జనవరిలో పెరగనున్న కవాసకి ధరలు; ఏయే మోడల్‌పై ఎంతంటే..?

జపనీస్ టూవీలర్ బ్రాండ్ కవాసకి, భారత మార్కెట్లో విక్రయిస్తున్న తమ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలో ఎంపిక చేసిన మోడళ్ల ధరలను పెంచాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుండి పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని కంపెనీ పేర్కొంది.

జనవరలో పెరగనున్న కవాసకి ధరలు; ఏయే మోడల్‌పై ఎంతంటే..?

జనవరి 1, 2021వ తేదీ నుండి కవాసకి నింజా 650 మోడల్‌ని రూ.6.39 లక్షలు (ఎక్స్‌షోరూమ్) మరియు దాని నేక్డ్ వెర్షన్ మోటార్‌సైకిల్ అయిన కవాసకి జెడ్ 650 ధర రూ.6.04 లక్షలు (ఎక్స్‌షోరూమ్)కు విక్రయించనున్నారు.

జనవరలో పెరగనున్న కవాసకి ధరలు; ఏయే మోడల్‌పై ఎంతంటే..?

అలాగే, కవాసాకి జెడ్ 900 బైక్‌ను రూ.8.19 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో విక్రయించనున్నారు. కొత్త సంవత్సరంలో కవాసాకి నింజా 1000 ఎస్ఎక్స్ కొనాలనుకునే కస్టమర్లు ఇకపై రూ.11.04 లక్షలు (ఎక్స్-షోరూమ్) చెల్లించాల్సి ఉంటుంది.

MOST READ:కేవలం 4 గంటల సమయంలో భారీగా పట్టుబడ్డ దొంగ వాహనాలు..ఇంకా ఎన్నో..మీరే చూడండి

జనవరలో పెరగనున్న కవాసకి ధరలు; ఏయే మోడల్‌పై ఎంతంటే..?

భారతీయ మార్కెట్లో కవాసాకి అందిస్తున్న వల్కాన్ సిరీస్ విషయానికి వస్తే, మన మార్కెట్లో కంపెనీ తమ వల్కాన్ ఎస్ మోడల్‌ని మాత్రమే ఇక్కడి మార్కెట్లో విక్రయిస్తోంది. జనవరి 1, 2021 నుండి ఈ బైక్ ధర రూ.5.94 లక్షలు (ఎక్స్-షోరూమ్)కు పెరగనుంది.

జనవరలో పెరగనున్న కవాసకి ధరలు; ఏయే మోడల్‌పై ఎంతంటే..?

ఈ క్రూయిజర్ మోటార్‌సైకిల్‌తో పాటుగా కంపెనీ దేశంలో కొన్ని అడ్వెంచర్ బైక్‌లను కూడా విక్రయిస్తోంది, ఇందులో రెండు వెర్సాస్ సిరీస్ బైక్‌లు ఉన్నాయి. అవి: వెర్సా 650 మరియు వెర్సా 1000. జనవరి 1, 2021 నుండి, వెర్సా 650 ధర రూ.6.94 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంటుంది.

MOST READ:బ్లాక్ అండ్ వైట్ మహీంద్రా థార్.. దీని స్టైలే వేరు గురూ..

జనవరలో పెరగనున్న కవాసకి ధరలు; ఏయే మోడల్‌పై ఎంతంటే..?

అదే సమయంలో, ఈ సిరీస్‌లోని వెర్సా 1000 ధర రూ.11.19 లక్షలకు (ఎక్స్-షోరూమ్) పెంచబడుతుంది. ఇవే కాకుండా, కవాసాకి భారత్‌లో డబ్ల్యూ 800 అనే రెట్రో స్టైల్ బైక్‌ను కూడా విక్రయిస్తోంది.

జనవరలో పెరగనున్న కవాసకి ధరలు; ఏయే మోడల్‌పై ఎంతంటే..?

కొత్త సంవత్సరంలో కవాసకి డబ్ల్యూ 800 బైక్ ధర రూ.7.09 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇకపోతే, కవాసకి భారతదేశంలో తమ కెఎక్స్ మరియు కెఎల్ఎక్స్ సిరీస్ మోటార్‌సైకిళ్ల ధరలను కూడా పెంచుతున్నట్లు ప్రకటించింది.

MOST READ:మళ్ళీ ప్రారంభం కానున్న సీప్లేన్ సర్వీస్.. ఎప్పటినుండో తెలుసా ?

జనవరలో పెరగనున్న కవాసకి ధరలు; ఏయే మోడల్‌పై ఎంతంటే..?

ఈ పెరిగిన ధరలు జనవరి 1, 2021వ తేదీ నుండి అమలులోకి రానున్నాయి. అయితే, డిసెంబర్ 2020లో బుక్ చేసుకున్న మోడళ్లను మాత్రం కంపెనీ పాత (ప్రస్తుత) ధరలకే విక్రయించనుంది. ప్రస్తుతం కవాసక్ భారత్‌లో విక్రయిస్తున్న మోడళ్లన్నింటినీ బిఎస్6 నిబంధనలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేసింది.

జనవరలో పెరగనున్న కవాసకి ధరలు; ఏయే మోడల్‌పై ఎంతంటే..?

కానీ, దేశీయ మార్కెట్ నుండి తమ ఎంట్రీ లెవల్ స్పోర్ట్స్ బైక్ నింజా 300 మోడల్‌ను ఆఫర్‌ను మాత్రం నిలిపివేసింది. తాజా సమాచారం ప్రకారం, కవాసకి ఇప్పుడు తమ నింజా 300లో అప్‌డేట్ చేసిన బిఎస్6 వెర్షన్‌ను త్వరలోనే భారత మార్కెట్లోకి తిరిగి ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

MOST READ:సినిమా స్టైల్‌లో బస్సును కొండపై యు-టర్న్ చేసిన డ్రైవర్ [వీడియో]

జనవరలో పెరగనున్న కవాసకి ధరలు; ఏయే మోడల్‌పై ఎంతంటే..?

కొత్త బిఎస్6 కంప్లైంట్ కవాసాకి నింజా 300 వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ నెలలో భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఎంట్రీ లెవల్ స్పోర్ట్స్ బైక్ మార్కెట్లో పెరుగుతున్న పోటీని దృష్టిలో ఉంచుకొని కవాసకి తమ నింజా 300 యొక్క కొత్త బిఎస్6 వెర్షన్‌ను ఈ విభాగంలో పోటీ ధరతో విడుదల చేసే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Kawasaki India To Increase Bike Price From January 2021, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X