దుమ్మురేపుతున్న కొత్త టాటా సఫారీ రివ్యూ వీడియో.. మీరు చూసారా..!
టాటా మోటార్స్ ఇటీవల తమ సరికొత్త సఫారి ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేసింది. 'సఫారి' భారత మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన ఎస్‌యూవీలలో ఒకటి. టాటా సఫారీ కేవలం ఇప్పుడు పుట్టుకొచ్చింది మాత్రం కాదు, ఇది 1998 నాటిది. దాదాపు కొన్ని సంవత్సరాలుగా, టాటా సఫారీ చాలా అప్డేట్స్ పొందింది. అయితే ఇది 2019 లో నిలిపివేయబడింది.
ఇప్పుడు, టాటా మోటార్స్ తమ కొత్త ఫ్లాగ్‌షిప్ ఏడు సీట్ల ఎస్‌యూవీ ఆఫర్ రూపంలో, ఐకానిక్ 'సఫారి' నేమ్‌ప్లేట్‌ను భారతీయ మార్కెట్లోకి తీసుకురావడానికి కంపెనీ సిద్ధంగా ఉంది. కొత్త సఫారి మంచి పెర్ఫామెన్స్ మరియు దృఢమైన నిర్మాణం కలిగి ఉంది. టాటా సఫారీ గురించి పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చూడండి.
2021 టాటా సఫారి బ్రాండ్ యొక్క సరికొత్త 'ఇంపాక్ట్ 2.0' డిజైన్ కలిగి ఉంది. అంతే కాకుండా ల్యాండ్ రోవర్ యొక్క ప్రఖ్యాత డి 8 ప్లాట్‌ఫామ్ నుండి తీసుకోబడిన వారి ఒమేగా ఆర్కిటెక్చర్‌తో మిళితం చేస్తుంది. కొత్త టాటా సఫారి బ్రాండ్ యొక్క ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోలో దాని 5 సీట్ల హారియర్ ఎస్‌యూవీపైన ఉంచబడుతుంది. కొత్త టాటా సఫారీ లాంచ్ దేశీయ మార్కెట్లో 2021 ఫిబ్రవరి నెలలో ఎప్పుడైనా జరిగే అవకాశం ఉంది.
టాటా సఫారీ భారత మార్కెట్లో ప్రారంభించటానికి ముందు, టాటా సఫారీ దాని వారసత్వానికి అనుగుణంగా ఉందో, లేదో తెలుసుకోవడానికి మేము సరికొత్త 7 సీట్స్ ఎస్‌యూవీని డ్రైవ్ చేసాము. మేము కొత్త టాటా సఫారి గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Click it and Unblock the Notifications








