ఈ మహీంద్రా థార్ ఖరీదు రూ.1.11 కోట్లు, ఇందులో అంత స్పెషల్ ఏంటో తెలుసా?

దేశీయ యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తు కొత్త తరం 2020 మహీంద్రా థార్‌ను కంపెనీ అక్టోబర్ 2, 2020వ తేదీన మార్కెట్లో విడుదల చేయనుంది. మహీంద్రా ఇటీవలే తమ మొట్టమొదటి మహీంద్రా థార్ ఎస్‌యూవీని చారిటీ కోసం వేలం వేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసినదే.

ఈ మహీంద్రా థార్ ఖరీదు రూ.1.11 కోట్లు, ఇందులో అంత స్పెషల్ ఏంటో తెలుసా?

మొట్టమొదటి 2020 మోడల్ ఇయర్ థార్ ఆఫ్-రోడ్ ఎస్‌యూవీకి సెప్టెంబర్ 29, 2020వ తేదీన వేలం ముగిసినట్లు కంపెనీ పేర్కొంది. ఈ వేలంలో ఢిల్లీకి చెందిన ఆకాష్ మిందా అనే వ్యక్తి అత్యధికంగా రూ.1.11 కోట్ల ధరను బిడ్ చేసి, ఈ కొత్త తరం థార్‌ను సొంతం చేసుకున్నారు.

ఈ మహీంద్రా థార్ ఖరీదు రూ.1.11 కోట్లు, ఇందులో అంత స్పెషల్ ఏంటో తెలుసా?

ఇదివరకు చెప్పినట్లుగానే, కస్టమర్స్ బిడ్ చేసిన మొత్తానికి సమానంగా మహీంద్రా కూడా తమ వంతుగా అంతే మొత్తాన్ని జోడించి, ఆ రెండింటినీ కలిపి చారిటీ కోసం దానం చేయనున్నారు. అంటే మొత్తం రూ.2.22 కోట్లను మహీంద్రా గ్రూప్ చారిటీ కోసం దానం చేయనుంది.

MOST READ:అక్టోబర్ 1 నుంచి కొత్త ఆర్‌సి, డ్రైవింగ్ లైసెన్స్ ఫార్మాట్ : ఇది ఎలా ఉంటుందో తెలుసా ?

ఈ మహీంద్రా థార్ ఖరీదు రూ.1.11 కోట్లు, ఇందులో అంత స్పెషల్ ఏంటో తెలుసా?

ఈ నగదు మొత్తాన్ని దేశంలో కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారి సమయంలో వివిధ సహాయ కార్యక్రమాల కోసం ఉపయోగించనున్నారు. నాంది ఫౌండేషన్, వి ఆర్ స్వదేష్ ఫౌండేషన్ లేదా పిఎమ్ కేర్స్ ఫండ్ వంటి సంస్థలకు ఈ మొత్తాన్ని విరాళంగా ఇవ్వబడుతుందని కంపెనీ గతంలో తెలిపింది.

ఈ మహీంద్రా థార్ ఖరీదు రూ.1.11 కోట్లు, ఇందులో అంత స్పెషల్ ఏంటో తెలుసా?

కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారి సమయంలో దేశానికి నంబర్ 1 థార్ సహాయం చేయడమే కాకుండా, గెలిచిన బిడ్డర్‌కు ఈ వాహనాన్ని మరింత ప్రత్యేకమైనదిగా చేయటం కోసం కంపెనీ ఇందులో కొన్ని ప్రత్యేక ఫీచర్లను, డీటేలింగ్స్‌ను కూడా జోడించనుంది. కొత్త తరం థార్ వేరియంట్ లైనప్‌లో మిందా తనకు నచ్చిన వేరియంట్ మరియు ఇంజన్ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు.

MOST READ:సెప్టెంబర్ నెలలో ప్రారంభమైన కొత్త కార్లు.. ఇవే

ఈ మహీంద్రా థార్ ఖరీదు రూ.1.11 కోట్లు, ఇందులో అంత స్పెషల్ ఏంటో తెలుసా?

దీనికి అదనంగా, థార్ #1 వేరియంట్‌ను సొంతం చేసుకున్న కార్ లెథర్ సీట్లపై మిందా తన అక్షరాలతో కస్టమైజ్డ్ బ్యాడ్జింగ్‌ను పొందవచ్చు. అంతేకాకుండా, విన్ (వెహికల్ ఐడెంటిఫికేషన్ నెంబర్)పై సీరియల్ నంబర్ 1 కూడా ఉంటుంది. ఇది ఖచ్చితంగా కొనుగోలుదారుకు ప్రత్యేకమైనదిగా నిలుస్తుంది.

ఈ మహీంద్రా థార్ ఖరీదు రూ.1.11 కోట్లు, ఇందులో అంత స్పెషల్ ఏంటో తెలుసా?

కొత్త తరం 2020 మహీంద్రా థార్ కోసం ఇప్పటికే దేశవ్యాప్తంగా బుకింగ్‌లు మరియు రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభమయ్యాయి.

ఇటీవలే ఆవిష్కరించిన ఈ ఎస్‌యూవీకి మార్కెట్లో మంచి ఆదరణ లభిస్తోంది. సరికొత్త డిజైన్, ఫీచర్స్, పెర్ఫార్మెన్స్ మరియు టెక్నాలజీలతో ఇది రూపుదిద్దుకుంది.

MOST READ:హోండా ప్రవేశపెట్టిన కొత్త బైక్ ; హైనెస్ సిబి 350.. చూసారా !

ఈ మహీంద్రా థార్ ఖరీదు రూ.1.11 కోట్లు, ఇందులో అంత స్పెషల్ ఏంటో తెలుసా?

