Just In
Don't Miss
- Sports
మ్యాక్సీనా మజాకానా.. సిక్స్ కొడితే సీటుకే బొక్క!
- Finance
చైనా కుబేరుల జాబితాలో జాక్‌మా వెనక్కు.. మొదటి స్థానం నుండి నాలుగో స్థానానికి .. రీజన్ ఇదే !!
- News
నటి శ్రీసుధపై వేధింపుల కేసు... కెమెరామెన్ శ్యామ్ కె నాయుడుకి సుప్రీం కోర్టు నోటీసులు...
- Movies
'పంట చేతికొచ్చింది' అంటున్న శర్వానంద్.. శ్రీకారం సిద్దమైంది!
- Lifestyle
బెడ్ రూమ్ లో ఈ లోదుస్తులుంటే... రొమాన్స్ లో ఈజీగా రెచ్చిపోవచ్చని తెలుసా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మారుతి సుజుకి ఈకో ఎమ్‌పివిలో హెడ్‌ల్యాంప్ సమస్య, రీకాల్
మారుతి సుజుకి భారత మార్కెట్లో విక్రయించిన ఈకో ఎమ్‌పివికి సంబంధించి మాస్ రీకాల్‌ను ప్రకటించింది. మారుతి సుజుకి ఈకో ఎమ్‌పివిలోని లోపభూయిష్టమైన హెడ్‌ల్యాంప్ యూనిట్ సమస్య కారణంగా ఈ రీకాల్‌ను ప్రకటించినట్లు కంపెనీ తెలిపింది.

అయితే, ఈ సమస్య కేవలం హెడ్‌ల్యాంప్ యూనిట్‌లో మిస్ అయిన స్టాండర్డ్ లోగోకి సంబంధించినది మాత్రమే అని కంపెనీ తెలిపింది. హెడ్‌ల్యాంప్‌లో ఎటువంటి ఫంక్షనల్ లోపం గురించి కంపెనీ ప్రస్తావించలేదు. ఇందులో కేవలం కాస్మెటిక్ లోపం మాత్రమే ఉన్నప్పటికీ, కంపెనీ భారీ మొత్తంలో ఈ వాహనాలను రీకాల్ చేస్తోంది.

ఈ రీకాల్‌కు గురైన మారుతి సుజుకి ఈకో వాహనాలన్నీ నవంబర్ 4, 2019 మరియు ఫిబ్రవరి 25, 2020 మధ్య కాలంలో తయారైనట్లుగా కంపెనీ తెలిపింది. వీటికి అదనంగా, గతంలో రీప్లేస్ చేయబడిన కొన్ని ఈకో వాహనాలు కూడా ఈ రీకాల్‌కు వర్తిస్తాయి.
MOST READ:ఇండియన్ రైల్వే విడుదల చేసిన వీడియో.. ఇది చూస్తే మీరు తప్పకుండా ట్రైన్‌లోనే వెళ్తారు

మొత్తం రీకాల్‌కు గురైన మారుతి ఈకో వాహనాల సంఖ్య 40,453 యూనిట్లుగా ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ రీకాల్‌లో అవసరమైతే ఏదైనా సమస్యను సరిచేయాల్సి వస్తే, దానిని ఉచితంగా చేయాలని మారుతి సుజుకి ధృవీకరిస్తుంది.

ఈ రీకాల్‌కు సంబంధించి కంపెనీ తమ ఈకో ఎమ్‌పివి కస్టమర్లను సంప్రదించనుంది. ఇందుకు ప్రత్యామ్నాయంగా, కస్టమర్లు తమ వాహనం రీకాల్‌కు గురైందో లేదో తెలుసుకోవటానికి సమీపంలోని అధీకృత డీలర్‌షిప్‌ను కూడా సంప్రదించవచ్చు.
MOST READ:కొత్త బైక్‌ను వెంబడించిన ట్రక్ డ్రైవర్.. తర్వాత ఏం జరిగిందో చూడండి

అంతేకాకుండా, కస్టమర్లు కంపెనీ వెబ్‌సైట్‌లోని ‘ఇంపార్టెంట్ కస్టమర్ ఇన్ఫర్మేషన్' విభాగాన్ని సందర్శించి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఇందులో కస్టమర్లు తమ మారుతి సుజుకి ఈకో వాహనం యొక్క చాస్సిస్స్ నెంబరును నమోదు చేసి, సదరు వాహనం రీకాల్‌కు గురైందో లేదో తెలుసుకోవచ్చు.

ఈకో ఎమ్‌పివి చాస్సిస్ నెంబర్ MA3 తో మొదలవుతుంది, తరువాత 14 అంకెలు ఆల్ఫా-న్యూమరిక్ సంఖ్యగా ఉంటుంది. వాహన ఐడి ప్లేట్‌లో చాస్సిస్ నెంబర్ ఎంబోస్ చేయబడి ఉంటుంది మరియు వాహన ఇన్వాయిస్ లేదా రిజిస్ట్రేషన్ పత్రాలలో కూడా పేర్కొనబడి ఉంటుంది.
MOST READ:ఎట్టకేలకు భారత మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త హ్యుందాయ్ ఐ 20 : ధర & ఇతర వివరాలు

మారుతి సుజుకి ఈకోకి సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, కంపెనీ భారత మార్కెట్లో ఇప్పటి వరకూ 7 లక్షలకు పైగా ఈకో యూనిట్లను విక్రయించినట్లు ప్రకటించింది. ఈ ఎమ్‌పివిని ప్రారంభించిన 10 సంవత్సరాలలో కొత్త అమ్మకాల మైలురాయిని సాధించింది. ఈకో దేశంలోని ప్రైవేట్ మరియు వాణిజ్య విభాగాల కస్టమర్ల కోసం అందుబాటులో ఉంది. - మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

మారుతి సుజుకి ఈకో ఎమ్‌పివి 1.2-లీటర్, ఫోర్ సిలిండర్ ఇంజన్ ఆప్షన్‌తో లభిస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 72 బిహెచ్‌పి శక్తిని మరియు 98 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇందులో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్‌జి కిట్‌ను కూడా కంపెనీ అందిస్తుంది.
MOST READ:వాహనాలకు HSRP నెంబర్ ప్లేట్ తప్పనిసరి అంటున్న ప్రభుత్వం.. ఎక్కడో తెలుసా ?

మారుతి సుజుకి ఈకో రీకాల్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
మారుతి సుజుకి ఈకో వాహనాలను హెడ్‌ల్యాంప్ సమస్య కారణంగా రీకాల్ చేస్తున్నప్పటికీ, ఇందులో ఫంక్షనల్ ఇష్యూస్ మాత్రం ఏమీ లేవని తెలుస్తోంది. కేవలం హెడ్‌ల్యాంప్ యూనిట్‌పై కనిపించని లోగో కారణంగానే వీటిని రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. కాబట్టి, ఈకో కస్టమర్లు కంగారు పడాల్సిన అవసరమైతే లేదని తెలుస్తోంది.