యారిస్ విడుదల తేదీ ప్రకటించిన టయోటా

టయోటా కిర్లోస్కర్ ఇండియా తమ సరికొత్త యారిస్ మిడ్ సైజ్ సెడాన్ విడుదలను ఖాయం చేసింది. మే 18, 2018 న పూర్తి స్థాయిలో విపణిలోకి లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది.

By Anil Kumar

టయోటా కిర్లోస్కర్ ఇండియా తమ సరికొత్త యారిస్ మిడ్ సైజ్ సెడాన్ విడుదలను ఖాయం చేసింది. మే 18, 2018 న పూర్తి స్థాయిలో విపణిలోకి లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఇండియన్ మిడ్-సైజ్ సెడాన్ సెగ్మెంట్లోకి ప్రవేశపెట్టనున్న యారిస్‌ కారును ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఆటో ఎక్స్ పో 2018లో ఆవిష్కరించింది.

టయోటా యారిస్

తాజాగా అందిన రిపోర్ట్స్ మేరకు, టయోటా యారిస్ మీద అధికారిక బుకింగ్స్ ఏప్రిల్ 22 నుండి ప్రారంభం కానున్నాయి. కొన్ని టయోటా షోరూముల్లో యారిస్ సెడాన్ మీద ముందస్తు బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. రూ. 50,000 చెల్లించి టయోటా యారిస్ బుక్ చేసుకోవచ్చు.

టయోటా యారిస్

తొలుత టయోటా యారిస్ 1.5-లీటర్ కెపాసిటి గల నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్‌లో మాత్రమే లభ్యం కానుంది. 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 7-స్పీడ్ ఆటోమేటిక్ అనుసంధానంతో లభించే ఇది 108బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది.

టయోటా యారిస్

మిడ్ సైజ్ సెడాన్ సెగ్మెంట్లో ఉన్న ఇతర మోడళ్లకు పోటీగా అధునాతన ఫీచర్లను అందించి కస్టమర్లను ఆకట్టుకోనుంది. బంపర్ మీదున్న పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, 15-అంగుళాల అల్లాయ్ వీల్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, స్టెబిలిటి కంట్రోల్, పార్కింగ్ సెన్సార్లు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ మరియు 7-ఎయిర్ బ్యాగులు వంటి ఎన్నో ఫీచర్లు రానున్నాయి.

టయోటా యారిస్

టయోటా యారిస్ అంచనా ధరల శ్రేణి రూ. 10 లక్షల నుండి రూ. 12 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్‌గా ఉండవచ్చు. ఇది పూర్తి స్థాయిలో విపణిలోకి విడుదలైతే, మార్కెట్లో ఉన్న మారుతి సుజుకి సియాజ్, హోండా సిటి మరియు హ్యుందాయ్ వెర్నా వంటి మోడళ్లకు గట్టి పోటీనివ్వనుంది.

టయోటా యారిస్

టయోటా యారిస్ అధికారికంగా లాంచ్ అయితే, టయోటా ఇండియా లైనప్‌లో ఉన్న ఎటియోస్ మరియు కరోలా ఆల్టిస్ మధ్య స్థానాన్ని భర్తీ చేస్తుంది. తక్కువ ధరలో అందించి మిగతా మోడళ్ల కంటే చౌకైన మరియు సరసమైన మోడల్‌గా గుర్తింపు తెచ్చుకోవడానికి పూర్తి స్థాయిలో దేశీయంగా తయారైన విడి పరికరాలతో దీనిని ఉత్పత్తి చేయనుంది.

టయోటా యారిస్

1. రాంగ్ సైడ్ డ్రైవింగ్ నివారించడానికి టైర్ కిల్లర్స్ ఏర్పాటు చేసిన పోలీసులు

2.మిస్టరీ రైలులో నార్త్ కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ రహస్య చైనా పర్యటన

3.2018 మారుతి స్విఫ్ట్ సేఫ్ కారు కాదా....? నిగ్గు తేల్చిన యూరో ఎన్‌సిఎపి!!

4.ప్రతి హైదరాబాదీ ఈ ముగ్గురు వ్యక్తులకు థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే!!

5.కొత్త ట్రెండ్ సెట్ చేసిన క్లాసిక్ 350 గన్‌మెటల్ గ్రే బైకుతో తలలు పట్టుకుంటున్న రాయల్ ఎన్ఫీల్డ్

Source: Autocar India

Most Read Articles

English summary
Read In Telugu: Toyota Yaris Launch Date Confirmed — Booking To Officially Begin From April End
Story first published: Friday, March 30, 2018, 10:15 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X