ప్రతి హైదరాబాదీ ఈ ముగ్గురు వ్యక్తులకు థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే!!

Written By:

గత దశాబ్ద కాలంగా హైదరాబాద్ నగరంలో షాపింగ్ మాల్స్, మల్టీకాంప్లెక్సులు మరియు పెద్ద పెద్ద వాణిజ్య సముదాయాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. వీటికి కస్టమర్ల తాకిడి ఎప్పుడూ అధికంగానే ఉంటుంది. వారాంతాల్లో అయితే చెప్పనవసరం లేదు.

హైదరాబాద్ నగరంలో పార్కింగ్ ఫీజులు తొలగించిన తెలంగాణ సర్కారు

షాపింగ్ మాల్స్‌లో కొనుగోలు చేయడానికి, సినిమాలు చూడటానికి వెళ్లాలంటే వ్యక్తి గత వాహనాలను ఖచ్చితంగా ఆయా మాల్స్‌లో ఉన్న షాపింగ్ ఏరియాల్లోనే పార్క్ చేయాల్సి ఉంటుంది. మాల్స్‌లో కొనుగోలు చేసి, సినిమాలు చూసి షాపింగ్ కాంప్లెక్సులకు బిజినెస్ కల్పిస్తున్న కస్టమర్ల మీద యాజమాన్యాలు విపరీతంగా పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నాయి.

హైదరాబాద్ నగరంలో పార్కింగ్ ఫీజులు తొలగించిన తెలంగాణ సర్కారు

పార్కింగ్ ఫీజు మీద అదనంగా స్టేట్ మరియు సెంట్రల్ జీఎస్‌టీ ఛార్జీలు కూడా వసూలు చేయడం గమనార్హం. షాపింగ్ మాల్స్ యాజమాన్యం తీసుకున్న ఇలాంటి నిర్ణయాలతో సామాన్యుడి జేబుకు చిల్లులుపడుతున్నాయి. దీనిని అరికట్టడానికి ముగ్గురు వ్యక్తులు చేసిన నిరంతరం కృషి ఫలితంగా, హైదరాబాద్ నగరంలో పార్కింగ్ ఫీజు అనే పదం అడ్రస్ లేకుండా పోయింది.

హైదరాబాద్ నగరంలో పార్కింగ్ ఫీజులు తొలగించిన తెలంగాణ సర్కారు

మీరు చదివింది నిజమే... షాపింగ్ మాల్స్ మరియు మల్టీప్లెక్సులలో పార్కింగ్ ఫీజును తొలగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఓ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ సిటీ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్బన్ ప్రదేశాలలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ మరియు, మల్టీప్లెక్సులు మరియు ఇతర వాణిజ్య సంస్థలలో మొదటి అరగంట వరకు ఎలాంటి షరతులు లేని ఉచిత పార్కింగ్కల్పించాలని సూచించింది.

హైదరాబాద్ నగరంలో పార్కింగ్ ఫీజులు తొలగించిన తెలంగాణ సర్కారు

హైదరాబాద్ నగరంలో పార్కింగ్ విషయమై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ తాజాగా ఒక ప్రభుత్వ ఆర్డర్‌ను రిలీజ్ చేసింది. ఇది, ఏప్రిల్ 1, 2018 నుండి అమల్లోకి రానుంది.

Recommended Video - Watch Now!
Three Women Wearing Sarees Ride A Yamaha R15 In Hyderabad; Video Goes Viral
హైదరాబాద్ నగరంలో పార్కింగ్ ఫీజులు తొలగించిన తెలంగాణ సర్కారు

నగరంలో ఉన్న షాపింగ్ మాల్స్ మరియు మల్టీప్లెక్సులలో కస్టమర్లు తమ వాహనాలను పార్క్ చేసినపుడు, గంట కంటే తక్కువ, 30 నిమిషాల కంటే ఎక్కువ సమయం ఉన్నట్లయితే, ఆయా మాల్స్‌లో ఏదేనా కొనుగోలు చేసినట్లు పార్కింగ్ సిబ్బందికి బిల్లులతో చూపిస్తే వారికి పార్కింగ్ ఫీజు మినహాయింపు ఉంటుంది.

హైదరాబాద్ నగరంలో పార్కింగ్ ఫీజులు తొలగించిన తెలంగాణ సర్కారు

గంటకు ఎక్కువ సమయం పాటు పార్కింగ్ చేసినట్లయితే, అలాంటి కస్టమర్లు పార్కింగ్ ఫీజు కంటే అధిక విలువ చేసే కొనుగోళ్లు ఆయా మాల్స్‌లో జరిపినట్లు బిల్లుల ద్వారా చూపిస్తే వారు కూడా ఉచిత పార్కింగ్ పొందవచ్చు.

