పోర్స్చే ఓనర్ తో గుంజిళ్ళు తీయించిన పోలీసులు, ఎందుకో తెలుసా..?

భారతదేశంలో కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న తరుణంలో భారత ప్రభుత్వం 21 రోజుల లాక్ డౌన్ విధించిన విషయం అందరికి తెలిసినదే. అంతే కాకుండా కరోనా మరింత ఎక్కువగా విస్తరిస్తున్న కారణంగా ప్రస్తుతం భారతదేశంలోలో లాక్ డౌన్ రెండవ దశ అమలులో ఉంది. ఇది 2020 మే 03 వరకు ఉంటుంది. బహుశా ఈ లాక్ డౌన్ మరింత పొడిగించే సూచనలు కనిపిస్తున్నాయి.

పోర్స్చే ఓనర్ తో గుంజిళ్ళు తీయించిన పోలీసులు, ఎందుకో తెలుసా..?

కరోనా దేశాన్ని ముప్పుతిప్పలు పెట్టి ఎంతోమంది ప్రజలు ప్రాణాలను తీస్తోంది. ఈ వైరస్ నివారణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చర్యలు కూడా తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా పోలీసులు ప్రజలను బయటికి రాకుండా కాపు కాస్తున్నారు. రాత్రి పగలు తేడాలేకుండా డాక్టర్లు కూడా సేవ చేస్తున్నారు.

కరోనా రోగులకు సేవ చేయడం వల్ల మరియు రోడ్డు మీదే డ్యూటీలు చేస్తున్న పోలీసులు కూడా కరోనా మహమ్మారికి బలైపోతున్నారు. ఇంత కఠినమైన పరిస్థితుల్లో కొంతమంది బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో కూడా అనవసరంగా బయట తిరుగుతున్న వారి గురించి ఇదివరకే చాలా తెలుసుకున్నాం. ఇప్పుడు మాస్కు లేకుండా స్పోర్ట్స్ కారులో బయటకి వచ్చిన వ్యక్తికి పోలీసులు తగిన గుణపాఠం చెప్పారు.

పోర్స్చే ఓనర్ తో గుంజిళ్ళు తీయించిన పోలీసులు, ఎందుకో తెలుసా..?

లాక్ డౌన్ ఉన్న సమయంలో ఒక వ్యక్తి మాస్కు లేకుండా పోర్స్చే 718 కారులో బయటకు వచ్చాడు. ఇతనిని పోలీసులు ఆపి వివరాలు అడిగారు అతడు తనకి కర్ఫ్యూ పాస్ ఉందని చెప్పాడు. మాస్కు లేకుండా బయట తిరుగుతున్నందుకు అతనితో పోలీసులు గుంజిళ్ళు తీయించారు . దీనికి సంబంధించిన వీడియో మనం ఇక్కడ చూడవచ్చు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

MOST READ:భారత్ లో ప్రారంభం కానున్న నెక్జు మొబిలిటీ ఎలక్ట్రిక్ మోటార్‌ సైకిల్స్

పోర్స్చే ఓనర్ తో గుంజిళ్ళు తీయించిన పోలీసులు, ఎందుకో తెలుసా..?

ఈ పోర్స్చే 718 కారు జర్మన్ బ్రాండ్ నుంచి వచ్చిన రెండు సీట్ల కన్వర్టిబుల్ స్పోర్ట్స్ కారు. ఆ వ్యక్తి ఈ లగ్జరీ కారులో మస్కు లేకుండా బయటకు వచ్చాడు. దీనిని గుర్తించిన పోలీసులు కారు నుండి బయటికి రమ్మని అతని మాస్కు ఎక్కడుందని అడిగారు. మాస్కు లేకపోవడం వల్ల పోలీసులు అతనితో గుంజిళ్ళు తీయించారు.

పోర్స్చే ఓనర్ తో గుంజిళ్ళు తీయించిన పోలీసులు, ఎందుకో తెలుసా..?

జర్మన్ బ్రాండ్ పోర్స్చే 718 బాక్స్‌స్టర్‌ కారు భారతదేశంలో రూ. 85.53 లక్షల ధరతో (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) లాంచ్ చేశారు. ఇది 2.0-లీటర్ నాలుగు సిలిండర్ల టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 300 పిఎస్ శక్తిని మరియు 380 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ మోటారు పోర్స్చే యొక్క 7 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడింది.

MOST READ:లెక్సస్ ఇండియా వినియోగదారులకి గుడ్ న్యూస్, అదేంటో తెలుసా..?

ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ప్రసార సెటప్‌లలో ఒకటిగా ఖ్యాతిని కలిగి ఉంది. ఈ కారు గంటకు 275 కిమీ వేగంతో ప్రయాణించగల సామర్త్యాన్ని కలిగి ఉంటుంది.

పోర్స్చే ఓనర్ తో గుంజిళ్ళు తీయించిన పోలీసులు, ఎందుకో తెలుసా..?

భారతదేశంలో కరోనా ఎక్కువగా వ్యాపిస్తున్న కారణంగా ప్రజలందరూ ప్రభుత్వానికి తమవంతు మద్దతుని ప్రకటిస్తూ కరోనా మహమ్మారి నుంచి తమని తాము మరియు దేశాన్ని కాపాడుకోవాలి.

MOST READ:లారా దత్త రాయల్ ఎన్‌ఫీల్డ్‌ బైక్ నడపడం చూసారా ?

Most Read Articles

English summary
Man Driving Porsche Despite Lockdown Fined for Not Wearing Mask, Made to do Sit-ups by Police. Read in Telugu.
Story first published: Monday, April 27, 2020, 14:39 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X