Just In
- 8 hrs ago
కారులో ఉన్న పాడిల్ షిఫ్ట్ ఫీచర్ యొక్క ప్రయోజనాలు
- 20 hrs ago
భారత్‌లో ఫేమ్ స్కీమ్స్ కింద స్థాపించబడిన EV ఛార్జింగ్ స్టేషన్లు
- 20 hrs ago
టాటా టిగోర్ ఈవి ఫేస్‌లిఫ్ట్ వివరాలు వెల్లడి; ఎక్స్ ప్రెస్-టి పేరుతో త్వరలోనే లాంచ్!
- 23 hrs ago
హైదరాబాద్‌లో విడుదల కానున్న బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ - డీటేల్స్
Don't Miss
- Sports
IPL 2021: సన్‌రైజర్స్‌కు భారీ షాక్.. స్టార్ పేసర్‌కు గాయం! ఆడేది అనుమానమే!
- News
కరోనా విలయం: ప్రధానికి చెక్ పెడుతూ రాహుల్ గాంధీ కీలక నిర్ణయం -వంచన వద్దన్న ప్రియాంక -మోదీ ఇలా
- Finance
పదింటిలో 9 కంపెనీల్లో నియామకాల జోరు, ఐటీలో అదుర్స్
- Movies
మరోసారి నందమూరి హీరోతో బోయపాటి మూవీ: యాక్షన్ స్టోరీని రెడీ చేసిన మాస్ డైరెక్టర్
- Lifestyle
ఈ వారం 18వ తేదీ నుండి ఏప్రిల్ 24వ తేదీ వరకు మీ రాశిఫలాలు...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అటల్ టన్నెల్‌లో ఒకటి, రెండు కాదు ఏకంగా 82 వాహనాలు చిక్కుకున్నాయి.. కారణం ఇదే
సాధారణంగా శీతాకాలంలో చలి తీవ్రత ఎక్కువయ్యే కొద్దీ కొండ ప్రాంతాలలో హిమపాతం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతాలలో మంచు భారీగా కురుస్తుంది. ఈ హిమపాతం వల్ల ఇక్కడ నివసించే ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు. అంతే కాకుండా అక్కడకు వెళ్లే పర్యాటకులకు కూడా చాలా సమస్యగా ఉంటుంది.

కొన్ని నివేదికల ప్రకారం మనదేశంలో హిమాచల్ ప్రదేశ్ లోని కులు జిల్లా కూడా కొన్ని రోజులుగా ఈ హిమపాతాన్ని ఎదుర్కొంటోంది. ఇటీవల హిమాచల్ ప్రదేశ్ లో ప్రపంచంలోనే అత్యున్నత పొడవైన సొరంగంమైన అటల్ టన్నెల్ భారత ప్రధానమంత్రి చేత ఓపెన్ చేయబడింది.

ఈ అటల్ టన్నెల్ లో హిమపాతం కారణంగా 82 కార్లు ఇరుక్కుపోయాయి. ఇరుక్కుపోయిన వాహనాలను కులు పోలీసులు అటల్ టన్నెల్ యొక్క సౌత్ పోర్టల్ ప్రాంతం నుండి వాహనాలను తరలించారు. దీనికి సంబంధించిన సమాచారం ప్రకారం శనివారం రాత్రి పొలిసు టీమ్ ఆ ప్రాంతం నుంచి దాదాపు 300 మందికి పైగా పర్యాటకులను రక్షించింది.
MOST READ:2021 డాకర్ ర్యాలీ స్టేజ్ 1 ఫలితాలు వచ్చేశాయ్.. భారతీయ రేసర్లు ఏ స్టేజ్‌లో ఉన్నారో చూడండి

దీని గురించి మనాలికి చెందిన సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్‌డిఎం) రామన్ ఘర్సంగి సమాచారాన్ని అందించారు. వాహనాల కదలికను నివారించడానికి మరియు చిక్కుకుపోయిన ప్రజలను రక్షించడానికి నిరంతరం ప్రయత్నాలు జరుగుతున్నాయి, అని ఆయన అన్నారు.

