ఆటోమేటిక్ కార్ల మార్కెట్లోకి షాకింగ్ ధరతో టియాగో ను విడుదల చేసిన టాటా మోటార్స్

Written By:

హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో టాటా టియాగో అత్యంత శక్తివంతమైన కారుగా నిరూపించుకుంది. హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్ మొత్తాన్ని శాసించిన ఎన్నో మోడళ్లకు టియాగో గట్టి సమాధానమిస్తోంది. ఇప్పుడు సరసమైన ధరకే ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో విడుదలయ్యి మరో షాక్ ఇచ్చింది.

టాటా టియాగో ఎక్స్‌టిఎ ఆటోమేటిక్

ఆటోమేటిక్ వేరియంట్ హ్యాచ్‌బ్యాక్ కోరుకునే కస్టమర్ల కోసం టాటా ఇది వరకే టియాగోలోని ఎక్స్‌జడ్ఏ వేరింయట్‌ను ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో విడుదల చేసింది. ఇప్పుడు తక్కువ ధరతో ఆటోమేటి వేరియంట్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు టాటా టియాగోలోని ఎక్స్‌టి వేరియంట్‌లో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అందించింది ఎక్స్‌టిఏ వేరియంట్‌గా విపణిలోకి విడుదల చేసింది.

Recommended Video - Watch Now!
Tata Nexon Review: Specs
టాటా టియాగో ఎక్స్‌టిఎ ఆటోమేటిక్

ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ తయారీ సంస్థ మ్యాగ్నెట్టీ మారెల్లీ నుండి సేకరించిన ఈజీ షిఫ్ట్ అనే పేరుతో పిలువడే ఏఎమ్‌టి గేర్‌బాక్స్‌లను టాటా టియాగో ఎక్స్‌టిఏ వేరియంట్లో అందించింది. ఈ వేరియంట్ ధర రూ. 4.79 లక్షలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉంది. ఇదే ట్రాన్స్‌మిషన్‌ను టాటా తమ నానో మరియు జెస్ట్ కార్లలో వినియోగించింది.

టాటా టియాగో ఎక్స్‌టిఎ ఆటోమేటిక్

ఏఎమ్‌టి గేర్‌బాక్స్ గల టియాగో ఎక్స్‌టిఏ ఏఎమ్‌టి వేరియంట్లో సాంకేతికంగా 1.2-లీటర్ సామర్థ్యం గల మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 84బిహెచ్‌పి పవర్ మరియు 114ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

టాటా టియాగో ఎక్స్‌టిఎ ఆటోమేటిక్

ఇందులోని ఏఎమ్‌టి గేర్‌బాక్స్‌లో ఆటోమేటిక్, రివర్స్, న్యూట్రల్ మరియు మ్యాన్యువల్ అనే నాలుగు ఫీచర్లు ఉన్నాయి. మరియు టాటా టియాగో ఎక్స్‌టిఏ ఏఎమ్‌టి వేరియంట్ స్పోర్ట్ మరియు సిటి అనే రెండు డ్రైవింగ్ మోడ్స్ కలిగి ఉంది.

టాటా టియాగో ఎక్స్‌టిఎ ఆటోమేటిక్

కాంపిటీషన్ విషయానికి వస్తే, టియాగో ఆటోమేటిక్ వేరియంట్ లైనప్‌లోని ఎక్స్‌టిఏ ఏఎమ్‌టి మోడల్ మారుతి సుజుకి సెలెరియో ఏఎమ్‌టి, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 ఆటోమేటిక్, మారుతి ఇగ్నిస్ ఏఎమ్‌టి మరియు రెనో క్విడ్ 1.0-లీటర్ ఏమ్‌టి మోడళ్లకు గట్టి పోటీనివ్వనుంది.

టాటా టియాగో ఎక్స్‌టిఎ ఆటోమేటిక్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టాటా టియాగో ఎక్స్‌టిఏ ఏఎమ్‌టి వేరియంట్ ధర పోటీలో ఉన్న ఒక్క క్విడ్ ఏఎమ్‌టి మినహా మిగతా అన్ని కార్లతో పోల్చితే తక్కువగా ఉంది. అయితే రెనో క్విడ్ ఏమ్‌టి కన్నా టియాగో ఎక్స్‌టిఏ ఏమ్‌టి కారులో శక్తివంతమైన ఇంజన్ కలదు. కాబట్టి హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో శక్తివతంమైన ఇంజన్‌తో సరసమైన ధరకు టియాగో లభిస్తోంది.

English summary
Read In Telugu: Tata Tiago XTA AMT Variant Launched In India; Priced At Rs 4.79 Lakh

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark