడిస్తున్నాయి. ఇంకా ఇందులో బ్లూటూత్ ఆధారిత ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, స్విచ్ చేయగల డ్యూయల్-ఛానల్ ఏబిఎస్ వంటి మరికొన్ని అప్‌డేటెడ్ ఫీచర్లను కూడా ఆశించవచ్చు.

కొత్త 2022 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 మొదటి టీజర్ విడుదల.. త్వరలోనే లాంచ్!

కొత్తగా రాబోయే 2022 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 ఈ విభాగంలో కెటిఎమ్ 390 అడ్వెంచర్ మరియు బిఎమ్‌డబ్ల్యూ జి310 జిఎస్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. మార్కెట్లో వీటి ధరలు వరుసగా రూ. 3.37 లక్షలు మరియు రూ. 3.10 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా) గా ఉన్నాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ కొత్త హిమాలయన్ బైక్‌ను సుమారు రూ. 3 లక్షల (ఎక్స్-షోరూమ్) రేంజ్ లో విడుదల చేసే అవకాశం ఉంది. ఇదే గనుక జరిగితే ఇది ఈ విభాగంలోనే సరసమైన మిడ్-రేంజ్ అడ్వెంచర్ మోటార్‌సైకిల్‌గా ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 411 ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 2.41 లక్షల నుండి ప్రారంభం అవుతాయి.

Most Read Articles

English summary
New 2022 royal enfield himalayan 450 teaser out launch expected soon
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X