డిసెంబర్ 29 న హిమాచల్ ప్రదేశ్ లో హిమపాతం ఎక్కువ కావడం వల్ల అక్కడ ఎల్లో అలెర్ట్ విధించినట్లు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. అంతే కాకుండా జనవరి 5 న మధ్య మరియు ఎత్తైన పర్వత ప్రాంతాలలో భారీ హిమపాతం ఉంటుందని, జనవరి 3 నుండి 5 వరకు మైదానాలు మరియు లోతట్టు పర్వత ప్రాంతాలలో ఉరుములు మరియు తేలికపాటి వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
MOST READ:ఒక ఛార్జ్‌తో 100 కి.మీ డ్రైవింగ్.. ధర తక్కువ & డ్రైవింగ్ లైసెన్స్ అవసరమే లేదు

అటల్ టన్నెల్ ప్రారంభమైనప్పటి నుండి చాలా చర్చలకు దారి తీస్తోంది. ఇటీవల కొన్ని రోజుల క్రితం ఒకే రోజులో ఈ అటల్ టన్నెల్ ద్వారా 5,450 వాహనాలు ప్రయాణించాయని సమాచారం. అటల్ టన్నెల్ ప్రారంభించినప్పటినుంచి ఇది ఒక రికార్డ్ అనే చెప్పాలి.

అటల్ టన్నెల్ 10,000 అడుగుల ఎత్తులో నిర్మించబడింది, దీని పొడవు 9.02 కిలోమీటర్లు. 3 వేల కార్లు మరియు 1500 ట్రక్కులు ఈ సొరంగ మార్గం గుండా వెళ్లేట్లు అటల్ టన్నెల్ నిర్మించబడింది. కానీ ప్రస్తుతం వాహనాల రాకపోకలు మరీ ఎక్కువయ్యాయి. ఎందుకంటే ఇది ఒక పర్యాటక కేంద్రంగా మారింది.
MOST READ:కొత్త మహీంద్రా థార్ కొనుగోలు చేసిన మలయాళీ సెలబ్రెటీ, ఎవరో చూసారా ?

అటల్ టన్నెల్ చాలా సురక్షితంగా నిర్మించబడింది. ఇందులో ప్రతి 250 మీటర్లకు సిసిటివి కెమెరాలు ఏర్పాటు చేయబడ్డాయి. అంతే కాకుండా ప్రతి 500 మీటర్లకు ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటుంది. ప్రతి 60 మీటర్లకు సొరంగంలో ఫైర్ హైడ్రాంట్లు ఏర్పాటు చేయబడ్డాయి మరియు ప్రతి 150 మీటర్లకు టెలిఫోన్ సౌకర్యాలు కల్పించబడ్డాయి.

దీనితో, ప్రతి 1 కిలోమీటరుకు ఎయిర్ క్వాలిటీ మానిటర్ ఇవ్వబడింది. ఈ సొరంగం మార్గానికి ఇరువైపులా 1 మీటర్ ఫుట్‌పాత్ ఉంది. దీనితో కలిపి ఇది 10.5 మీటర్ల వెడల్పు కలిగి ఉంది. ఈ టన్నెల్ నిర్మించడానికి 6 సంవత్సరాల కన్నా తక్కువ సమయం పడుతుందని అంచనా వేయబడింది.
MOST READ:న్యూ ఇయర్లో భారీగా తగ్గిపోయిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు.. అసలు కారణం ఇదే..

కానీ ఈ సొరంగ మార్గం పూర్తి కావడానికి ఏకంగా 10 సంవత్సరాల సమయం పట్టింది. అటల్ టన్నెల్ లో వేగపరిమితి గంటకు 80 కి.మీ వద్ద ఉంచారు. అటల్ టన్నెల్‌లో అనేక సౌకర్యాలు ఉన్నాయి, అక్కడికి వచ్చే పర్యాటకులు వీటిని సద్వినియోగం చేసుకుంటున్నారు, మరికొంతమంది వీటిని దుర్వినియోగం చేస్తున్నారు. ఈ కారణంగా ఇటీవల కొంతమంది వ్యక్తులను అరెస్ట్ చేశారు.