హ్యుందాయ్ క్రెటా, ఆడి ఆర్ఎస్ గ్రిల్‌తో.. అదుర్స్

భారతదేశంలో ప్రసిద్ధి చెందిన వాహన తయారీదారులలో ఒకటి హ్యుందాయ్. ఈ ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ ఇండియా తన కొత్త క్రెటా ఎస్‌యూవీని గత ఏడాది దేశీయ మార్కెట్లో విడుదల చేసిన విషయం అందరికి తెలిసిందే. ఈ క్రెటా ఎస్‌యూవీ దేశీయ మార్కెట్లో అడుగుపెట్టినప్పటినుంచి ఈ విభాగంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఎస్‌యూవీలలో ఒకటిగా గుర్తింపు పొందింది.

హ్యుందాయ్ క్రెటా, ఆడి ఆర్ఎస్ గ్రిల్‌తో... అదుర్స్

కొత్త హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీ మంచి ప్రీమియం లుక్ మరియు అనేక అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్‌యూవీగా నిలిచింది. దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన కొన్ని వారాల తరువాత, ఈ ఎస్‌యూవీ యొక్క యాక్ససరీస్ మార్కెట్లోకి రావడం ప్రారంభించాయి.

హ్యుందాయ్ క్రెటా, ఆడి ఆర్ఎస్ గ్రిల్‌తో... అదుర్స్

ఈ ఎస్‌యూవీ చూడటానికి మంచి డిజైన్ కలిగి ఉన్నప్పటికీ, వాహనప్రియులు తమకు నచ్చిన వాహనాలను కస్టమైజ్ చేసుకుంటారు. మనం ఇది వరకే చాలా కథనాలలో కస్టమైజ్ వాహనాల గురించి విన్నాం. ఈ వర్గంలోనే కస్టమైజ్ క్రెటా ఎస్‌యూవీలు కూడా ఉన్నాయి.

MOST READ:ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వే కాంట్రాక్టర్లపై అసంతృప్తి వ్యక్తం చేసిన గడ్కరీ.. ఎందుకంటే?

హ్యుందాయ్ క్రెటా, ఆడి ఆర్ఎస్ గ్రిల్‌తో... అదుర్స్

నివేదికల ప్రకారం హ్యుందాయ్ క్రెటా కస్టమైజ్ చేయబడింది. ఈ కారణంగా ఈ ఎస్‌యూవీ బంపర్ దిగువన గ్లాస్ బ్లాక్ స్ప్లిటర్ జతచేయబడింది. అంతే కాకుండా క్రెటా యొక్క బంపర్‌పై ఎల్‌ఈడీ రిఫ్లెక్టర్ లైట్లు ఏర్పాటు చేయబడతాయి.

హ్యుందాయ్ క్రెటా, ఆడి ఆర్ఎస్ గ్రిల్‌తో... అదుర్స్

ఈ కస్టమైజ్ క్రెటా ఎస్‌యూవీలో గమనించదగ్గ ప్రధాన మార్పు ఫ్రంట్ గ్రిల్‌ను మార్చడం. ఈ ఎస్‌యూవీలోని గ్రిల్‌ను తొలగించి ఆడి ఆర్‌ఎస్ కారులో ఉన్నటువంటి గ్రిల్‌తో అమర్చారు. ఈ కొత్త ఆడి ఆర్ఎస్ కారు యొక్క గ్రిల్ దీనికి చేర్చడం వల్ల ఇది మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

MOST READ:సెకండ్ హ్యాండ్ కార్ అమ్మకాలు పైపైకి.. 2025 కల్లా 90% వృద్ధి

హ్యుందాయ్ క్రెటా, ఆడి ఆర్ఎస్ గ్రిల్‌తో... అదుర్స్

ఆడి ఆర్ఎస్ యొక్క గ్రిల్ కారు ముందు భాగంలో సరిపోయే విధంగా అమర్చబడింది. ఈ గ్రిల్ యొక్క లోపలి భాగంలో హానీ కూంబ్ డిజైన్ తో నిగనిగలాడే బ్లాక్ ఫినిషింగ్ ఉంటుంది. ఆర్ఎస్ గ్రిల్ క్రెటా ఎస్‌యూవీకి స్పోర్టి లుక్ కాకుండా ప్రీమియం లుక్ ఇస్తోంది.

హ్యుందాయ్ క్రెటా, ఆడి ఆర్ఎస్ గ్రిల్‌తో... అదుర్స్

ఈ గ్రిల్ చైనా మార్కెట్ నుంచి దిగుమతి చేసుకోవడం గమనార్హం. గ్రిల్ ధర సుమారు 6,000 రూపాయల వరకు ఉంటుంది. హ్యుందాయ్ కంపెనీ తన క్రెటా ఎస్‌యూవీలో అనేక కొత్త ఫీచర్లను అందిస్తుంది. ఇందులో వెంటెడ్ సీట్, ఇంటిగ్రేటెడ్ ఎయిర్ ప్యూరిఫైయర్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటివి ఉన్నాయి.

MOST READ:మతిపోగొడుతున్న కస్టమైజ్డ్ ఫోర్డ్ ఎండీవర్; వివరాలు

హ్యుందాయ్ క్రెటా, ఆడి ఆర్ఎస్ గ్రిల్‌తో... అదుర్స్

ఇవి మాత్రమే కాకుండా వీటితో పాటు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో హై-ఎండ్ మోడల్స్, మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, క్రూయిజ్ కంట్రోల్ కూడా ఉన్నాయి. ఇందులో మంచి సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉన్నాయి. కావున వాహనదారునికి మంచి భద్రతను కల్పిస్తుంది.

Source: Mindautomods/Instagram

Most Read Articles

English summary
Hyundai Creta Modified With Audi Style RS Front Grille Look More Premium Details. Read in Telugu.
Story first published: Monday, April 26, 2021, 9:54 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X