కొత్త తరం మహీంద్రా థార్ ఆఫ్-రోడ్ ఎస్‌యూవీ రెండు వేరియంట్లలో లభ్యం కానుంది. అవి: ఏఎక్స్ మరియు ఎల్ఎక్స్. ఏఎక్స్ వేరియంట్ చాలా తక్కువ ఎలక్ట్రానిక్స్ అసిస్టెన్స్ ఫీచర్లతో హార్డ్‌కోర్ ఆఫ్-రోడ్ ఔత్సాహికులను ఉద్దేశించి డిజైన్ చేయబడినది. ఇకపోతే టాప్-ఎండ్ ఎల్ఎక్స్ వేరియంట్ మార్కెట్లో సాధారణ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకొని అప్‌డేటెడ్ ఎలక్ట్రానిక్స్ ప్యాకేజీతో తయారు చేయబడినది.

ఈ మహీంద్రా థార్ ఖరీదు రూ.1.11 కోట్లు, ఇందులో అంత స్పెషల్ ఏంటో తెలుసా?

ఈ కొత్త తరం మహీంద్రా థార్‌లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఇందులోని అప్‌డేట్ చేయబడిన ఇంజన్ ఆప్షన్స్ గురించి. ఇందులో 2.0-లీటర్ టి-జిడి ఎమ్‌స్టాలియన్ పెట్రోల్ ఇంజన్ మరియు 2.2-లీటర్ ఎమ్‌హాక్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. పెట్రోల్ ఇంజన్ 150 బిహెచ్‌పి పవర్‌ను మరియు 320 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ ఇంజన్ 130 బిహెచ్‌పి మరియు 300 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

MOST READ:బైక్‌కు జరిమానా విధించడానికి గూగుల్ సర్చ్ చేసిన చేసే పోలీసులు.. ఎందుకో తెలుసా ?

ఈ మహీంద్రా థార్ ఖరీదు రూ.1.11 కోట్లు, ఇందులో అంత స్పెషల్ ఏంటో తెలుసా?

ఈ రెండు ఇంజన్లు సిక్స్-స్పీడ్ మాన్యువల్ లేదా సిక్స్-స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తాయి. అంతేకాకుండా, ఇందులోని అన్ని మోడళ్లను స్టాండర్డ్‌గా షిఫ్ట్-ఆన్-ఫ్లై ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌తో అందించనున్నారు.

అప్‌డేట్ చేయబడిన ఈ కొత్త ఎస్‌యూవీలో సరికొత్త గ్రిల్ డిజైన్, హెడ్‌ల్యాంప్స్, ఫ్రంట్ బంపర్‌పై స్కఫ్ ప్లేట్లతో ఇది కొత్త ఫ్రంట్ ఫాసియాను కలిగి ఉంటుంది. ఇంకా ఇందులో కొత్త 18 ఇంచ్ వీల్స్ మరియు కొత్త టెయిల్ లైట్స్ డిజైన్‌ను కూడా గమనించవచ్చు. మహీంద్రా మొట్టమొదటిసారిగా ఈ ఆఫ్‌-రోడర్‌కు ఫ్యాక్టరీ ఫిట్టెడ్ హార్డ్-టాప్‌ను కూడా అందిస్తోంది.

ఈ మహీంద్రా థార్ ఖరీదు రూ.1.11 కోట్లు, ఇందులో అంత స్పెషల్ ఏంటో తెలుసా?

ఇంటీరియర్స్ విషయానికి వస్తే, ఈ కొత్త ఎస్‌యూవీలో ఇప్పుడు అనేక ఫీచర్లు మరియు పరికరాలను జోడించారు. ఇందులో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేకు సపోర్ట్ ఇచ్చే 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, క్రూయిజ్ కంట్రోల్, మాన్యువల్ షిఫ్ట్-ఆన్-ఫ్లై 4x4 సిస్టమ్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు రూఫ్-మౌంటెడ్ స్పీకర్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఈ మహీంద్రా థార్ ఖరీదు రూ.1.11 కోట్లు, ఇందులో అంత స్పెషల్ ఏంటో తెలుసా?

కొత్త 2020 మహీంద్రా థార్ వివిధ రకాల సీటింగ్ కాన్ఫిగరేషన్లతో లభిస్తుంది. కస్టమర్ ఎంచుకునే వేరియంట్‌ను బట్టి ఇందులో నాలుగు ఫ్రంట్ ఫేసింగ్ సీట్లు లేదా రెండు ఫ్రంట్ మరియు నాలుగు సైడ్ ఫేసింగ్ సీట్ల ఆప్షన్‌లో ఇది లభిస్తుంది. మార్కెట్లో దీని ధరలు రూ.9.75 లక్షల నుండి రూ.12.49 లక్షల మధ్యలో ఉండొచ్చని అంచనా (అన్ని ఎక్స్-షోరూమ్, ధరలు).

ఈ మహీంద్రా థార్ ఖరీదు రూ.1.11 కోట్లు, ఇందులో అంత స్పెషల్ ఏంటో తెలుసా?

కొత్త 2020 మహీంద్రా థార్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

దేశంలో కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారి సమయంలో దేశానికి సహాయం చేయడంలో మహీంద్రా సరికొత్త థార్‌కు లభించిన ఆదరణను గొప్ప ప్రయోజనం కోసం ఉపయోగించుకుంది. అదనంగా, గెలిచిన బిడ్డర్ కూడా ఈ ప్రయోజనంలో ఒక భాగం అయ్యారు.

Most Read Articles

English summary
The all-new Mahindra Thar has been auctioned off at Rs 1.1 crore in India as the bidding came to an end on September 29 at 06:00 p.m. The winning bid was entered by Delhi-based Aakash Minda and now becomes the proud owner of Thar No.1. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X