టాటా నెక్సాన్ ఎస్‌యూవీలో కొత్త వేరియంట్ విడుదల.. ధర రూ. 9.75 లక్షలు మాత్రమే!

ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ (Tata Motors) భారత మార్కెట్లో విక్రయిస్తున్న తమ పాపులర్ సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ నెక్సాన్ (Nexon) లో ఓ కొత్త వేరియంట్ ను విడుదల చేసింది. టాటా నెక్సాన్ ఎక్స్ఎమ్ ప్లస్ ఎస్ (Tata Nexon XM+ S) పేరుతో కంపెనీ ఈ కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది మరియు మార్కెట్లో దీని రూ. 9.75 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతుంది. కొత్త టాటా నెక్సాన్ ఎక్స్ఎమ్ ప్లస్ ఎస్ వేరియంట్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో పాటుగా మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది.

టాటా నెక్సాన్ ఎస్‌యూవీలో కొత్త వేరియంట్ విడుదల.. ధర రూ. 9.75 లక్షలు మాత్రమే!

టాటా నెక్సాన్ ఎక్స్ఎమ్ ప్లస్ ఎస్ వేరియంట్ ఫీచర్లు

ఫీచర్ల విషయానికి వస్తే, టాటా నెక్సాన్ లైనప్ లో కొత్తగా విడుదల చేయబడిన ఎక్స్ఎమ్ ప్లస్ ఎస్ వేరియంట్ లో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లేతో కూడిన 7 ఇంచ్ ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 4-స్పీకర్లతో కూడిన ఆడియో సిస్టమ్, కూల్డ్ గ్లోవ్ బాక్స్, వెనుక ప్రయాణీకుల కోసం ఏసి వెంట్స్, రెయిన్-సెన్సింగ్ వైపర్‌లు, ఆటో హెడ్‌ల్యాంప్‌లు, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మల్టీ డ్రైవ్ మోడ్, 12V రియర్ పవర్ సాకెట్ మరియు షార్క్ ఫిన్ యాంటెన్నా మొదలైనవి లభిస్తాయి.

టాటా నెక్సాన్ ఎస్‌యూవీలో కొత్త వేరియంట్ విడుదల.. ధర రూ. 9.75 లక్షలు మాత్రమే!

టాటా నెక్సాన్ లైనప్ లో ధరల గ్యాప్ ను భర్తీ చేసేందుకు కంపెనీ ఈ కొత్త వేరియంట్‌ ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం, మార్కెట్లో టాటా నెక్సాన్ ధరలు రూ. 7.55 లక్షల నుండి రూ. 13.95 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి. టాటా నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజన్‌ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఈ రెండు ఇంజన్లు వరుసగా 120 బిహెచ్‌పి మరియు 110 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తాయి మరియు ఇవి రెండూ 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్లతో లభిస్తుంది.

టాటా నెక్సాన్ ఎస్‌యూవీలో కొత్త వేరియంట్ విడుదల.. ధర రూ. 9.75 లక్షలు మాత్రమే!

అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీగా టాటా నెక్సాన్

టాటా నెక్సాన్ అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే, ఇది టాటా మోటార్స్ నుండి అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. అంతేకాకుండా, టాటా నెక్సాన్ దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న నాల్గవ కాంపాక్ట్ ఎస్‌యూవీగా ఉంది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఇప్పటి వరకూ 3.50 లక్షలకు పైగా టాటా నెక్సాన్ కార్లు భారత రోడ్లపై తిరుగుతున్నాయి. టాటా నెక్సాన్ అమ్మకాల పరంగా నిస్సాన్ మాగ్నైట్, రెనో కైగర్ మరియు మహీంద్రా ఎక్స్‌యూవీ300 వంటి కాంపాక్ట్ ఎస్‌యూవీలను అధిగమించింది.

టాటా నెక్సాన్ ఎస్‌యూవీలో కొత్త వేరియంట్ విడుదల.. ధర రూ. 9.75 లక్షలు మాత్రమే!

