భారీ బుకింగ్స్ దిశగా దూసుకెళుతున్న 2018 మారుతి స్విఫ్ట్

Written By:
Recommended Video - Watch Now!
Auto Rickshaw Explodes In Broad Daylight

మారుతి సుజుకి అతి త్వరలో విడుదల చేయనున్న 2018 మారుతి స్విఫ్ట్ మీద దేశవ్యాప్తంగా అధికారిక బుకింగ్స్ ప్రారంభించిన విషయం తెలిసిందే. బుకింగ్స్ ప్రారంభించిన అనతి కాలంలో స్విఫ్ట్ మీద భారీ ఆదరణ లభిస్తోంది. మారుతి ఊహించని విధంగా స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ మీద భారీ సంఖ్యలో బుకింగ్స్ నమోదయ్యాయి.

2018 మారుతి సుజుకి స్విఫ్ట్

తాజాగా అందిన కథనం మేరకు, దేశవ్యాప్తంగా మారుతి కొత్త తరం స్విఫ్ట్ మీద ఏకంగా 30,000 లకు పైగా బుకింగ్స్ వచ్చినట్లు తెలిసింది. 2018 మారుతి స్విఫ్ట్ మీద 2018 జనవరిలో రూ. 11,000 ల ధరతో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.

2018 మారుతి సుజుకి స్విఫ్ట్

దేశవ్యాప్తంగా ఉన్న మారుతి సుజుకి అరెనా విక్రయ కేంద్రాలలో 2018 స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకున్న తరువాత బుకింగ్ క్యాన్సిల్ చేసుకుంటే బుకింగ్ మొత్తాన్ని మారుతి వాపస్ చేస్తుంది.

2018 మారుతి సుజుకి స్విఫ్ట్

మారుతి సుజుకి మరో రెండు రోజుల్లో ప్రారంభ కానున్న 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పో వేదిక మీద తమ మూడవ తరానికి చెందిన స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను ఆవిష్కరించి, ఫిబ్రవరి 7, 2018 న పూర్తి స్థాయిలో విక్రయాలకు సిద్దంగా లాంచ్ చేయడానికి సన్నద్దమైంది.

2018 మారుతి సుజుకి స్విఫ్ట్

మారుతి ఈ మధ్య కాలంలో విపణిలోకి విడుదల చేసిన మోడళ్లు భారీ సక్సెస్ అందుకున్నాయి. ప్రస్తుతం కొత్తం తరం స్విఫ్ట్ మీద వస్తున్న ఆదరణ చూస్తే మారుతి సుజుకి సంస్థకు మరో భారీ సక్సెస్‌ సిద్దంగా ఉందని చెప్పవచ్చు.

2018 మారుతి సుజుకి స్విఫ్ట్

విడుదలకు ముందే భారీ ఆదరణ లభించింది. విడుదల అనంతరం, ధరల వివరాలు వెల్లడయితే, స్విఫ్ట్ మీద ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలని మారుతి సుజుకి మేనేజింగ్ డైరక్టర్ మరియు సిఇఒ కెనిచి అయుకవా చెప్పుకొచ్చాడు.

2018 మారుతి సుజుకి స్విఫ్ట్

న్యూ డిజైర్ మరియు బాలెనో కార్లను అభివృద్ది చేసిన హార్టెక్ ఫ్లాట్‌ఫామ్ మీద స్విఫ్ట్ హ్యాచ్‍‌బ్యాక్ కారును మారుతి సుజుకి నిర్మించింది. 2018 మారుతి స్విఫ్ట్ రూ. 5 లక్షల ప్రారంభ ధరతో విడుదలయ్యే అవకాశం ఉంది.

2018 మారుతి సుజుకి స్విఫ్ట్

2018 మారుతి స్విఫ్ట్ గురించి మరిన్నికథనాలు....

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

English summary
Read In Telugu: 2018 all-new Maruti Swift hatchback races to 30,000 bookings in India

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark