పండుగ సీజన్ కోసం సిద్ధమైన కార్లు ఇవే.. కొత్త తరం ఆల్టో నుండి ఖరీదైన ఆడి వరకూ..

భారతదేశంలో పండుగ సీజన్ వస్తుందంటే చాలు కార్ల తయారీ సంస్థలు కొత్త కార్లు, ఫేస్‌లిఫ్ట్ మోడళ్లు మరియు స్పెషల్ ఎడిషన్లను విడుదల చేస్తూ సందడి వాతావరణాన్ని సృష్టిస్తుంటాయి. గత రెండేళ్లుగా కోవిడ్ కారణంగా నెమ్మదిగా ఉన్న ఆటోమొబైల్ మార్కెట్, ఇప్పుడు తిరిగి పూర్తి జోష్ తో ముందుకు సాగుతోంది. రాబోయే పండుగ సీజన్ ను దృష్టిలో ఉంచుకొని, గడచిన ఆగస్ట్ నెలలో భారత ఆటోమొబైల్ కంపెనీలు కొన్ని కొత్త కార్లను, రిఫ్రెష్డ్ మోడళ్లను విడుదల చేశాయి.

Recommended Video

Maruti Alto K10 Launched At Rs 3.99 Lakh In Telugu | What’s New On The Hatchback? Dual-Jet VVT & AMT

గత నెలలో చిన్న కార్ల నుండి విలాసవంతమైన ఎస్‌యూవీల వరకు అనేక కొత్త మోడళ్లు విడుదలయ్యాయి. భారతదేశపు అగ్రగామి ప్యాసింజ్ర కార్ కంపెనీ మారుతి సుజుకి తమ సరికొత్త ఆల్టో కె10 హ్యాచ్‌బ్యాక్‌ని తీసుకురాగా, హ్యుందాయ్ తమ టూసాన్ ఎస్‌యూవీని విడుదల చేసింది. దేశపు అగ్రగామి యుటిలిటీ వాహన తయారీ సంస్థ మహీంద్రా తమ స్కార్పియో క్లాసిక్ మోడల్‌ను విడుదల చేయగా, జర్మన్ కార్ బ్రాండ్ తమ కొత్త 2022 మోడల్ క్యూ3ని విడుదల చేసింది. టాటా మోటార్స్ కూడా తమ ఎస్‌యూవీ లైనప్ లో స్పెషల్ ఎడిషన్లను విడుదల చేసింది.

పండుగ సీజన్ కోసం సిద్ధమైన కార్లు ఇవే.. కొత్త తరం ఆల్టో నుండి ఖరీదైన ఆడి వరకూ..

1. కొత్త తరం 2022 మారుతి సుజుకి ఆల్టో కె10

మారుతి సుజుకి తమ కొత్త తరం 2022 మోడల్ ఆల్టో కె10 కారుని గడచిన ఆగస్ట్ నెలలో మార్కెట్లో విడుదల చేసింది. ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడయ్యో ఈ ఈ చిన్న కారు ఇప్పుడు కేవలం రూ. 3.99 ధరతో విడుదల చేయబడింది. ఇందులో టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ. 5.84 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్)గా ఉంటుంది. పాత మోడల్ తో పోలిస్తే, కొత్త 2022 మోడల్ ఆల్టో కె10 సరికొత్త డిజైన్, ఆధునిక ఫీచర్లు, పరికరాలు మరియు మెరుగైన భద్రతా ఫీచర్లతో తీసుకురాబడింది. అలాగే, ఇందులోని ఇంజన్ కూడా మార్చబడింది.

పండుగ సీజన్ కోసం సిద్ధమైన కార్లు ఇవే.. కొత్త తరం ఆల్టో నుండి ఖరీదైన ఆడి వరకూ..