ఫీచర్ రిచ్ ఎస్‌యూవీ - టాటా నెక్సాన్

టాటా నెక్సాన్ ఎస్‌యూవీ ఫుల్లీ లోడెడ్ ఫీచర్లతో అందుబాటులో ఉంటుంది. ఈ కారులో అనేక గొప్ప ఫీచర్లు ఉన్నాయి. ఇందులోని స్టాండర్డ్ ఫీచర్లను గమనిస్తే, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోను సపోర్ట్ చేసే పెద్ద 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, ఎల్‌సిడి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, పవర్ అడ్జస్టబుల్ సైడ్ మిర్రర్స్, కార్నరింగ్ ఫాగ్ ల్యాంప్స్ మరియు ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ మొదలైనవి ఉన్నాయి.

టాటా నెక్సాన్ ఎస్‌యూవీలో కొత్త వేరియంట్ విడుదల.. ధర రూ. 9.75 లక్షలు మాత్రమే!

అయితే, కస్టమర్లు కోరుకునే సన్‌రూఫ్ మరియు హెడ్స్-అప్ డిస్‌ప్లే వంటి ఫీచర్లు టాటా నెక్సాన్ యొక్క ఏ వేరియంట్‌లోనూ అందుబాటులో లేవు. ఫీచర్ల విషయానికొస్తే, ఇది ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన కొత్త 2022 మారుతి సుజుకి బ్రెజ్జా కంటే ఒక అడుగు ముందుంది మరియు అనేక అధునాతన ఫీచర్లను అందిస్తోంది.

టాటా నెక్సాన్ ఎస్‌యూవీలో కొత్త వేరియంట్ విడుదల.. ధర రూ. 9.75 లక్షలు మాత్రమే!

టాటా నెక్సాన్ ఎస్‌యూవీ సేఫ్టీ పరంగా కూడా చాలా సురక్షితమైన ఎస్‌యూవీ. ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్ పార్కింగ్ సెన్సార్లు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD) మరియు ISOFIX చైల్డ్ సీట్ యాంకర్‌లు మొదలైన సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా, టాటా నెక్సాన్ గ్లోబల్ ఎన్‌సిఏపి క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్‌ను దక్కించుకుని, దేశంలోనే అత్యంత సురక్షితమైన ఎస్‌యూవీగా నిలిచింది. టాటా నెక్సాన్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో పాటుగా పూర్తిగా ఎలక్ట్రిక్ రూపంలో కూడా లభిస్తుంది.

టాటా నెక్సాన్ ఎస్‌యూవీలో కొత్త వేరియంట్ విడుదల.. ధర రూ. 9.75 లక్షలు మాత్రమే!

రూ.60 వేల వరకూ పెరిగిన టాటా నెక్సాన్ ఈవీ ధరలు

ఇదిలా ఉంటే, టాటా మోటార్స్ విక్రయిస్తున్న నెక్సాన్ ఈవీ ఎలక్ట్రిక్ కారు ధరలను కంపెనీ మరోసారి భారీగా పెంచింది. కస్టమర్ ఎంచుకునే వేరియంట్ ను బట్టి ఈ మోడల్ ధరలు కనిష్టంగా రూ.20,000 నుండి గరిష్టంగా రూ.60,000 వరకూ ధరలు పెరిగాయి. ధరలు పెంచడానికి ముందు బేస్ (ఎక్స్ఎమ్) వేరియంట్ ధర రూ.14.54 లక్షలుగా ఉంటే, ధరల పెంపు అనంతరం ఇది రూ.14.99 లక్షలకు చేరుకుంది. అలాగే, ఇందులో టాప్-ఎండ్ వేరియంట్ అయిన టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ఎక్స్‌జెడ్ ప్లస్ లగ్జరీ 7.2 కిలోవాట్ వేరియంట్ ధర రూ.19.24 లక్షల నుండి రూ.19.84 లక్షలకు చేరుకుంది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్). - కొత్త ధరల వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Tata motors launches nexon xm plus s variant price specs and features
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X