గత వారం దేశీయ మార్కెట్లో విడుదలైన లేటెస్ట్ కార్లు: ఆడి నుంచి హైరైడర్ వరకు..

దేశీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆధునిక వాహనాలు విడుదలవుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే గత వారం కూడా కొత్త కార్లు విడుదలయ్యాయి. ఇందులో ఆడి క్యూ7 యొక్క లిమిటెడ్ ఎడిషన్, టొయోట కంపెనీ యొక్క హైరైడర్, 'సిట్రోయెన్ యొక్క సి5 ఎయిర్‌క్రాస్ ఫేస్‌లిఫ్ట్‌ మరియి ఫోక్స్‌వ్యాగన్ టైగన్ యొక్క ఫస్ట్ యానివెర్సరీ ఎడిషన్ మాత్రమే కాకూండా మహీంద్రా కంపెనీ యొక్క XUV400 ఎలక్ట్రిక్ కారు కూడా ఆవిష్కరించబడింది.

Recommended Video

భారత్‌లో విడుదలైన 2022 Audi A8 L: ధర & వివరాలు

మనం ఈ కథనంలో గత వారం దేశీయ మార్కెట్లో అరంగేట్రం చేసిన కొత్త కార్లను గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.

గత వారం దేశీయ మార్కెట్లో విడుదలైన లేటెస్ట్ కార్లు.. వాటి వివరాలు

టొయోట హైరైడర్ (Toyota Hyryder):

టొయోట కంపెనీ యొక్క ఆధునిక మిడ్-సైజ్ ఎస్‌యువి 'అర్బన్ క్రూయిజర్ హైరైడర్' (Urban Cruiser Hyryder) చాలా రోజులకు ముందే భారతీయ మార్కెట్లో ఆవిష్కరించబడింది. అయితే ధరల మాత్రం కంపెనీ ఈ మధ్య కాలంలో అధికారికంగా వెల్లడించింది. ఇందులో కూడా కంపెనీ కేవలం నాలుగు వేరియంట్స్ ధరలను మాత్రమే కంపెనీ వెల్లడించింది. అయితే రానున్న రోజల్లో మరిన్ని వేరియంట్స్ ధరల వెల్లడించనుంది.

గత వారం దేశీయ మార్కెట్లో విడుదలైన లేటెస్ట్ కార్లు.. వాటి వివరాలు

కంపెనీ ఇప్పటికే తన కొత్త టొయోట హైరైడర్ కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారభించింది. కావున ఈ SUV కొనాలనుకునే కస్టమర్లు రూ. 25,000 చెల్లింది టయోటా డీలర్‌షిప్‌లలో లేదా అధికారిక వెబ్ సైట్ లో బుక్ చేసుకోవచ్చు. భారతీయ మార్కెట్లో ఈ SUV మొత్తం 11 కలర్ ఆప్సన్స్ లో విడుదలైంది. ఇందులో 7 మోనోటోన్ కలర్స్ కాగా, మిగిలిన నాలుగు డ్యూయెల్ టోన్ కలర్స్. టొయోట హైరైడర్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

గత వారం దేశీయ మార్కెట్లో విడుదలైన లేటెస్ట్ కార్లు.. వాటి వివరాలు

హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్ (Hyundai Venue N Line):

హ్యుందాయ్ కంపెనీ యొక్క కొత్త వెన్యూ ఎన్ లైన్ న గత వారం ప్రారంభంలో విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ ప్రారంభ ధర రూ. 12.16 లక్షలు. కంపెనీ ఇప్పటికే ఈ అప్డేటెడ్ SUV కోసం బుకింగ్స్ కూడా స్వీకరించడం ప్రారంభించింది. కావున ఆసక్తిగల కష్టమర్లు రూ. 21,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

గత వారం దేశీయ మార్కెట్లో విడుదలైన లేటెస్ట్ కార్లు.. వాటి వివరాలు

కొత్త హ్యుందాయ్ N లైన్ మొత్తం 5 కలర్ ఆప్సన్స్ తో అందుబాటులో ఉంటుంది. ఇందులో మూడు డ్యూయల్ టోన్ కలర్స్ కాగా, మరో రెండు మోనోటోన్ కలర్స్. ఇది 1.0 లీటర్ జిడిఐ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ పొందుతుంది. ఇది 118 బిహెచ్‌పి పవర్ మరియు 172 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ లింకుపై క్లిక్ చేయండి.

గత వారం దేశీయ మార్కెట్లో విడుదలైన లేటెస్ట్ కార్లు.. వాటి వివరాలు

సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఫేస్‌లిఫ్ట్‌ (Citroen C5 Aircross Facelift):

ప్రముఖ ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ 'సిట్రోయెన్' (Citroen) భారతీయ మార్కెట్లో గతః వారంలో తన కొత్త 'సి5 ఎయిర్‌క్రాస్ ఫేస్‌లిఫ్ట్‌' (C5 Aircross Facelift) విడుదల చేసింది. ఈ కొత్త ఫేస్‌లిఫ్ట్‌ ధర రూ. 36.67 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఇది ప్రస్తుతం కేవలం ఒకే వేరియంట్ లో అందుబాటులో ఉంది.