కొత్త తరం ఆల్టో కె10 మొత్తం నాలుగు వేరియంట్లలో విడుదల చేయబడింది. ఇందులో స్టాండర్డ్ (ఆప్షనల్), ఎల్ఎక్స్ఐ, విఎక్స్ఐ మరియు విఎక్స్ఐ+ వేరియంట్లు ఉన్నాయి. మొదటి రెండు వేరియంట్లు మ్యాన్యువల్ గేర్‌బాక్స్ తో లభిస్తుండగా, చివరి రెండు వేరియంట్లు మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ ఆప్షన్లతో లభిస్తాయి. ఇందులోని ఏఎమ్‌టి వేరియంట్ లీటరుకు 24.9 కిలోమీటర్ల మైలేజీని మరియు ఆటోమేటిక్ వేరియంట్ లీటరుకు 24.39 కిలోమీటర్ల మైలేజీని ఇస్తాయి. - కొత్త 2022 ఆల్టో కె10 టెస్ట్ డ్రైవ్ రివ్యూ కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

పండుగ సీజన్ కోసం సిద్ధమైన కార్లు ఇవే.. కొత్త తరం ఆల్టో నుండి ఖరీదైన ఆడి వరకూ..

2. కొత్త తరం 2022 హ్యుందాయ్ టూసాన్

కొరియన్ కార్ బ్రాండ్ హ్యుందాయ్ భారతదేశంలో తమ కొత్త తరం 2022 హ్యుందాయ్ టూసాన్ ఎస్‌యూవీని గడచిన ఆగస్ట్ నెలలో విడుదల చేసింది. భారత మార్కెట్లో కొత్త 2022 హ్యుందాయ్ టూసాన్ ఎస్‌యూవీ ధర రూ. 27.69 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. మునుపటి తరం మోడల్ తో పోలిస్తే, కొత్త తరం టూసాన్ సేఫ్టీలో అనేక రెట్లు మెరుగ్గా ఉంటుంది, ఇది క్రాష్ టెస్టులో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ ను కూడా దక్కించుకుంది. కొత్త తరం టూసాన్ ప్లాటినం మరియు సిగ్నేచర్ అనే రెండు వేరియంట్‌లలో విడుదల చేయబడింది.

పండుగ సీజన్ కోసం సిద్ధమైన కార్లు ఇవే.. కొత్త తరం ఆల్టో నుండి ఖరీదైన ఆడి వరకూ..

కొత్త తరం 2022 హ్యుందాయ్ టూసాన్ ఎస్‌యూవీ మెరుగైన 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ తో లభిస్తుంది. ఈ ఇంజన్ 156 బిహెచ్‌పి పవర్ ను మరియు 192 న్యూటన్ మీటర్ టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ తో జతచేయబడి ఉంటుంది. డీజిల్ ఇంజన్ ఆప్షన్ కోరుకునే వారి కోసం ఇందులో 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ అందుబాటులో ఉంది. ఇది 186 బిహెచ్‌పి శక్తిని మరియు 416 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. - హ్యుందాయ్ టూసాన్ పూర్తి టెస్ట్ డ్రైవ్ రివ్యూ కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

పండుగ సీజన్ కోసం సిద్ధమైన కార్లు ఇవే.. కొత్త తరం ఆల్టో నుండి ఖరీదైన ఆడి వరకూ..

3. టాటా జెట్ ఎడిషన్ ఎస్‌యూవీలు

దేశీయ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ అందిస్తున్న అన్ని ఎస్‌యూవీ మోడళ్లలో (కొత్తగా వచ్చిన టాటా పంచ్ మినహా) కంపెనీ జెట్ ఎడిషన్స్ పేరిట, పరిమిత కాలపు మోడళ్లను విడుదల చేసింది. ఈ స్పెషల్ ఎడిషన్ మోడళ్లు వాటి స్టాండర్డ్ మోడళ్ల కన్నా ప్రత్యేకమైన కలర్ మరియు ఫీచర్లతో లభిస్తాయి. టాటా మోటార్స్ అందిస్తున్న నెక్సాన్, హారియర్, సఫారి మోడళ్లలో జెట్ ఎడిషన్ లను గడచిన ఆగస్ట్ నెలలో విడుదల చేసింది. ఈ స్పెషల్ ఎడిషన్‌లలో ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ ఫీచర్లు అప్‌గ్రేడ్ చేయబడ్డాయి.

