2017 యూనికార్న్ 150 ఫేస్‌లిఫ్ట్‌ను సిద్దం చేస్తున్న హోండా

Written By:

ఇండియన్ టూ వీలర్ మార్కెట్లోని 150సీసీ సెగ్మెంట్లో హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా సంస్థకు మంచి విజయం సాధించిపెట్టిన మోడల్ యూనికార్న్ 150. ఇప్పుడు ఈ 150సీసీ మోటార్‌ సైకిల్‌కు అప్‌డేట్స్ నిర్వహించి ఫేస్‌లిఫ్ట్ రూపంలో విపణిలోకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

హోండా యూనికార్న్ 150 ఫేస్‌లిఫ్ట్

గతంలో ఓ సారి యూనికార్న్ 150 బైకును మార్కెట్ నుండి తొలగించింది. అయితే ఎక్కువ డిమాండ్ ఉన్న నేపథ్యంలో మళ్లీ లాంచ్ చేసింది. అయితే ఈ యూనికార్న్ 150 బైకును ఫేస్‌లిఫ్ట్ రూపంలో విడుదల చేయనున్న దీని తాలూకు పేటెంట్ పొందిన ఫోటోలు లీకయ్యాయి.

హోండా యూనికార్న్ 150 ఫేస్‌లిఫ్ట్

హెడ్ లైట్ స్ట్రక్చర్‌కు సంభందించిన విడుదలైన ఫోటో ప్రకారం ఫేస్‌లిఫ్ట్ యూనికార్న్ 150 మరింత అగ్రెసివ్ మరియు షార్ప్ డిజైన్ లక్షణాలను కలిగి ఉంది.

హోండా యూనికార్న్ 150 ఫేస్‌లిఫ్ట్

అప్‌డేటెడ్ యూనికార్న్ 150లో పొడగించబడిన ఫ్యూయల్ ట్యాంక్ కలదు. తద్వారా ఇది స్పోర్టివ్ లక్షణాలకు చేరువయ్యింది. మరియు వెనుక వైపున రెండుగా విడిపోయిన గ్రాబ్ రెయిల్స్ అందించనున్నారు(వెనుక వైపున చేతులతో పట్టుకునే వాటిని గ్రాబ్ రెయిల్స్ అంటారు).

హోండా యూనికార్న్ 150 ఫేస్‌లిఫ్ట్

లీకయిన ఫోటోల ప్రకారం ఫేస్‌లిఫ్ట్ యూనికార్న్ 150 డ్రమ్ బ్రేకులతో రానుంది. అయితే దీనిని కనీసం ఆప్షనల్‌గా అయినా డిస్క్ బ్రేక్ వేరియంట్లో అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది.

హోండా యూనికార్న్ 150 ఫేస్‌లిఫ్ట్

ఇంజన్‌పరంగా చూస్తే ఫేస్‌లిఫ్ట్ యూనికార్న్ 150లో అదే 149సీసీ సామర్థ్యం సింగల్ సిలిండర్ ఇంజన్‌ను కొనసాగించనున్నారు. ఇది గరిష్టంగా 13బిహెచ్‌పి పవర్ మరియు 12.8ఎన్ఎమ్ ఉత్పత్తి చేస్తుంది.

హోండా యూనికార్న్ 150 ఫేస్‌లిఫ్ట్

2017 యూనికార్న్ 150 ఈ ఏడాది చివరికి మార్కెట్లోకి విడుదల కానుంది. రూ. 70,000 ల ధర శ్రేణిలో రానున్న ఇది బజాజ్ పల్సర్ 150 మరియు హీరో ఎక్ట్స్రీమ్ స్పోర్ట్స్ బైకులకు గట్టిపోటీనివ్వనుంది.

Read more on: #హోండా #honda
English summary
Read In Telugu 2017 Honda Unicorn 150 Facelift In The Works — Patent Images Leaked
Story first published: Friday, May 19, 2017, 10:28 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark