సమ్మె ఎఫెక్ట్: మారుతి ఏ-స్టార్ ఎగుమతులు ఆలస్యం

Maruti A-Star
గడచిన మూడు వారాలుగా మారుతి సుజుకి మానేసర్ ప్లాంటులో కొనసాగుతున్న కార్మికుల సమ్మె కారణంగా, కంపెనీ విదేశీ మార్కెట్లలో అందిస్తున్న ఏ-స్టార్ కార్ల ఎగుమతులో భారీ జాప్యం జరుగుతోంది. (భారత మార్కెట్లో ఏ-స్టార్‌ పేరుతో అమ్ముడవుతున్న ఈ కార్లు యూరప్ మార్కెట్లలో మాత్రం "ఆల్టో" పేరుతోనూ మరికొన్ని మార్కెట్లలో "సెలెరియో" పేరుతోనూ విక్రయించబడుతున్నాయి). మానేసర్ ప్లాంటులో కొత్త స్విఫ్ట్, స్విఫ్ట్ డిజైర్, ఏ-స్టార్ మరియు రిట్జ్ కార్లు ఉత్పత్తి అవుతాయి.

అయితే, గత మూడు వారాలుగా ఈ ప్లాంటులో మారుతి సుజుకి కేవలం కొత్త స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కారునే ఉత్పత్తి చేస్తుండటంతో ఇతర మోడళ్ల ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. మారుతి సుజుకి ఏ-స్టార్ కార్లకు భారత మార్కెట్లో డిమాండు పెద్దగా లేనప్పటికీ, విదేశీ మార్కెట్లో మాత్రం ఈ మోడల్‌కు మంచి ఆదరణ ఉంది. యూరప్, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆసియా మార్కెట్లలో ఈ కారు అమ్ముడువుతుంది. గత నెల 29 నుంచి మారుతి సుజుకి మానేసర్ ప్లాంటులో కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే.

Most Read Articles

English summary
Maruti Suzuki's Manesar plant labour issue enters 3rd week today. Production shortage ar Manesar plan lead to a delay in the company executing its export orders for the A-Star compact.
Story first published: Monday, September 19, 2011, 12:32 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X