పండుగ సీజన్ కోసం సిద్ధమైన కార్లు ఇవే.. కొత్త తరం ఆల్టో నుండి ఖరీదైన ఆడి వరకూ..

టాటా జెట్ ఎడిషన్ ఎస్‌యూవీలు కస్టమర్లకు ప్రీమియం అనుభూతిని అందించడానికి స్టార్‌లైట్ కలర్ ఆప్షన్‌లో పరిచయం చేయబడ్డాయి. వీటిలో నెక్సాన్ జెట్ ఎడిషన్ ప్రారంభ ధర రూ. 12.13 లక్షలు, హారియర్ రూ. 20.90 లక్షలు మరియు సఫారీ రూ. 21.35 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉన్నాయి. నెక్సాన్ జెట్ ఎడిషన్ 4 వేరియంట్లు, సఫారీ జెట్ ఎడిషన్ 4 వేరియంట్లు మరియు హారియర్ జెట్ ఎడిషన్ 2 వేరియంట్లలో అందుబాటులోకి వచ్చాయి. ఈ స్పెషల్ ఎడిషన్లను వాటి టాప్-ఎండ్ వేరియంట్ల ఆధారంగా తయారు చేశారు. - మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

పండుగ సీజన్ కోసం సిద్ధమైన కార్లు ఇవే.. కొత్త తరం ఆల్టో నుండి ఖరీదైన ఆడి వరకూ..

4. మహీంద్రా స్కార్పియో క్లాసిక్

మహీంద్రా విక్రయిస్తున్న పాపులర్ ఎస్‌యూవీ స్కార్పియోలో కొత్త తరం మోడల్ స్కార్పియో-ఎన్ ను విడుదల చేసిన తర్వాత, కంపెనీ ఇప్పుడు తమ పాత మోడల్ స్కార్పియోని, స్కార్పియో క్లాసిక్ పేరుతో తిరిగి మార్కెట్లో రీలాంచ్ సేచింది. గడచిన ఆగస్ట్ నెలలో మార్కెట్లోకి వచ్చిన స్కార్పియో క్లాసిక్ కేవలం రెండు వేరియంట్లలో మాత్రమే విడుదల చేయబడింది. వీటిలో బేస్ వేరియంట్ అయిన మహీంద్రా స్కార్పియో క్లాసిక్ ఎస్ ధర రూ. 11.99 లక్షలు కాగా, స్కార్పియో ఎస్11 ధర రూ. 15.49 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించబడింది. - మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

పండుగ సీజన్ కోసం సిద్ధమైన కార్లు ఇవే.. కొత్త తరం ఆల్టో నుండి ఖరీదైన ఆడి వరకూ..

5. కొత్త 2022 ఆడి క్యూ3

జర్మన్ కార్ బ్రాండ్ ఆడి ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న క్యూ3 ఎస్‌యూవీలో కొత్త 2022 మోడల్ ను మార్కెట్లో విడుదల చేసింది. కొత్త ఆడి క్యూ3 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ధర రూ. 44.89 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంటుంది. ఇది ప్రీమియం ప్లస్ మరియు టెక్నాలజీ అనే రెండు ట్రిమ్‌లలో అందించబడుతుంది. వీటిలో ప్రీమియం ప్లస్ ధర రూ. 44.89 లక్షలు (ఎక్స్-షోరూమ్), టెక్నాలజీ ట్రిమ్ ధర రూ. 50.39 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. - ఈ కారుకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Top five cars launched in august 2022 alto k10 audi q3 facelift and more
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X