అడ్డు అదుపు లేకుండా దూసుకెళ్తున్న 'మారుతి గ్రాండ్ విటారా': బుకింగ్స్‌కి బ్రేకుల్లేవ్..

మారుతి సుజుకి (Maruti Suzuki) దేశీయ మార్కెట్లో తన 'గ్రాండ్ విటారా' కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారభించినప్పటినుంచి మంచి బుకింగ్స్ పొందొతోంది, కంపెనీ ఈ SUV కోసం ఇప్పటికే రికార్డ్ స్థాయిలో బుకింగ్స్ పొందింది.

కంపెనీ బుకింగ్స్ ప్రారంభించిన రోజు (జూలై 11, 2022) నుంచి ఇప్పటి వరకు 75,000 కంటే ఎక్కువ బుకింగ్స్ పొందగలిగింది. తక్కువ కాలంలోనే గ్రాండ్ విటారా రికార్డ్ స్థాయిలో బుకింగ్స్ మరియు విక్రయాలను పొందుతోంది.

బుకింగ్స్‌కి బ్రేకుల్లేకుండా దూసుకెళ్తున్న గ్రాండ్ విటారా..

మారుతి గ్రాండ్ విటారా దేశీయ మార్కెట్లో రూ. 10.45 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధర వద్ద విడుదలైంది. కంపెనీ ఈ SUV కోసం బుకింగ్స్ లాంచ్ చేయడానికి ముందునుంచి స్వీకరించడం ప్రారంభించింది. అయితే ఈ SUV మార్కెట్లో లాంచ్ అయ్యే సమయానికి 50,000 కంటే ఎక్కువ బుకింగ్స్ పొందగలిగింది. దీన్ని బట్టి చూస్తే కంపెనీ యొక్క ఈ కొత్త మోడల్ కి మార్కెట్లో ఎంత ఆదరణ ఉందొ అర్థమవుతోంది.

మారుతి సుజుకి ఈ SUV యొక్క డెలివరీలను కూడా ప్రారంభించింది. డెలివరీలో భాగంగా మొదటి సారి కంపెనీ 4,800 యూనిట్లను డెలివరీ చేసింది. కాగా రెండవ సారి డెలివరీలో భాగంగా 8,052 యూనిట్లకు డెలివరీలను చేసింది. కాగా రానున్న రోజుల్లో ఈ డెలివరీల సంఖ్య తప్పకుండా పెరిగే అవకాశం ఉంది. మారుతి గ్రాండ్ విటారా టాప్ మోడల్ ధర రూ. 19.65 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

కొత్త మారుతి సుజుకి గ్రాండ్ విటారా మంచి డిజైన్ & అద్భుతమైన ఫీచర్స్ పొందుతుంది. ఈ SUV యొక్క ముందుభాగంలో క్రోమ్-లైన్డ్ హెక్సా గోనల్ గ్రిల్, త్రీ పాయింట్ ఎల్ఈడీ డిఆర్ఎల్, హెడ్‌ల్యాంప్ క్లస్టర్, సైడ్ బాడీ ప్యానెల్‌లు, టెయిల్‌గేట్ మరియు ఇంటిగ్రేటెడ్ టెయిల్-ల్యాంప్‌ వంటివి వాటితోపాటు టెయిల్‌గేట్‌పై ఎల్ఈడీ లైట్ బార్ మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. మొత్తం మీద డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

ఇంటీరియర్ ఫీచర్స్ విషయానికి వస్తే, గ్రాండ్ విటారా 9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ పొందుతుంది. ఇది వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్‌ప్లేకి సపోర్ట్‌ చేస్తుంది. పనోరమిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ ఛార్జర్, యాంబియంట్ లైటింగ్, కనెక్టెడ్ కార్ టెక్ వంటివి టాప్-స్పెక్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటాయి. కావున ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

గ్రాండ్ విటారా మొత్తం 9 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. ఇందులో ఆరు మోనోటోన్ కలర్స్ కాగా, మిగిలిన మూడు డ్యూయల్ టోన్‌ కలర్స్. మోనోటోన్ కలర్స్ లో నెక్సా బ్లూ, ఆర్కిటిక్ వైట్, స్ప్లెండిడ్ సిల్వర్, గ్రాండ్యుర్ గ్రే, చెస్ట్‌నట్ బ్రౌన్ మరియు ఓపులెంట్ రెడ్ కలర్స్ ఉన్నాయి. డ్యూయెల్ టోన్ కలర్స్ లో ఆర్కిటిక్ వైట్ విత్ బ్లాక్, స్ప్లెండిడ్ సిల్వర్ విత్ బ్లాక్ మరియు ఓపులెంట్ రెడ్ విత్ బ్లాక్ కలర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

ఇంజిన్ విషయానికి వస్తే, 2022 గ్రాండ్ విటారా 1.5 లీటర్, 4 సిలిండర్ K15C స్మార్ట్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.5 లీటర్, 3 సిలిండర్ల అట్కిన్సన్ సైకిల్ TNGA పెట్రోల్ ఇంజన్ అనే రెండు ఇంజిన్ ఆప్సన్స్ పొందుతుంది. ఇందులోని మొదటి ఇంజిన్ 103 హెచ్‌పి పవర్ మరియు 136 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది.

రెండవ ఇంజిన్ అయిన 1.5 లీటర్, 3 సిలిండర్ల అట్కిన్సన్ సైకిల్ TNGA పెట్రోల్ ఇంజన్ విషయానికి వస్తే, ఇది 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 92 హెచ్‌పి పవర్ మరియు 4,400 ఆర్‌పిఎమ్ వద్ద 122 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది AC సింక్రోనస్ మోటార్‌తో కలిపి 79 హెచ్‌పి పవర్ మరియు 141 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. మొత్తమ్ మీదుగా ఇది 115 హెచ్‌పి పవర్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ CVT తో జతచేయబడి ఉంటుంది.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

మారుతి సుజుకి భారతీయ మార్కెట్లో కొత్త 'గ్రాండ్ విటారా' ను విడుదల చేయడానికంటే ముందు నుంచి మంచి సంఖ్యలో బుకింగ్స్ పొందగలుగుతోంది, అయితే దేశీయ మార్కెట్లో విడుదలైన అతి తక్కువ కాలంలోనే 75,000 కంటే ఎక్కువ బుకింగ్స్ పొంది రికార్డ్ సృష్టించింది. అయితే ఈ బుకింగ్స్ రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని ఆశిస్తున్నాము.

Most Read Articles

English summary
Maruti suzuki grand vitara suv receives 75000 bookings
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X