టాటా బిఎస్6 కార్లు వచ్చేశాయ్.. రూ. 11 వేలకే బుకింగ్స్ కూడా!

భారతదేశపు ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం టాటా మోటార్స్ బిఎస్6 కార్ల గురించి కీలక ప్రకటన చేసింది. టాటా మోటార్స్ బిఎస్6 వెర్షన్ టియాగో, టిగోర్, మరియు నెక్సాన్ పాపులర్ కార్ల మీద బుకింగ్స్ ప్రారంభించింది.

టాటా బిఎస్6 కార్లు వచ్చేశాయ్.. రూ. 11 వేలకే బుకింగ్స్ కూడా!

ప్రస్తుతం బిఎస్4 వెర్షన్‌లో లభిస్తున్న టియాగో, టిగోర్ మరియు నెక్సాన్ మోడళ్లలో సరికొత్త బిఎస్6 వెర్షన్ ఇంజన్ అప్‌డేట్ చేసింది. అతి త్వరలో మార్కెట్లోకి విడుదల చేయనున్న ఈ మూడు కార్ల మీద అఫీషియల్‌‌గా బుకింగ్స్ కూడా ప్రారంభించింది.

టాటా బిఎస్6 కార్లు వచ్చేశాయ్.. రూ. 11 వేలకే బుకింగ్స్ కూడా!

బిఎస్4 మోడళ్లతో పోల్చుకుంటే బిఎస్6 వెర్షన్ కార్ల ధరలు స్పల్పంగా పెరిగే అవకాశం. కస్టమర్లు ఇప్పుడు ఈ మూడు మోడళ్లను టాటా మోటార్స్ వెబ్‌సైట్ లేదా టాటా అధీకృత డీలర్ల వద్ద రూ. 11,000 చెల్లించి నచ్చిన కారును బుక్ చేసుకోవచ్చు. వీటిని అతి త్వరలో జరగబోయే 2020 ఢిల్లీ ఆటో ఎక్స్‌‌పోలో ప్రదర్శించనున్నారు.

టాటా బిఎస్6 కార్లు వచ్చేశాయ్.. రూ. 11 వేలకే బుకింగ్స్ కూడా!

టాటా టియాగో

సరికొత్త టాటా టియాగో పవర్‌ఫుల్ హ్యాచ్‌‌బ్యాక్, బిఎస్6 వెర్షన్‌లో డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, 7-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ వంటి ఫీచర్లు యధావిధిగా వస్తున్నాయి. అయితే, పాత టియాగోతో పోల్చితే కొత్త వెర్షన్‌లో లగ్జరీ ఫీల్‌నిచ్చే ఇంటీరియర్‌ వస్తుంది.

టాటా బిఎస్6 కార్లు వచ్చేశాయ్.. రూ. 11 వేలకే బుకింగ్స్ కూడా!

టాటా టియాగో బిఎస్6 కారులో అదే మునుపటి 1.2-లీటర్ 3-సిలిండర్ల రివట్రాన్ పెట్రోల్ ఇంజన్ వస్తోంది. బిఎస్6 ప్రమాణాలకు అనుగుణంగా అప్‌‌గ్రేడ్ చేయడంతో పర్ఫామెన్స్ మరింత పెరిగింది. ఇది 83బిహెచ్‌పి పవర్ మరియు 114ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

టాటా బిఎస్6 కార్లు వచ్చేశాయ్.. రూ. 11 వేలకే బుకింగ్స్ కూడా!

టాటా టియాగో బిఎస్6 పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ ఆప్షన్లు కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఛాయిస్‌లో లభిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టియాగో పెట్రోల్ వేరియంట్ల ధర శ్రేణి రూ. 4.40 లక్షల నుండి రూ. 6.37 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్) ఉంది. కొత్త తరం టియాగో హ్యాచ్‌బ్యాక్‌లో 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ కూడా పరిచయం అయ్యే అవకాశం ఉంది.

టాటా బిఎస్6 కార్లు వచ్చేశాయ్.. రూ. 11 వేలకే బుకింగ్స్ కూడా!

టాటా టిగోర్

కొత్త తరం బిఎస్6 టాటా టిగోర్ కాంపాక్ట్ సెడాన్ రీడిజైన్ చేయబడిన అధునాతన ఫ్రంట్ గ్రిల్, షార్ప్ లుకింగ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ మరియు ఎల్ఈడీ డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్, మరియు నూతన ఫాగ్ ల్యాంప్స్ జోడింపుతో కూడిన అధునాత బంపర్లు కూడా వస్తున్నాయి.

టాటా బిఎస్6 కార్లు వచ్చేశాయ్.. రూ. 11 వేలకే బుకింగ్స్ కూడా!

