TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
ఆటో ఎక్స్‌పో 2018: టాటా నెక్సాన్ ఏరో కాన్సెప్ట్ ఆవిష్కరణ
ఆటో ఎక్స్‌పో 2018: టాటా మోటార్స్ ఢిల్లీలో జరగుతున్న ఇండియన్ ఆటో ఎక్స్‌పో వేదిక మీద పలు కొత్త మోడళ్లను ఆవిష్కరించి, విదేశీ కార్ల తయారీ సంస్థలకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. అయితే, తాజాగా మరో కొత్త మోడల్‌ను ప్రవేశపెట్టింది. మారుతి సుజుకి వితారా బ్రిజాకు గట్టి పోటీనిచ్చే టాటా నెక్సాన్ ఏరో కాన్సెప్ట్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది.
టాటా నెక్సాన్ ఏరో కాన్సెప్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ గురించి పూర్తి వివరాలు మరియు ఫోటోల కోసం...
కస్టమర్‌కు నచ్చిన స్టైల్లో మోడిఫికేషన్స్ చేయించుకునే అవకాశాన్ని నెక్సాన్ ఏరో కాన్సెప్ట్ ఎస్‌యూవీలో టాటా మోటార్స్ కల్పించింది. ఇలాంటి అవకాశం గతంలో మారుతి సుజుకి తమ వితారా బ్రిజాకు ఐక్రియేషన్ అనే పేరుతో కల్పించింది. ఇప్పటికే, మంచి సక్సెస్‌ఫుల్ మోడల్‌గా నిలిచిన నెక్సాన్‌కు ఏరో కాన్సెప్ట్ పరిచయం బాగా కలిసొస్తుందని చెప్పవచ్చు.
టాటా మోటార్స్ నెక్సాన్ ఏరో కాన్సెప్ట్ ఎస్‌యూవీ డిజైన్ అంశాలను హైలైట్ చేసే రెండు విభిన్న బాడీ స్టైల్ డిజైనింగ్ కిట్‌లను పరిచయం చేసింది. అందులో "ఏరో" మరియు "ఆక్టివ్" ఉన్నాయి.
నెక్సాన్ ఏరో బాడీ కిట్‌లో ఉన్న సైడ్ స్కర్ట్స్, ముందు మరియు వెనుక వైపున బంపర్ ప్రొటెక్టర్స్, ఎక్స్‌క్లూజివ్ లిక్విడ్ సిల్వర్ కలర్ స్కీమ్, పియానో బ్లాక్ ఫినిషింగ్‌లో కాంబినేషన్‍లో ఉన్న రూఫ్ టాప్ వంటివి రెగ్యులర్ నెక్సాన్ మరియు ఏరో వెర్షన్‌కు మధ్య ఉన్న తేడాను గుర్తించేలా చేస్తాయి.
ఎక్ట్సీరియర్‌తో పాటు ఇంటీరియర్‌లో కూడా నెక్సాన్ ఏరో ప్యాకేజ్ అందివ్వడం జరిగింది. ఇంటీరియర్‌లోని సెంటర్ కన్సోల్, స్టీరింగ్ వీల్ మరియు డ్యాష్‌బోర్డ్ మీద గ్లోజీ ప్లాస్టిక్ అలంకరణలు ఉన్నాయి. నెక్సాన్ ఆక్టివ్ కిట్‌లో ఏరో కంటే విభిన్న డిజైనింగ్ ఎలిమెంట్లు లభించనున్నాయి.
ఏరో మరియు ఆక్టివ్ ప్యాకేజ్‌లతో పాటు కస్టమర్లు తమ అభిరుచికి అనుగుణంగా నచ్చిన స్టైల్లో కస్టమైజ్ చేసుకునే అవకాశాన్ని కూడా టాటా మోటార్స్ కల్పించింది. టాటా అన్ని షోరూమ్‌లలో కస్టమర్లు తమ నచ్చిన స్టైల్లో నెక్సాన్ స్టైలింగ్ చేసుకుని ఆర్డర్ ఇచ్చుకోవచ్చు.
ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ స్టైలింగ్ మార్పులు మినహాయిస్తే, ఈ టాటా నెక్సాన్ ఏరో కాన్సెప్ట్ ఎస్‌యూవీలో సాంకేతికంగా ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. మునుపటి నెక్సాన్ లభించే అవే పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లతో లభిస్తాయి.
టాటా నెక్సాన్ ఏరో కాన్సెప్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీలోని 1.2-లీటర్ కెపాసిటి గల టుర్బో-ఛార్జడ్ పెట్రోల్ ఇంజన్ 108.5బిహెచ్‌పి పవర్ మరియు 170ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనిని 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌లో ఎంచుకోవచ్చు.
నెక్సాన్ ఏరో కాన్సెప్ట్‌లో ఉన్న 1.5-లీటర్ కెపాసిటి గల డీజల్ ఇంజన్ 108.5బిహెచ్‌పి పవర్ మరియు 260ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనిని కూడా 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు. రెండు మోడళ్లలో కూడా ఏఎమ్‌టి ట్రాన్స్‌మిషన్ వెర్షన్‌ను ఆలస్యంగా పరిచయం చేసే అవకాశం ఉంది.
టాటా మోటార్స్ తమ నెక్సాన్ ఏరో విడుదల గురించి ఇంకా ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయలేదు. అయితే, ఇది పూర్తి స్థాయిలో విపణిలోకి విడుదలైతే, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రెగ్యులర్ నెక్సాన్ కంటే రూ. 30,000 ల అదనపు ధరతో లభించే అవకాశం ఉంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
టాటా నెక్సాన్ రెగ్యులర్ మోడళ్లతో పోల్చుకుంటే భిన్నంగా ఉండేందుకు పర్సనల్ కస్టమైజేషన్ అవకాశాన్ని తీసుకొచ్చింది. నా దగ్గర ఉన్న మోడల్ మరెవ్వరి దగ్గరా ఉండకూడదు అనుకునే కస్టమర్లకు ఈ ఆఫర్ చాలా బాగుంటుంది.
మొత్తానికి, భారతదేశపు బెస్ట్ సెల్లింగ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ మారుతి వితారా బ్రిజాకు గట్టి పోటీని తీసుకొచ్చింది. మరి మీకు కూడా అరుదైన నెక్సాన్ కావాలనుకుంటే సమీపంలో టాటా డీలర్‌ను సంప్రదించండి. దానికి ముందు టాటా రివీల్ చేసిన ఇతర కార్ల ఫోటో గ్యాలరీ మీద ఓ లుక్కేసుకోండి....