హైదరాబాద్ నగరంలో పార్కింగ్ ఫీజులు తొలగించిన తెలంగాణ సర్కారు

అంటే, షాపింగ్ మాల్స్ మరియు మల్టీప్లెక్సుల్లో ఎలాంటి కొనుగోళ్లు జరపకుండా రోజంతా పార్కింగ్ చేసినట్లయితే పార్కింగ్ ఫీజు చెల్లించాలి. అంతే కాకుండా, గంట కంటే ఎక్కువ సేపు పార్కింగ్ చేసి, పార్కింగ్ ఫీజు కంటే తక్కువ విలువైన కొనుగోళ్లు జరిపిన వారు కూడా పార్కింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

హైదరాబాద్ నగరంలో పార్కింగ్ ఫీజులు తొలగించిన తెలంగాణ సర్కారు

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నగర వ్యాప్తంగా మరియు అన్ని అర్బన్ ప్రదేశాల్లో ఉన్న వాణిజ్య సముదాయాలలో ఉచిత పార్కింగ్ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం, 29 ఏళ్ల వయస్సున్న విజయ్ గోపాల్ అనే సామాజిక వేత్త పార్కింగ్ ఫీజుల అరాచకానికి వ్యతిరేఖంగా వేసిన పిటిషన్.

హైదరాబాద్ నగరంలో పార్కింగ్ ఫీజులు తొలగించిన తెలంగాణ సర్కారు

వాణిజ్య సముదాయాలో కస్టమర్లు మీద అదనంగా పార్కింగ్ ఫీజులను వసూలు చేస్తున్నా, వాటి మీద గ్రేటర్ హైదరాబాద్ మునిసిపర్ కార్పోరేషన్(GHMC) ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తోందని విజయ్ గోపాల్ తన పిటిషన్‌లో పేర్కొన్నాడు.

హైదరాబాద్ నగరంలో పార్కింగ్ ఫీజులు తొలగించిన తెలంగాణ సర్కారు

సిటీ మొత్తం మీదున్న మాల్స్ మరియు వాణిజ్య సముదాయాలు కస్టమర్లు మరియు విజటర్స్ నుండి పార్కింగ్ ఫీజులను వసూలు చేసి, ఆ డబ్బుతో మాల్స్ నిర్వహణ చేపడతున్నారు. కస్టమర్లతో నడిచే ఈ మాల్స్ మళ్లీ కస్టమర్ల మీద పార్కింగ్ ఫీజు వేయడం ఏంటి? అంతే కాకుండా, పార్కింగ్ ఫీజుల మీద కూడా జీఎస్‌టీ వసూలు చేస్తుండటాన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్ వేసినట్లు గోపాల్ చెప్పుకొచ్చాడు.

హైదరాబాద్ నగరంలో పార్కింగ్ ఫీజులు తొలగించిన తెలంగాణ సర్కారు

షీలు రాజ్ మరియు సతీష్ కుమార్ పెండ్యాల అనే ఇద్దరు న్యాయవాదుల సహాయంతో విజయ్ గోపాల్ తన వాదనను గెలిపించాడు. నగర వ్యాప్తంగా ఉన్న వాణిజ్య సముదాయాలలో కస్టమర్ల మీద పార్కింగ్ ఫీజులను వసూల్ చేస్తున్నారు. పబ్లిక్ నుండి ఇలాంటి ఫీజులను వసూలు చేసే అధికారం షాపింగ్ మాల్స్ యాజమాన్యాలకు లేదని వాదించారు.

హైదరాబాద్ నగరంలో పార్కింగ్ ఫీజులు తొలగించిన తెలంగాణ సర్కారు

న్యాయవాది సతీష్ కుమర్ పెండ్యాల నగరంలోని వాణిజ్య సముదాయాల్లో పార్కింగ్ ఫీజులు వసూళ్లను వ్యతిరేకిస్తూ గతంలో రెండు పిటిషన్లు దాఖలు చేశాడు. అయితే, ఇదే సమస్య గురించి మూడవసారి దాఖలు చేసిన పిటిషన్‌ ఎట్టకేలకు మార్పును తీసుకొచ్చింది.

హైదరాబాదులో పార్కింగ్ ఫీజులు

1.ఇండియాలో రోడ్డుకు ఎడమవైపునే డ్రైవ్ చేయడం వెనకున్న ఆంతర్యం ఏమిటి?

2.కొత్త ట్రెండ్ సెట్ చేసిన క్లాసిక్ 350 గన్‌మెటల్ గ్రే బైకుతో తలలు పట్టుకుంటున్న రాయల్ ఎన్ఫీల్డ్

3.లక్షద్వీప్ దీవుల్లో అద్భుతాన్ని నిర్మిస్తున్న భారత్

4.ఇండియన్స్ మరిచిపోయిన టాటా కార్లు

5.మైలేజ్ ప్రియుల కోసం ఈ ఏడాది విడుదలవుతున్న కొత్త కార్లు

Source: ChaiBisket

English summary
Read In Telugu: Parking Fee In Malls Waived Off — Hyderabad City Residents Rejoice!

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark