వెబ్‌సైట్‌లో మహీంద్రా ఎక్స్‌యూవీ700; ఆసక్తిగల కస్టమర్లు రిజిస్టర్ చేసుకోవచ్చు!

ఎస్‍యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా తమ తదుపరి మోడల్‌గా 'ఎక్స్‌యూవీ700' పేరుతో ఓ సరికొత్త ఎస్‌యూవీని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసినదే. తాజాగా, కంపెనీ ఈ మోడల్‌ను తమ అధికారిక వెబ్‌సైట్‌లో లిస్ట్ చేసింది.

మహీంద్రా ఎక్స్‌యూవీ700 కోసం కంపెనీ ఓ మైక్రో వెబ్‌సైట్‌ను రూపొందించింది. ఆసక్తిగల కస్టమర్లు ఈ ఎస్‌యూవీకి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం, ఇందులో తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. అలా రిజిస్టర్ చేసుకున్న కస్టమర్ల ఫోన్ నెంబర్ లేదా ఈ-మెయిల్ ఐడిలకు కంపెనీ ఈ ఎస్‌యూవీకి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్ పంపిస్తుంది.

వెబ్‌సైట్‌లో మహీంద్రా ఎక్స్‌యూవీ700

మహీంద్రా ఎక్స్‌యూవీ700 విషయానికి వస్తే, కంపెనీ ఈ ఎస్‌యూవీని ప్రపంచ స్థాయి టెక్నాలజీతో డెవలప్ చేస్తోంది. పూర్తిగా సరికొత్త ప్లాట్‌ఫామ్‌పై తయారు కానున్న ఈ ఎస్‌యూవీ ప్రస్తుత తరం ఎక్స్‌యూవీ500 మోడల్‌కు ఎగువన ఆఫర్ చేసే అవకాశం ఉంది.

మహీంద్రా తమ ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీలో లేటెస్ట్ టెక్నాలజీ, స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ మరియు ఫస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లను జోడించనుంది. ఈ ఎస్‌యూవీని డబ్ల్యూ 601 ప్లాట్‌ఫామ్‌పై తయారు చేయనున్నారు. ఇది పూర్తిగా కొత్త ప్లాట్‌ఫామ్.

మహీంద్రా వాహనాలు సేఫ్టీ ఫీచర్లకు ప్రసిద్ధి చెందినవి, ఈ నేపథ్యంలో కొత్తగా రానున్న ఈ ఎస్‌యూవీలో కూడా ప్రపంచ స్థాయి సేఫ్టీ ఫీచర్లు ఉంటాయని ఆశిస్తున్నారు. మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీని పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్లు, మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందించనున్నారు.

ఎక్స్‌యూవీ700లో ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌ను కూడా ఆఫర్ చేయనున్నారు. ఈ కొత్త ఎస్‌యూవీని మహారాష్ట్రలోని చకాన్‌లోని ప్లాంట్‌లో మహీంద్రా ఉత్పత్తి చేయనుంది. మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీని కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో విడుదల చేయనుంది.

వెబ్‌సైట్‌లో మహీంద్రా ఎక్స్‌యూవీ700

మహీంద్రా ఎక్స్‌యూవీ700లో కొన్ని సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లు లభించే ఆస్కారం ఉంది. ఇది ఈ విభాగంలో భవిష్యత్తులో రాబోయే 7 సీటర్ ఎస్‌యూవీలకు ఓ కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేస్తుందని భావిస్తున్నారు.

ఎమ్‌జి గ్లోస్టర్ ఎస్‌యూవీలో కనిపించినట్లుగా, మహీంద్రా ఎక్స్‌యూవీ700లో కూడా లెవల్ - 1 అటానమస్ డ్రైవింగ్ టెక్నాలజీ ఉంటుందని సమాచారం. ఈ టెక్నాలజీ సాయంతో కారును డ్రైవర్ అవసరం లేకుండానే కంట్రోల్ చేయవచ్చు మరియు ఆటోమేటిక్‌గా పార్క్ చేయవచ్చు.

ఇంకా ఇందులో డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే యూనిట్, మెమరీ ఫంక్షన్‌తో కూడిన ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ డ్రైవర్ సీట్, మూడవ వరుసలో ప్రయాణీకుల సీట్లు, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ యాంబియంట్ లైటింగ్, క్రూయిజ్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ మరియు పుష్ బటన్ స్టార్ట్ మొదలైన ఫీచర్లు ఉండొచ్చు.

అంతేకాకుండా, ఈ ఎస్‌యూవీలో లేటెస్ట్ కార్ కనెక్ట్ టెక్నాలజీ ఉండనుంది. ఇది వాయిస్ కమాండ్స్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. సేఫ్టీ విషయానికి వస్తే, ఇందులో బహుళ ఎయిర్‌బ్యాగులు, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఈబిడితో కూడిన ఏబిఎస్ మొదలైనవి ఉండే అవకాశం ఉంది.

అడ్వాన్స్‌డ్ డ్రైవర్స్ అసిస్టెన్స్ సిస్టమ్ (ఏడిఏఎస్)లో భాగంగా, ఈ కారులో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, అటానమస్ పార్కింగ్ అసిస్ట్, ఎమర్జెన్సీ బ్రేకింగ్ మరియు లేన్ డిపార్చర్ అలెర్ట్ వంటి ఇతర సేఫ్టీ ఫీచర్లు కూడా లభించే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Mahindra XUV700 Listed On Company Website, Register Your Interest. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X