కొత్త 2021 టాటా సఫారీ విడుదల; ధరెంతో తెలిస్తే అవాక్కవుతారు..

టాటా మోటార్స్ నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సరికొత్త తరం టాటా సఫారీ ఎస్‌యూవీ ఎట్టకేలకు భారత మార్కెట్లో విడుదలైంది. దేశీయ విపణిలో టాటా మోటార్స్ ప్రోడక్ట్ లైనప్‌లో సఫారీ ఇప్పుడు ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా కొనసాగుతుంది. మార్కెట్లో దీని ధరలు రూ.14.69 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతాయి.

కొత్త 2021 టాటా సఫారీ విడుదల; ధరెంతో తెలిస్తే అవాక్కవుతారు..

టాటా మోటార్స్ అందిస్తున్న 5-సీటర్ హారియర్ ఎస్‌యూవీని ఆధారంగా చేసుకొని ఈ సరికొత్త టాటా సఫారీ ఎస్‌యూవీని అభివృద్ధి చేశారు. ఇది 6-సీటర్ మరియు 7-సీటర్ కాన్ఫిగరేషన్లలో లభ్యం కానుంది. ఈ ఎస్‌యూవీని XE, XM, XT, XT +, XZ మరియు XZ + అనే ఆరు వేరియంట్లలో ప్రవేశపెట్టారు.

కొత్త 2021 టాటా సఫారీ విడుదల; ధరెంతో తెలిస్తే అవాక్కవుతారు..

కొత్త టాటా సఫారీ ఆరు సీట్ల వేరియంట్‌ను టాప్-ఎండ్ ఎక్స్‌జెడ్ ప్లస్‌కు మాత్రమే పరిమితం చేశారు. మిగిలిన అన్ని వేరియంట్లు 7-సీటర్ ఆప్షన్‌తో లభిస్తాయి. ఏడు సీట్ల వెర్షన్‌లో మధ్య వరుసలో బెంచ్ సీట్‌ను అందిస్తున్నారు. ఆరు సీట్ల వెర్షన్‌లో మధ్య వరుసలో రెండు కెప్టెన్ సీట్లను అమర్చారు.

కొత్త 2021 టాటా సఫారీ విడుదల; ధరెంతో తెలిస్తే అవాక్కవుతారు..

కొత్త టాటా సఫారీ ఎస్‌యూవీ కోసం ఇప్పటికే అధికారికంగా బుకింగ్‌లు కూడా ప్రారంభమయ్యాయని, త్వరలో ఈ మోడల్ డెలివరీలను కూడా ప్రారంభిస్తామని కంపెనీ పేర్కొంది. ఈ మోడల్‌లో కంపెనీ ఓ కొత్త స్పెషల్ ఎడిషన్‌ను కూడా విడుదల చేసింది.

కొత్త 2021 టాటా సఫారీ విడుదల; ధరెంతో తెలిస్తే అవాక్కవుతారు..

టాప్-ఎండ్ సఫారీ ఎక్స్‌జెడ్ ప్లస్ వేరియంట్ ఆధారంగా తయారు చేసిన ‘అడ్వెంచర్ ఎడిషన్' సఫారీని కంపెనీ విడుదల చేసింది. ఈ స్పెషల్ టాటా సఫారీ అడ్వెంచర్ ఎడిషన్ ప్రత్యేకమైన ‘మిస్టిక్ బ్లూ' పెయింట్ స్కీమ్‌తో లభిస్తుంది, ఇందులో చాలా చోట్ల బ్లాక్-అవుట్ ఎలిమెంట్స్ ఉంటాయి.

Tata Safari Manual Price Automatic Price
XE ₹14.69 Lakh
XM ₹16.00 Lakh ₹17.25 Lakh
XT ₹17.45 Lakh
XT+ ₹18.25 Lakh
XZ ₹19.15 Lakh ₹20.40 Lakh
XZ+ (6/7 seater) ₹19.99 Lakh ₹21.25 Lakh
Adventure Persona
XZ+ (6/7 seater) ₹20.20 Lakh ₹21.45 Lakh

అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ)

కొత్త 2021 టాటా సఫారీ విడుదల; ధరెంతో తెలిస్తే అవాక్కవుతారు..

కొత్త 2021 టాటా సఫారీ ఎస్‌యూవీని టాటా మోటార్స్ యొక్క సరికొత్త ‘ఇంపాక్ట్ 2.0' డిజైన్ లాంగ్వేజ్‌ను ఆధారంగా చేసుకొని తయారు చేశారు. అదే సమయంలో ఇది ల్యాండ్ రోవర్ డ8 ప్లాట్‌ఫాం అయిన ఒమేగా ఆర్కిటెక్చర్ కూడా సపోర్ట్ చేస్తుంది.

కొత్త 2021 టాటా సఫారీ విడుదల; ధరెంతో తెలిస్తే అవాక్కవుతారు..

టాటా హారియర్ 5-సీటర్ ఎస్‌యూవీలో కనిపించే అనేక డిజైన్ మరియు స్టైలింగ్ అంశాలను ఈ కొత్త సఫారీలో కూడా గమనించవచ్చు. ముందు వైపు నుంచి చూస్తే ఫ్రంట్ గ్రిల్ మినహా ఈ రెండు మోడళ్లు (హారియర్ మరియు సఫారీలు) ఇంచు మించు ఒకేలా ఉంటాయి. సఫారీలో ఎక్కువ మార్పులు వెనుక భాగంలో కనిపిస్తాయి.