గత వారం దేశీయ మార్కెట్లో విడుదలైన లేటెస్ట్ కార్లు.. వాటి వివరాలు

కొత్త C5 ఎయిర్‌క్రాస్ మొత్తం నాలుగు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి పెర్ల్ వైట్, పెర్ల్ నెరా బ్లాక్, క్యుములస్ గ్రే మరియు ఎక్లిప్స్ బ్లూ. ఇందులో ఎక్లిప్స్ బ్లూ అనేది కొత్త కలర్ అప్సన్. కంపెనీ విడుదల చేసిన కొత్త సి5 ఫేస్‌లిఫ్ట్‌ ఆకర్షణీయమైన డిజైన్ కలిగి అప్డేటెడ్ ఫీచర్స్ కూడా పొందుతుంది. సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఫేస్‌లిఫ్ట్‌ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ లింకుపై క్లిక్ చేయండి.

గత వారం దేశీయ మార్కెట్లో విడుదలైన లేటెస్ట్ కార్లు.. వాటి వివరాలు

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఫస్ట్ యానివెర్సరీ ఎడిషన్ (Volkswagen Taigun First Anniversary Edition):

ఇప్పటికే భారతీయ మార్కెట్లో మంచి అమ్మకాలతో అద్భుతమైన ప్రజాదరణ పొందుతున్న ఫోక్స్‌వ్యాగన్ యొక్క టైగన్ ఇప్పుడు యానివెర్సరీ ఎడిషన్ లో కూడా అందుబాటులో ఉంది. ఈ కొత్త కారు ప్రారంభ ధర రూ. 15.40 లక్షలు. కంపెనీ యొక్క స్పెషల్ ఎడిషన్ మోడల్ ను 1.0 లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్‌తో మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లలో అందిస్తోంది. ఇది డైనమిక్ లైన్ మరియు టాప్‌లైన్ వేరియంట్‌లలో అందించబడుతుంది. టైగన్ ఫస్ట్ యానివెర్సరీ ఎడిషన్ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ లింకుపై క్లిక్ చేయండి.

గత వారం దేశీయ మార్కెట్లో విడుదలైన లేటెస్ట్ కార్లు.. వాటి వివరాలు

ఆడి క్యూ7 లిమిటెడ్ ఎడిషన్‌ (Audi Q7 Limited Edition):

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ అయిన 'ఆడి' (Audi) భారతీయ మార్కెట్లో గత వారం చివరలో తన కొత్త 'క్యూ7 లిమిటెడ్ ఎడిషన్‌' ను రూ. 88.08 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధర వద్ద విడుదల చేసింది. ఈ లగ్జరీ కారు భారతీయ మార్కెట్లో కేవలం 50 యూనిట్లకు మాత్రమే పరిమితం చేయబడింది.

గత వారం దేశీయ మార్కెట్లో విడుదలైన లేటెస్ట్ కార్లు.. వాటి వివరాలు

కొత్త ఆడి క్యూ7 లిమిటెడ్ ఎడిషన్‌ అద్భుతమైన డిజైన్ మరియు ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. అదే సమయంలో ఈ SUV 48వి మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీతో కూడా 3.0-లీటర్ వి6 పెట్రోల్ ఇంజన్ పొందుతుంది. ఇది 336.6 బిహెచ్‌పి పవర్ మరియు 500 ఎన్ఎమ్ టార్క్ అందిస్తాయి. ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌కి జత చేయబడి ఉంటుంది. కావున మంచి పనితీరుని అందిస్తుంది. దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త ఆడి క్యూ7 లిమిటెడ్ ఎడిషన్‌ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ లింకుపై క్లిక్ చేయండి.

గత వారం దేశీయ మార్కెట్లో విడుదలైన లేటెస్ట్ కార్లు.. వాటి వివరాలు

మహీంద్రా ఎక్స్‌యూవీ400 (Mahindra XUV400) ఆవిష్కరణ:

మహీంద్రా అండ్ మహీంద్రా దేశీయ మార్కెట్లోని ఎలక్ట్రిక్ వాహన విభాగంలో తన XUV400 తో ప్రవేశించింది. ఈ ఎలక్ట్రిక్ కారు సెప్టెంబర్ 08 న దేశీయ విఫణిలోకి అధికారికంగా ఆవిష్కరించబడింది. ఇది ఒక ఫుల్ ఛార్జ్ తో ఏకంగా 456 కిమీ రేంజ్ అందిస్తుందని మహీంద్రా తెలిపింది. అంతే కాకుండా ఇది ఆధునిక డిజైన్ మరియు పరికరాలతో చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ కొత్త XUV400 ని మేము ఇటీవల డ్రైవ్ చేశాము, దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Top car news of the week toyota hyryder launched mahindra xuv400 unveiled and more
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X