హ్యుందాయ్ 7-సీటర్ ఎస్‌యూవీ పేరు 'అల్కజార్'; త్వరలోనే విడుదల!

కొరియన్ కార్ బ్రాండ్ హ్యుందాయ్ భారత మార్కెట్ కోసం ఓ 7-సీటర్ ఎస్‌యూవీని అభివృద్ధి చేస్తోందని తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి-కథనం లో ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా, కంపెనీ ఇప్పుడు ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది.

హ్యుందాయ్ 7-సీటర్ ఎస్‌యూవీ పేరు 'అల్కజార్'; త్వరలోనే విడుదల!

హ్యుందాయ్ నుండి రాబోతున్న ఈ 7-సీటర్ ఎస్‌యూవీకి 'అల్కజార్' (Alcazar) అనే పేరును కూడా ఖరారు చేశారు. త్వరలోనే ఈ ఎస్‌యూవీని భారత్‌తో పాటుగా అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ఆవిష్కరించనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ మేరకు ఓ టీజర్ వీడియోని కూడా విడుదల చేసింది.

హ్యుందాయ్ 7-సీటర్ ఎస్‌యూవీ పేరు 'అల్కజార్'; త్వరలోనే విడుదల!

హ్యుందాయ్ అందిస్తున్న లేటెస్ట్ జనరేషన్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ క్రెటాను ఆధారంగా చేసుకొని, దాని ఎక్స్‌టెండెడ్ వెర్షన్‌గా ఈ సరికొత్త 7-సీటర్ ఎస్‌యూవీని కంపెనీ డెవలప్ చేస్తోంది. కాబట్టి, ఈ కొత్త ఎస్‌యూవీ కూడా దాని స్టైలింగ్ మరియు డిజైన్ క్రెటా మాదిరిగానే అనిపిస్తుంది.

MOST READ:మీ వాహనంపై ఈ స్టిక్కర్ ఉందా.. ఉంటే వెంటనే తీసెయ్యండి.. లేకుంటే ?

అయితే, ఈ రెండు మోడళ్ల మధ్య వ్యత్యాసాన్ని చూపేందుకు కంపెనీ దీని ఫ్రంట్ డిజైన్‌లో స్వల్ప మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది. టాటా మోటార్స్ అందిస్తున్న హారియర్ మరియు కొత్త సఫారీల మాదిరిగానే హ్యుందాయ్ కూడా తమ క్రెటా, అల్కజార్ మోడళ్ల ఫ్రంట్ డిజైన్‌లో గ్రిల్, హెడ్‌లైట్స్ వంటి అంశాల్లో మార్పులు చేసే అవకాశం ఉంది.

హ్యుందాయ్ 7-సీటర్ ఎస్‌యూవీ పేరు 'అల్కజార్'; త్వరలోనే విడుదల!

హ్యుందాయ్ అల్కజార్ ఫ్రంట్ మరియు సైడ్ డిజైన్ చూడటానికి ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న కొత్త 2020 మోడల్ క్రెటా మాదిరిగానే అనిపిస్తుంది. అయితే, ఇందులో ప్రధానమైన మార్పు దీని వెనుక భాగంలో ఉండనుంది. రియర్ డిజైన్‌లో పెరిగిన కొలతల కారణంగా, క్యాబిన్ స్పేస్ కూడా పెరగనుంది.

MOST READ:కారులో ఆహారపదార్థాలు నిల్వచేస్తే వచ్చే సమస్యలేంటో మీకు తెలుసా.. అయితే ఇది చూడండి

హ్యుందాయ్ 7-సీటర్ ఎస్‌యూవీ పేరు 'అల్కజార్'; త్వరలోనే విడుదల!

ఈ కారు వెనుక భాగంలో సి-ఆకారపు ఎల్‌ఇడి టెయిల్ లాంప్స్, కొత్త బంపర్ మరియు కొత్త టెయిల్‌గేట్ మరియు సరికొత్త అల్లాయ్ వీల్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా, రియర్ క్వార్టర్ విండోస్ వంటి మార్పులు ఉండనున్నాయి.

హ్యుందాయ్ 7-సీటర్ ఎస్‌యూవీ పేరు 'అల్కజార్'; త్వరలోనే విడుదల!

ఇంటీరియర్స్ విషయానికి వస్తే, ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఛార్జింగ్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ డ్రైవర్ సీట్, రియర్ ఏసి వెంట్స్, పానరోమిక్ సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్, వెనుక భాగంలో మల్టిపుల్ ఛార్జింగ్ పోర్ట్‌లు వంటి ఎన్నో ఫీచర్లు లభించే అవకాశం ఉంది.

MOST READ:డ్రైవింగ్ లైసెన్స్‌లోని ఈ చిత్రం భలే విచిత్రం..చూసారా..!

హ్యుందాయ్ 7-సీటర్ ఎస్‌యూవీ పేరు 'అల్కజార్'; త్వరలోనే విడుదల!

హ్యుందాయ్ క్రెటాలో మూడవ వరుసలో సీటింగ్ ఉంటుంది. ఇది కూడా 6-సీటర్ మరియు 7-సీటర్ ఆప్షన్లలో లభించవచ్చని అంచనా. హ్యుందాయ్ ఇప్పటికే తమ 7-సీటర్ అల్కజార్ ఎస్‌యూవీని భారత రోడ్లపై విస్తృతంగా పరీక్షిస్తోంది. ప్రస్తుతం ఇది ఉత్పత్తి దశకు చేరువలో ఉన్నట్లు తెలుస్తోంది.

హ్యుందాయ్ 7-సీటర్ ఎస్‌యూవీ పేరు 'అల్కజార్'; త్వరలోనే విడుదల!

ఈ కొత్త 7-సీటర్ అల్కజార్‌లోని అనేక ఇతర ఫీచర్లు మరియు పరికరాలు స్టాండర్డ్ 5-సీటర్ క్రెటా మాదిరిగానే ఉండొచ్చని అంచనా. ఇంజన్ మరియు ట్రాన్సిమిషన్ ఆప్షన్స్ కూడా క్రెటా మాదిరిగానే ఉంటాయని తెలుస్తోంది.

MOST READ:ఇలాంటి విచిత్రమైన ఎలక్ట్రిక్ కారును ఎప్పుడైనా చూశారా?

హ్యుందాయ్ 7-సీటర్ ఎస్‌యూవీ పేరు 'అల్కజార్'; త్వరలోనే విడుదల!

హ్యుందాయ్ నుండి కొత్తగా వస్తున్న 7-సీటర్ అల్కజార్ ఈ ఏడాది మధ్య భాగం నాటికి మార్కెట్లో విడుదల కావచ్చని అంచనా. ఇది ఈ విభాగంలో ఎమ్‌జి హెక్టర్ ప్లస్, టాటా సఫారీ, 7 సీటర్ జీప్ కంపాస్, న్యూ-జెన్ మహీంద్రా ఎక్స్‌యువి500 వంటి మోడళ్లకు పోటీగా నిలిచే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Hyundai Announces New 7-Seater SUV Name Alcazar; India Launch Expected Soon. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X