టాటా టిగోర్ ఇంటీరియర్‌లో కూడా భారీ మార్పులు జరగుతాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సరికొత్త అప్‌హోల్‌స్ట్రే, సాఫ్ట్-టచ్ ఇంటీరియర్ మెటీరియల్స్, 7-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, హార్మన్ కంపెనీ నుండి సేకరించిన 8-స్పీకర్ల ఆడియో సిస్టమ్ వంటివి వస్తున్నాయి.

టాటా బిఎస్6 కార్లు వచ్చేశాయ్.. రూ. 11 వేలకే బుకింగ్స్ కూడా!

2020 టాటా టిగోర్ కాంపాక్ట్ సెడాన్‌లో 1.2-లీటర్ పెట్రోల్ రివట్రాన్ రానుంది. బిఎస్6 ప్రమాణాలను పాటించే ఈ ఇంజన్ గరిష్టంగా 84బిహెచ్‌పి పవర్ మరియు 114ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు.

టాటా బిఎస్6 కార్లు వచ్చేశాయ్.. రూ. 11 వేలకే బుకింగ్స్ కూడా!

టాటా మోటార్స్ టిగోర్ సెడాన్ కారులో డీజల్ ఇంజన్ వచ్చే అవకాశాలు దాదాపు లేనట్లే.. ఫ్యూచర్‌లో కూడా చిన్న కార్లలో డీజల్ ఇంజన్‌లను శాశ్వతంగా నిలిపివేసే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టాటా టిగోర్ పెట్రోల్ వేరియంట్ల ధరల శ్రేణి రూ. 5.50 లక్షల నుండి రూ. 7.45 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉంది.

టాటా బిఎస్6 కార్లు వచ్చేశాయ్.. రూ. 11 వేలకే బుకింగ్స్ కూడా!

టాటా నెక్సాన్

టాటా మోటార్స్ ఇండియన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో తీసుకొచ్చిన టాటా నెక్సాన్ భారీ విజయాన్ని అందుకుంది. సరికొత్త 2020 టాటా నెక్సాన్‌లో బిఎస్6 ఇంజన్ ఆప్షన్లతో పాటు అత్యాధునిక ఫ్రంట్ అండ్ రియర్ బంపర్, రీడిజైన్ చేయబడిన ఫాగ్ ల్యాంప్స్ మరియు పగటి వేళలో కూడా వెలిగే ఎల్ఈడీ లైట్లు వస్తున్నాయి.

టాటా బిఎస్6 కార్లు వచ్చేశాయ్.. రూ. 11 వేలకే బుకింగ్స్ కూడా!

అయితే, 2020 టాటా నెక్సాన్ ఇంటీరియర్ అప్‌డేట్స్ గురించి ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం లేదు. కానీ కస్టమర్ల సౌకర్యం, రిచ్ ఫీలింగ్ కలిగించేలా ఇంటీరియర్‌ను తీర్చిదిద్దనున్నారు. పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్‌‌లను కూడా బిఎస్6 ప్రమాణాలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేస్తున్నారు.

టాటా బిఎస్6 కార్లు వచ్చేశాయ్.. రూ. 11 వేలకే బుకింగ్స్ కూడా!

టాటా నెక్సాన్ సాంకేతికంగా 1.2-లీటర్ టుర్భోఛార్జ్‌డ్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజల్ ఇంజన్ ఆప్షన్ల‌తో లభ్యమవుతోంది. 2020 టాటా నెక్సాన్‌లో కూడా ఇవే ఇంజన్‌లు యధావిధిగా లభిస్తాయి. 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లలో లభించే టాటా నెక్సాన్ ధరల శ్రేణి రూ. 6.58 లక్షల నుండి రూ. 11.10 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్ ఉంది.

టాటా బిఎస్6 కార్లు వచ్చేశాయ్.. రూ. 11 వేలకే బుకింగ్స్ కూడా!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఏప్రిల్ 01, 2020 నుండి ఇండియన్ విక్రయిచే ప్రతి వెహికల్‌లో కూడా బిఎస్6 ప్రమాణాలకు అనుగుణంగా లేటెస్ట్ ఇంజన్‌ అందించాలని భారత ప్రభుత్వం ఇది వరకే ప్రకటించింది. ఈ నేపథ్యంలో టాటా మోటార్స్ తమ అన్ని ప్యాసింజర్ కార్లలో బిఎస్6 అప్‌‌డేట్స్ చేస్తోంది. కస్టమర్లు ఇప్పుడు టాటా బెస్ట్ సెల్లింగ్ ప్యాసింజర్ కార్లు, టిగోర్, టియాగో మరియు నెక్సాన్ మోడళ్లను రూ. 11 వేలు చెల్లించి ముందస్తుగా బుక్ చేసుకుని, వీటి లాంచ్ అయిన తర్వాత డెలివరీ తీసుకోవచ్చు.

Most Read Articles

English summary
New Tata Tiago, Tigor & Nexon BS6 Bookings Open For Rs 11,000: Expected Prices And Other Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X