ఆటో ఎక్స్‌పో 2018: నెక్సాన్ ఆటోమేటిక్ ప్రవేశపెట్టిన టాటా మోటార్స్

టాటా మోటార్స్ నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఆటోమేటిక్ వెర్షన్‌ను 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించింది.

By Anil

Recommended Video

New Maruti Swift Launch: Price; Mileage; Specifications; Features; Changes

ఆటో ఎక్స్‌పో 2018: టాటా మోటార్స్ నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఆటోమేటిక్ వెర్షన్‌ను 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించింది. తొలుత మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో విడుదల చేసిన టాటా ఇప్పుడు నెక్సాన్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వేరియంట్‌ను అతి త్వరలో విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది.

టాటా నెక్సాన్ ఏఎమ్‌టి

టాటా నెక్సాన్ ఏఎమ్‌టి ధర రెగ్యులర్ వెర్షన్ నెక్సాన్ కంటే రూ. 30,000 లు అధికంగా ఉండనుంది. పూర్తి స్థాయిలో విపణిలోకి విడుదలైతే మార్కెట్లో ఉన్న ఫోర్డ్ ఇకోస్పోర్ట్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్ మరియు మహీంద్రా టియువి300 ఏఎమ్‌టి మోడల్‌కు గట్టి పోటీనివ్వనుంది.

టాటా నెక్సాన్ ఏఎమ్‌టి

నెక్సాన్ ఏఎమ్‌టి ట్రాన్స్‌మిషన్ వివరాలు

నెక్సాన్ ఏఎమ్‌టి అవే పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ వేరియంట్లలో లభ్యమవుతుంది. ఇందులోని 1.2-లీటర్ కెపాసిటి గల పెట్రోల్ ఇంజన్ 5,000ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 108బిహెచ్‌పి పవర్ మరియు 1,750ఆర్‌పిఎమ్ వద్ద 170ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

టాటా నెక్సాన్ ఏఎమ్‌టి

అదే విధంగా టాటా నెక్సాన్ లోని 1.5-లీటర్ టుర్భోఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్ 3,750ఆర్‌పిఎమ్ వద్ద 108బిహెచ్‌పి పవర్ మరియు 1,500ఆర్‌పిఎమ్ వద్ద 260ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

టాటా నెక్సాన్ ఏఎమ్‌టి

టాటా మోటార్స్ తమ నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీలోని పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ వేరియంట్లలో ఈ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అందించింది. సాధారణ నెక్సాన్ పెట్రోల్ మరియు డీజల్ వేరియంట్లలో 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఉంది.

టాటా నెక్సాన్ ఏఎమ్‌టి

సరికొత్త ఏఎమ్‌టి గేర్‌బాక్స్ వేరియంట్ నెక్సాన్ ఎస్‌యూవీలో క్రీప్ ఫంక్షన్ కలదు. గంటల తరబడి రద్దీతో నిండిన రోడ్ల మీద నెమ్మదిగా వెళ్లాల్సి వచ్చినపుడు ఈ క్రీప్ ఫంక్షన్ కారును నెమ్మదిగా ముందుకు పోనిస్తూ ఉంటుంది. మనం చేయాల్సిందల్లా బ్రేకును మెయింటెన్ చేయడమే.

టాటా నెక్సాన్ ఏఎమ్‌టి

ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వద్దు, మంచి డ్రైవింగ్ ఫీల్ కోసం స్వయంగా చేతితో గేర్లను మార్చుకుంటూ డ్రైవ్ చేయాలనుకునే ఔత్సాహికుల కోసం మ్యాన్యువల్ మోడ్ కూడా అందించారు. అంతే కాకుండా, సరికొత్త టాటా నెక్సాన్ ఆటోమేటిక్ మోడల్‌లో ఇకో, సిటీ మరియు స్పోర్ట్ అనే మూడు విభిన్న డ్రైవింగ్ మోడ్‌లు ఉన్నాయి.

టాటా నెక్సాన్ ఏఎమ్‌టి

టాటా నెక్సాన్ ఏఎమ్‌టి డిజైన్

టాటా నెక్సాన్ ఏఎమ్‌టి మరియు రెగ్యులర్ వెర్షన్ మధ్య డిజైన్ పరంగా ఎలాంటి వ్యత్యాసం లేదు. అయితే, ఎట్నా ఆరేంజ్ అనే నూతన బాడీ కలర్ నెక్సాన్ ఆటోమేటిక్ కాంపాక్ట్ ఎస్‌యూవీతో పరిచయం చేసింది. ఇతర వేరియంట్లలో కూడా ఈ కలర్ ఆప్షన్ తీసుకురానుంది.

టాటా నెక్సాన్ ఏఎమ్‌టి

టాటా నెక్సాన్ ఏఎమ్‌టి ఫీచర్లు

సరికొత్త టాటా నెక్సాన్ ఏఎమ్‌టిలో నెక్సాన్ రెగ్యులర్ వెర్షన్‌లోని మల్టిపుల్ ఎయిర్‌బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు అన్ని సేఫ్టీ ఫీచర్లను ఇందులో అంచింది. నూతన నెక్సాన్ ఏఎమ్‌టిలో ఏటవాలు ప్రదేశాల మీదుగా వెళ్లేందుకు హిల్ అసిస్ట్ ఫీచర్ కూడా వచ్చింది.

టాటా నెక్సాన్ ఏఎమ్‌టి

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టాటా మోటార్స్ హెచ్5ఎక్స్ మరియు 45ఎక్స్ కాన్సెప్ట్ మోడళ్లతో సహా నెక్సాన్ ఏఎమ్‌టి కాంపాక్ట్ ఎస్‌యూవీని ప్రదర్శించింది. విడుదలను సూచిస్తూ ప్రజల సందర్శనకు కొలువుదీర్చింది.

టాటా నెక్సాన్ ఏఎమ్‌టి

ఏదేమైనప్పటికీ, కస్టమర్ల మనస్సులో కాంపాక్ట్ ఎస్‌యూవీ కావాలనుకుంటే అది ఖచ్చితంగా నెక్సాన్ అయ్యుండాలనే ఉద్దేశంతో విభిన్న ఆప్షన్‌లలో నెక్సాన్‌ను కస్టమర్లకు చేరువ చేస్తోంది. దీని విడుదలతో నెక్సాన్ ఎస్‌యూవీ పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్, మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లలో ఎంచుకోవచ్చు.

Most Read Articles

English summary
Read In Telugu: Auto Expo 2018: Tata Nexon AMT Unveiled - Expected Launch Date & Prices, Features, Images
Story first published: Friday, February 9, 2018, 18:18 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X