భారీగా పెరిగిన టాటా హెక్సా మరియు సఫారీ ధరలు
టాటా మోటార్స్ తమ హెక్సా మరియు సఫారీ ఎస్‌యూవీల ధరలు పెంచింది. గత వారంలో జరిగిన జిఎస్‍టి సెస్ సవరణకు అనుగుణంగా టాటా ఈ ధరల పెంపు నిర్ణయం తీసుకుంది.
టాటా మోటార్స్ తమ హెక్సా మరియు సఫారీ ఎస్‌యూవీల ధరలు పెంచింది. గత వారంలో జరిగిన జిఎస్‍టి సెస్ సవరణకు అనుగుణంగా టాటా ఈ ధరల పెంపు నిర్ణయం తీసుకుంది. పెరిగిన కొత్త ధరలు వెంటనే అమల్లోకి వచ్చినట్లు టాటా ప్రకటించింది.

హెక్సా మీద రూ. 77,000 ల నుండి రూ. 96,000 ల వరకు పెరిగాయి మరియు టాటా సఫారీ మీద రూ. 67,000 ల నుండి రూ. 86,000 ల మధ్య పెరిగాయి. జిఎస్‌టి సవరణ అనంతరం ఎస్‌యూవీ వాహనాల మీద ఉన్న సెస్ 7 శాతానికి పెంచారు. దీంతో ఎస్‌యూవీల మీద మొత్తం 50శాతం(28 శాతం జిఎస్‌టి + 22 శాతం సెస్) ట్యాక్స్ పడుతోంది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా పండుగ ఆఫర్లను నడుస్తున్నాయి. ఈ తరుణంలో జిఎస్‌టి సవరణ కారణంగా పెరిగిన ధరలు టాటా వారి హెక్సా మరియు సఫారీ రెండు మోడళ్ల సేల్స్ మీద తీవ్ర ప్రభానం చూపనుంది. టాటా ఈ ఏడాదిలో విడుదల చేసిన హెక్సా ఎస్‌యూవీకి మంచి డిమాండ్ లభిస్తోంది.
Recommended Video


టాటా మోటార్స్ హెక్సా మరియు సఫారీ ఎస్‌యూవీలను ఒకే లాడర్ ఫ్రేమ్ ఛాసిస్ ఆధారంగా రియర్ వీల్ డ్రైవ్ మరియు ఆల్ డ్రైవ్ సిస్టమ్‌లతో అందుబాటులో ఉంచింది. విభిన్న రకాలుగా పవర్ ఉత్పత్తి చేసేలా 2.2-లీటర్ కెపాసిటి గల వారికోర్ టుర్బో డీజల్ ఇంజన్ కలదు.

హెక్సా మరియు సఫారీ లలోని ప్రారంభ వేరియంట్లలో 148బిహెచ్‌పి పవర్ మరియు 320ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసే ఇంజన్, అదే విధంగా టాప్ ఎండ్ వేరియంట్లలో 154బిహెచ్‌పి పవర్ మరియు 400ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగల ఇంజన్‌ను అందించింది. రెండు ఎస్‌యూవీలలోని ప్రారంభ వేరియంట్లు 5-స్పీడ్ మ్యాన్యువల్, టాప్ ఎండ్ వేరియంట్లు 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభించును మరియు హెక్సా టాప్ ఎండ్ వేరియంట్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లో కూడా లభిస్తుంది.

హెక్సా వేరియంట్లు జిఎస్ ముందు జిఎస్‌టి తరువాత వ్యత్యాసం:
| హెక్సా వేరియంట్లు | జిఎస్ ముందు | జిఎస్‌టి తరువాత | వ్యత్యాసం |
| ఎక్స్ఇ | 10.95 లక్షలు | 11.72 లక్షలు | 77,000 |
| ఎక్స్ఎమ్ | 12.80 లక్షలు | 13.60 లక్షలు | 80,000 |
| ఎక్స్ఎమ్ఎ | 13.90లక్షలు | 14.81లక్షలు | 91,000 |
| ఎక్స్‌టి | 15.03లక్షలు | 15.94లక్షలు | 91,000 |
| ఎక్స్‌టిఎ | 16.13లక్షలు | 17.07లక్షలు | 94,000 |
| ఎక్స్‌టి 4X4 | 16.23లక్షలు | 17.19లక్షలు | 96,000 |

| సఫారీ వేరియంట్లు | జిఎస్ ముందు | జిఎస్‌టి తరువాత | వ్యత్యాసం |
| ఎల్ఎక్స్ 4X2 | 9.75లక్షలు | 10.42లక్షలు | 67,000 |
| ఇఎక్స్ 4X2 | 11.56లక్షలు | 12.35లక్షలు | 79,000 |
| విఎక్స్ 4X2 | 13.02లక్షలు | 13.74లక్షలు | 72,000 |
| విఎక్స్ 4X4 | 14.47లక్షలు | 15.33లక్షలు | 86,000 |


Click it and Unblock the Notifications








