హైదరాబాద్‌ ఈ-మొబిలిటీ వీక్‌ గురించి పూర్తి వివరాలు - ఇక్కడ చూడండి

ప్రపంచం వేగంగా అభివృద్ధి చెందుతూ ప్రగతి వైపు అడుగులు వేస్తోంది, ఇందులో భాగంగానే కొత్త కొత్త వాహనాలు పుట్టుకొస్తున్నాయి. 2023 ఆటో ఎక్స్‌పో ముగియగానే హైదరాబాద్‌లో ఈ-మొబిలిటీ వీక్‌ ప్రారంభం కానుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

ప్రపంచ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలు భారీగా పెరుగుతున్న వేళ భారతదేశంలో కూడా విరివిగా ఎలక్ట్రిక్ వాహనాలు పుట్టుకొస్తున్నాయి. అయితే ఇందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం వచ్చే నెల 05 నుంచి 11 వరకు అంటే 'ఫిబ్రవరి 05 నుంచి 11 వరకు' హైదరాబాద్ నగరంలో ఈ-మొబిలిటీ వీక్‌ నిర్వహించడానికి సన్నద్ధమైంది. ఇందులో (హైదరాబాద్‌ ఈ మొబిలిటీ వీక్‌) ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ప్రముఖ విద్యావేత్తలు పాల్గొననున్నారు.

హైదరాబాద్‌ ఈ-మొబిలిటీ వీక్‌ గురించి పూర్తి వివరాలు

హైదరాబాద్‌ ఈ-మొబిలిటీ వీక్‌లో గ్లోబల్ EV పర్యావరణ వ్యవస్థ కూడా ప్రదర్శించబడుతుంది. అంతే కాకుండా ఈ వేదికగా భవిష్యత్తులో విడుదల చేయనున్న ఎలక్ట్రిక్ వాహనాలను కూడా ప్రవేశపెట్టనున్నారు. ఛార్జింగ్ వంటి మౌలిక సదుపాయాలను సిద్ధం చేయడం మరియు నెట్‌వర్క్‌ను మార్చుకోవడంపై కూడా ఇందులో చర్చించే అవకాశం ఉంది. అంతర్జాతీయ భాగస్వామ్యంతో పాటు ప్రపంచ ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమ యొక్క బలాలు & సామర్థ్యాలను చూసేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుంది.

త్వరలో జరగనున్న ఈ-మొబిలిటీ వీక్ గురించి KTR మాట్లాడుతూ.. హైదరాబాద్ ఈ-మొబిలిటీ వీక్‌ తెలంగాణ ఇవి సెగ్మెంట్‌లో తన నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి సిద్ధంగా ఉంది. ఎలక్ట్రిక్ వెహికల్ మరియు ఎనర్జీ స్టోరేజ్ పాలసీని ప్రారంభించిన మొదటి రాష్ట్రాలలో తెలంగాణా కూడా ఒకటి. రానున్న రోజుల్లో EV విభాగంలో ఆకర్షణీయమైన పెట్టుబడికి కూడా తెలంగాణ గమ్యస్థానంగా ఉంటుంది. తెలంగాణలో ఈ-మొబిలిటీ వీక్‌ నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.

హైదరాబాద్ ఈ-మొబిలిటీ వీక్‌ RALL-E తో ప్రారంభమవుతుంది. ఈ EV ర్యాలీలో ఎంతోమంది బైక్ రైడర్స్ రైడింగ్ చేయనున్నారు. అంతే కాకుండా రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వ్యాప్తికి కూడా దీని ద్వారా సందేశం అందించే అవకాశం ఉంది. బెంగళూరు, పూణెల నుంచి కూడా ఈ ప్రత్యేక ర్యాలీలు ప్రారంభమవుతాయి. ఇవన్నీ కూడా ఏకకాలంలో హైదరాబాద్‌లో ముగుస్తాయి. భారతదేశంలోనే మొట్టమొదటి ఫార్ములా ఇ-రేస్ రెండు రోజుల పాటు (ఫిబ్రవరి 10 మరియు 11) జరగనుంది.

హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో సస్టెయినబుల్ మొబిలిటీ సమ్మిట్ నిర్వహించబడుతుంది. ఇందులో ఎలక్ట్రిక్ మొబిలిటీ గురించి ఛార్జించే నాయకులు, విద్యావేత్తలు మరియు ప్రముఖ వ్యాపార వేత్తలు పాల్గొంటారు. ఇందులో ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ మరియు ఫౌండర్ భవిష్ అగర్వాల్, మహీంద్రా ఎలక్ట్రిక్ సీఈఓ సుమన్ మిశ్రా, ఏథర్ సీఈఓ మరియు కోఫౌండర్ తరుణ్ మెహతా, ఉబెర్ ఇండియా సౌత్ ఆసియా ప్రెసిడెంట్ ప్రభ్‌జీత్ సింగ్ వంటి వారు పాల్గొంటారు.

హైదరాబాద్ ఈ-మొబిలిటీ వీక్‌ ఛాలెంజ్‌లో పాల్గొనడానికి, స్టార్ట్-అప్ గ్రాండ్ ఛాలెంజ్ వెబ్‌సైట్‌లో తమ ప్రెజెంటేషన్‌లను టైమ్‌లైన్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ స్టార్టప్ ఛాలెంజ్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈ ఈ-మొబిలిటీ వీక్‌లో అగ్రశ్రేణి ఆటోమొబైల్ కంపెనీలు అనేక ఎలక్ట్రిక్ వాహనాల ఆవిష్కరించబడతాయి మరియు విడుదలయ్యే అవకాశం కూడా ఉంది. ఇందులో మహీంద్రా పినిన్‌ఫారినా బాటిస్టా, క్వాంటం ఎనర్జీ ఎలక్ట్రిక్ వెహికల్ ప్రదర్శించనుంది.

హైదరాబాద్‌ ఈ-మొబిలిటీ వీక్‌తో పాటు గత కొన్ని రోజులుగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫార్ములా ఇ-రేస్ కూడా జరగనుంది. ఈ రేస్ ఫిబ్రవరి 10 మరియు 11 వ తేదీ జరుగుతుంది. ఫార్ములా E రేస్ అనేది ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి ఎల్ ఆటోమొబైల్ (FIA) చే నిర్వహించబడే ప్రపంచంలోని ప్రీమియర్ ఎలక్ట్రిక్ సింగిల్-సీటర్ రేసింగ్ సిరీస్. ఇందులో ప్రపంచంలోని 22 వేగవంతమైన డ్రైవర్‌లు పాల్గొంటారు.

Most Read Articles

English summary
Hyderabad e mobility week details in telugu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X