Just In
- 3 hrs ago
పూర్తి చార్జ్‌పై 350 కిలోమీటర్లు ప్రయాణించిన మహీంద్రా ఈ2ఓ ప్లస్!
- 6 hrs ago
విడుదలకు ముందే లీకైన స్కొడా కుషాక్ ఫొటోలు; జూన్ 2021లో లాంచ్!
- 7 hrs ago
ఆనంద్ మహీంద్రా నుండి థార్‌ను గిఫ్ట్‌గా పొందిన క్రికెటర్ శుబ్‌మన్ గిల్
- 8 hrs ago
కొత్త ఫోక్స్‌వ్యాగన్ పోలో ఫేస్‌లిఫ్ట్ వెల్లడి: ఫీచర్లు, స్పెసికేషన్లు మరియు వివరాలు
Don't Miss
- Movies
శంకర్ 'ఇండియన్ 2' రెమ్యునరేషన్ గొడవ.. ఇచ్చింది ఎంత? ఇవ్వాల్సింది ఎంత?
- News
మోదీ ఎన్నికల సభ రద్దు వట్టిదే -వర్చువల్ ప్లాన్ -బెంగాల్లో రోడ్ షోలు, బైక్ ర్యాలీల నిషేధించిన ఈసీ
- Sports
RCB vs RR: పడిక్కల్ మెరుపు సెంచరీ.. కోహ్లీ అర్ధ శతకం.. రాజస్థాన్‌పై బెంగళూరు ఘన విజయం!
- Finance
భారీగా తగ్గిన బంగారం ధరలు: పసిడి రూ.500 డౌన్, వెండి రూ.1000 పతనం
- Lifestyle
‘తనను వదిలేసి తప్పు చేశా.. అందం, ఆస్తి ఉందని ఆ ఇద్దరిరీ పడేశా... కానీ చివరికి...’
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ పొందటం ఇకపై అంత సులువు కాదు
ఇప్పటి వరకూ కొత్త డ్రైవింగ్ లైసెన్స్ పొందటం చాలా సులభంగా ఉండేది. అయితే, ఇకపై కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ పొందాలనుకువారు మాత్రం తప్పనిసరిగా కఠినమైన డ్రైవింగ్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు.

కొత్తగా ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే పరీక్షలో 69 శాతం ఉత్తీర్ణత పొందడం అవసరమని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం లోక్‌సభలో తెలియజేశారు. అన్ని ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో డ్రైవింగ్ లైసెన్స్ పొందటానికి అర్హత సాధించడంలో ఉత్తీర్ణత శాతాన్ని 69 శాతంగా నిర్ణయించామని ఆయన తెలిపారు.

రోడ్డు ప్రమాదాలను నివారించే లక్ష్యంలో భాగంగా, అనర్హులకు డ్రైవింగ్ లైసెన్స్ రాకుండా ఉండేలా చేసేందుకు గాను డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షను కఠినతరం చేయడానికి కొత్త చర్యలు, మార్గదర్శకాలను కేంద్రం నిర్దేశించింది. తాజా నియమ నిబంధనల గురించి ఇప్పటికే అన్ని ఆర్టీఓలకు కూడా సమాచారం అందించడం జరిగింది.
MOST READ:మానవత్వం చాటుకున్న మంచి పోలీస్ & బైక్ రైడర్.. వీడియో చూస్తే మీరు కూడా మెచ్చుకుంటారు

ఈ విషయం గురించి నితిన్ గడ్కరీ లోక్‌సభలో మాట్లాడుతూ, "రివర్స్ గేర్ ఉన్న వాహనం విషయంలో, వాహనాన్ని వెనుకకు నడపుతున్నప్పుడు దానిని కుడి వైపుకు లేదా ఎడమవైపుకు నియంత్రించడంలో సరైన ఖచ్చితత్వాన్ని పాటించడం అవసరం" అని, డ్రైవింగ్ నైపుణ్య పరీక్షలో అర్హత సాధించే పారామితులలో ఇది కూడా ఒకటని ఆయన చెప్పారు.

ఈ నిబంధన సెంట్రల్ మోటారు వాహనాల నిబంధనలు, 1989లో పేర్కొనబడి ఉందని కూడా ఆయన వివరించారు. "అన్ని ఆర్టీఓలలో ఉత్తీర్ణత శాతం 69 శాతంగా ఉంటుంది. డ్రైవింగ్ టెస్ట్ యొక్క ఉద్దేశ్యం అర్హత కలిగిన / ప్రతిభావంతులైన డ్రైవర్లను తయారు చేయడమే" అని గడ్కరీ అన్నారు. ఇందుకోసం ఢిల్లీలో 50 మోటారు డ్రైవింగ్ శిక్షణా పాఠశాలలను కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
MOST READ:గెలియోస్ హోప్ ఎలక్ట్రిక్ స్కూటర్; ధర తక్కువ, డ్రైవింగ్ లైసెన్స్ అవసరమే లేదు

డ్రైవింగ్ ట్రాక్‌లో లైవ్ డెమోతో పాటు, అసలు డ్రైవింగ్ టెస్ట్ నైపుణ్యం ప్రారంభమయ్యే ముందు అన్ని ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లలో ఎల్‌ఈడీ తెరపై డెమో చూపబడుతుంది అని నితిన్ గడ్కరీ చెప్పారు. డ్రైవింగ్ నైపుణ్య పరీక్షను బుక్ చేసే సమయంలో, దరఖాస్తుదారునికి డ్రైవింగ్ స్కిల్ టెస్ట్ డెమో యొక్క వీడియో లింక్ కూడా ఇవ్వబడుతుంది.

ఆధార్ అథెంటికేషన్ సహాయంతో డ్రైవింగ్ లైసెన్స్ మరియు రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన కొన్ని సేవలు పూర్తిగా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చాయి. డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ విషయానికి వస్తే, దాని గడువుకు ఒక సంవత్సరం ముందు లేదా ఒక సంవత్సరం తరువాత రెన్యువల్ చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన సేవలను కూడా ఆన్‌లైన్‌లో పొందవచ్చు.
MOST READ:తలకిందులుగా నడుస్తూ కారునే లాగేసిన యోగా గురువు.. ఎందుకో తెలుసా..!

కరోనా మహమ్మారి నేపథ్యంలో, దేశ పౌరులకు ఈ సేవలను ఇబ్బంది లేని రీతిలో అందించడానికి మరియు ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో రద్దీని తగ్గించడానికి మరియు ఆర్టీఓ అధికారుల సామర్థ్యాన్ని పెంచడానికి ఇది ఈ ఆన్‌లైన్ సేవలు సహకరిస్తాయని ఆయన అన్నారు. - ఆన్‌లైన్‌లో లభిస్తున్న 18 రకాల ఆర్టీఓ సేవల వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.