మే 2021లో బెస్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఏదో తెలుసా..?

భారత ప్యాసింజర్ కార్ మార్కెట్లో అత్యంత పోటీతో కూడుకున్న విభాగాల్లో కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగం వంటి. కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో కూడా ఈ విభాగంలో గత నెలలో అమ్మకాలు పోటాపోటీగా జరిగాయి. మే 2021లో కియా సొనెట్ మొదటి స్థానంలోకి రాగా, మారుతి విటారా బ్రెజ్జా నాలుగో స్థానానికి పడిపోయింది.

మే 2021లో బెస్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఏదో తెలుసా..?

ఆ తరువాతి స్థానాల్లో టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ మరియు రెనో కైగర్ మోడళ్లు ఉన్నాయి. ఓవరాల్‌గా చూసుకుంటే, గత నెలలో కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో అమ్మకాలు 55 శాతం క్షీణించాయి. మే 2021లో కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో మోడల్ వారీగా అమ్మకాల వివరాలు ఇలా ఉన్నాయి:

మే 2021లో బెస్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఏదో తెలుసా..?

గత నెలలో కియా సోనెట్ అమ్మకాలు 6,627 యూనిట్లుగా నమోదయ్యాయి. ఏప్రిల్ 2021లో ఈ మోడల్ అమ్మకాలు 7,724 యూనిట్లుగా ఉన్నాయి. అంతకు ముందు నెల అమ్మకాలతో పోల్చుకుంటే, మే 2021 నెల అమ్మకాలు 14 శాతం తగ్గాయి. కియా సోనెట్ మార్కెట్లోకి వచ్చి దాదాపు ఒక సంవత్సరం పూర్తవుతోంది. ఈ మోడల్ అమ్మకాలు తిరిగి జోరందుకుంటున్నాయి.

MOST READ:రాజకీయ నాయకుని చర్యపై చిర్రెత్తిన పోలీసులు.. ఏం చేశారో చూసారా..!

మే 2021లో బెస్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఏదో తెలుసా..?

ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉన్నది టాటా నెక్సాన్. గ్లోబల్ ఎన్‌సిపి క్రాష్ టెస్టులో అత్యధిక సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకున్న ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ గడచిన మే నెలలో 6,439 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఏప్రిల్ 2021 నెలలో విక్రయించిన 6,938 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే, గత నెల అమ్మకాలు 7 శాతం తగ్గాయి. ఈ మోడల్ మొదటిసారి విటారా బ్రెజ్జా మరియు వెన్యూ అమ్మకాలను అధిగమించింది.

మే 2021లో బెస్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఏదో తెలుసా..?

హ్యుందాయ్ మోటార్ ఇండియా అందిస్తున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ వెన్యూ ఈ జాబితాలో మూడవ స్థానంలో ఉంది. గత మే నెలలో ఈ మోడల్ అమ్మకాలు 4,840 యూనిట్లుగా ఉన్నాయి. ఏప్రిల్ 2021 నెలలో విక్రయించిన 11,245 యూనిట్లతో పోలిస్తే గత నెల అమ్మకాలు 57 శాతం క్షీణించాయి. కరోనా లాక్‌డౌన్ కారణంగా హ్యుందాయ్ వెన్యూ ఉత్పత్తి ప్రభావితమైందని, ఇది అమ్మకాలను కూడా ప్రభావితం చేసిందని కంపెనీ చెబుతోంది.

MOST READ:ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే ఏం జరుగుతుందో తెలుసా.. వీడియో చూడండి

మే 2021లో బెస్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఏదో తెలుసా..?

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా విక్రయిస్తున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ విటారా బ్రెజ్జా, గత మే నెలలో 2,648 యూనిట్ల విక్రయాలతో నాలుగో స్థానంలో ఉంది. ఏప్రిల్ 2021 నెలలో ఈ మోడల్ అమ్మకాలు 11,220 యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ సమయంలో విటారా బ్రెజ్జా అమ్మకాల్లో 76 శాతం తగ్గుదల నమోదైంది.

మే 2021లో బెస్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఏదో తెలుసా..?

ఫ్రెంచ్ కార్ బ్రాండ్ రెనో గతేడాది భారత మార్కెట్లో విడుదల చేసిన కైగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ తొలిసారిగా టాప్ 5 స్థానాల్లోకి ప్రవేశించగలిగింది. అయితే, ఏప్రిల్ అమ్మకాలతో పోలిస్తే గడచిన మే నెలలో ఈ మోడల్ అమ్మకాలు 1,326 యూనిట్లుగా నమోదై 53 శాతం తగ్గుదలను నమోదు చేసింది.

MOST READ:సూపర్ కారుతో కబాబ్ తయారు చేసిన యువకుడు.. చివరకు ఏమైందంటే?

మే 2021లో బెస్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఏదో తెలుసా..?

రెనో కైగర్ తరువాతి స్థానంలో నిస్సాన్ మాగ్నైట్ ఉంది. గత మే నెలలో 1,200 యూనిట్ల నిస్సాన్ మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీలు అమ్ముడయ్యాయి. కాగా, ఏప్రిల్ 2021లో ఈ మోడల్ అమ్మకాలు 2,904 యూనిట్లుగా ఉన్నాయి. కరోనా కారణంగా, కంపెనీ తమ చెన్నై ప్లాంట్‌లో ఉత్పత్తిని నిలిపివేయడంతో ఈ మోడల్ అమ్మకాలు కూడా ప్రభావితమయ్యాయి. ఈ కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీకి వినియోగదారుల నుండి మంచి స్పందన లభిస్తోంది.

మే 2021లో బెస్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఏదో తెలుసా..?

అమెరికన్ ఆటో మేజర్ ఫోర్డ్ విక్రయిస్తున్న ఫోర్డ్ ఎకోస్పోర్ట్ గత నెలలో 503 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. ఏప్రిల్ 2021తోతో పోలిస్తే దీని అమ్మకాలు 87 శాతం క్షీణించాయి. గత నెలలో 373 యూనిట్ల టొయోటా అర్బన్ క్రూయిజర్ కాంపాక్ట్ ఎస్‌యూవీలు అమ్ముడు కాగా, 251 యూనిట్ల మహీంద్రా ఎక్స్‌యూవీ300 వాహనాలు అమ్ముడయ్యాయి.

MOST READ:ఔరా.. ఏమిటీ విచిత్రం.. 15 కేజీల స్కూటర్ తరలించడానికి 7,500 కేజీల ట్రక్కు

మే 2021లో బెస్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఏదో తెలుసా..?

ఇక ఈ జాబితాలో చివరి స్థానంలో హోండా డబ్ల్యుఆర్‌వి ఉంది. గత మే 2021 నెలలో ఈ మోడల్ అమ్మకాలు మొత్తం 192 యూనిట్లుగా ఉన్నాయి. ఏప్రిల్ 2021తో పోలిస్తే, గత మే నెలలో ఈ మోడల్ అమ్మకాలు 84 శాతం క్షీణించాయి. ఈ విభాగంలోని మొత్తం అమ్మకాలను పరిశీలిస్తే, గత మే నెలలో 24,399 యూనిట్లు అమ్ముడు కాగా, ఏప్రిల్ 2021లో 54,104 యూనిట్లుగా ఉన్నాయి.

Source: Autopunditz

Most Read Articles

English summary
Compact SUV Sales In May 2021: Kia Sonet, Tata Nexon, Hyundai Venue. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X