కొత్త 2021 టాటా సఫారీ విడుదల; ధరెంతో తెలిస్తే అవాక్కవుతారు..

సఫారీ వెనుక భాగంలో రీడిజైన్ చేయబడిన ఎల్‌ఈడీ టెయిల్ లైట్స్, మరింత నిటారుగా ఉండే టెయిల్‌గేట్ మరియు ఎల్‌ఈడీ స్టాప్ లాంప్‌తో కూడిన రియర్ రూఫ్ స్పాయిలర్ వంటి ఫీచర్లను ఇందులో గమనించవచ్చు. ఇక ఇతర మార్పులలో పొడవైన ఓవర్‌హాంగ్, స్టెప్డ్ రూఫ్, కొత్తగా డిజైన్‌తో కూడిన అల్లాయ్ వీల్స్ మరియు పెద్ద క్వార్టర్ ప్యానెల్ మొదలైనవి ఉన్నాయి.

కొత్త 2021 టాటా సఫారీ విడుదల; ధరెంతో తెలిస్తే అవాక్కవుతారు..

ఇక ఇంటీరియర్స్ విషయానికి వస్తే, హారియర్ మరియు సఫారీ ఓవరాల్ డాష్‌బోర్డ్ మరియు క్యాబిన్ లేఅవుట్ ఒకే విధంగా ఉంటుంది. ఇక్కడ హారియర్‌లో కనిపించే అనేక అంశాలు సఫారీలో కూడా కనిపిస్తాయి. ఇందులో సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్ మరియు ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేను సపోర్ట్ చేసే 8.8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మొదలైనవి ఉన్నాయి.

కొత్త 2021 టాటా సఫారీ విడుదల; ధరెంతో తెలిస్తే అవాక్కవుతారు..

కొత్త 2021 టాటా సఫారీ ఇప్పుడు బ్రాండ్ యొక్క లేటెస్ట్ ఐఆర్ఏ కనెక్ట్ టెక్నాలజీతో వస్తుంది. టాటా కార్ల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడిన మొబైల్ యాప్ సాయంతో యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించి కారుకి రిమోట్‌గా కనెక్ట్ అయ్యేందుకు ఇది సహకరిస్తుంది. ఇది వాయిస్ అసిస్టెన్స్‌తో పాటుగా మరిన్ని ఇతర ఫీచర్లను కూడా సపోర్ట్ చేస్తుంది.

కొత్త 2021 టాటా సఫారీ విడుదల; ధరెంతో తెలిస్తే అవాక్కవుతారు..

ఈ కారులోని ఇతర ప్రధాన మార్పులను గమనిస్తే, థర్డ్ రో సీటింగ్, పానరోమిక్ సన్‌రూఫ్, కొత్త బెనెక్ కాలికో ఓస్టెర్ వైట్ ప్రీమియం లెదర్ ఇంటీరియర్స్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, మూడవ వరుసలోని ప్రయాణీకుల కోసం ఏసి వెంట్స్, 9-స్పీకర్లతో కూడిన జెబిఎల్ ఆడియో సిస్టమ్ వంటి ఫీచర్లు ఉందులో ఉన్నాయి.

కొత్త 2021 టాటా సఫారీ విడుదల; ధరెంతో తెలిస్తే అవాక్కవుతారు..

ఇంజన్ విషయానికి వస్తే, కొత్త 2021 టాటా సఫారీలో అదే 2.0-లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 168 బిహెచ్‌పి పవర్‌ను మరియు 350 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది సిక్స్-స్పీడ్ మాన్యువల్ లేదా సిక్స్-స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.

కొత్త 2021 టాటా సఫారీ విడుదల; ధరెంతో తెలిస్తే అవాక్కవుతారు..

కొత్త 2021 టాటా సఫారీలో నిరుత్సాహపరచే విషయం ఏంటంటే, ఇందులో అన్ని వేరియంట్లు కూడా కేవలం 2-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో మాత్రమే లభిస్తాయి. ఈ కారులో 4-వీల్ డ్రైవ్ వెర్షన్‌ను ఆప్షనల్‌గా కూడా ఆఫర్ చేయటం లేదు.

కొత్త 2021 టాటా సఫారీ విడుదల; ధరెంతో తెలిస్తే అవాక్కవుతారు..

టాటా సఫారీ రాయల్ బ్లూ, ఓర్కస్ వైట్ మరియు డేటోనా గ్రే అనే మూడు కలర్ ఆప్షన్లలో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ కొత్త తరం 2021 మోడల్ టాటా సఫారీని ఇటీవలే మా డ్రైవ్‌స్పార్క్ బృందం టెస్ట్ డ్రైవ్ చేసింది. - ఈ కారుకి సంబంధించిన పూర్తి రివ్యూ కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

కొత్త 2021 టాటా సఫారీ విడుదల; ధరెంతో తెలిస్తే అవాక్కవుతారు..

ప్రజలు మర్చిపోతున్న పాపులర్ సఫారీ బ్రాండ్‌ను తిరిగి గుర్తుకు తెచ్చేందుకు కంపెనీ తమ కొత్త మోడల్‌కి ఈ పేరును పెట్టింది. కొత్త 2021 టాటా సఫారీ ఈ విభాగంలో ఎమ్‌జి హెక్టర్ ప్లస్ మరియు రాబోయే 2021 మహీంద్రా ఎక్స్‌యూవీ500 వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Most Read Articles

English summary
New 2021 Tata Safari SUV Launched In India; Prices, Specs And Features. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X