నెక్సాన్‌ని సైలెంట్‌గా అప్‌డేట్ చేసిన టాటా మోటార్స్; కొత్త ఫీచర్ల జోడింపు!

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ విక్రయిస్తున్న పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ 'టాటా నెక్సాన్'లో కంపెనీ సైలెంట్‌గా కొన్ని అప్‌డేట్స్ ప్రవేశపెట్టింది. అప్‌డేట్ చేయబడిన ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇప్పుడు టాటా షోరూమ్‌ల వద్దకు రావడం ప్రారంభించింది. మరి ఈ కొత్త టాటా నెక్సాన్‌లో చేసిన మార్పులు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

నెక్సాన్‌ని సైలెంట్‌గా అప్‌డేట్ చేసిన టాటా మోటార్స్; కొత్త ఫీచర్ల జోడింపు!

కొత్త అల్లాయ్ వీల్ డిజైన్

అప్‌డేటెడ్ టాటా నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీలోని టాప్-ఎండ్ వేరియంట్లు ఇప్పుడు సరికొత్త 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్ డిజైన్‌ను కలిగి ఉంటాయి. పాత మోడల్‌లోని అల్లాయ్ వీల్స్ మునుపటి Y-ఆకారపు డిజైన్‌ను కలిగి ఉంటే, ఈ కొత్త అల్లాయ్ వీల్స్ మాత్రం 5-స్పోక్ డిజైన్‌ను కలిగి ఉంటాయి.

నెక్సాన్‌ని సైలెంట్‌గా అప్‌డేట్ చేసిన టాటా మోటార్స్; కొత్త ఫీచర్ల జోడింపు!

ప్రస్తుతం, టాటా నెక్సాన్‌లోని XZA +, XZ +, XZ + (S), XZA + (S), XZ + (O), XZA + (O) వేరియంట్లలో మాత్రమే అల్లాయ్ వీల్స్ అందుబాటులో ఉన్నాయి. నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ యొక్క లోయర్-స్పెక్ మరియు మిడ్-స్పెక్ వేరియంట్లలో 16 ఇంచ్ స్టీల్ వీల్స్ మరియు వీల్ కవర్‌లను కలిగి ఉంటాయి.

MOST READ:మీకు తెలుసా.. భారతదేశపు మొట్టమొదటి కమర్షియల్ పైలట్ ఈ యువతి

నెక్సాన్‌ని సైలెంట్‌గా అప్‌డేట్ చేసిన టాటా మోటార్స్; కొత్త ఫీచర్ల జోడింపు!

టెక్టోనిక్ బ్లూ కలర్ డిస్‌కంటిన్యూ

టాటా నెక్సాన్‌లో ఇప్పటి వరకూ ఆప్షనల్ పెయింట్ స్కీమ్‌గా అందిస్తూ వచ్చిన టెక్టోనిక్ బ్లూ కలర్ ఆప్షన్‌ను కంపెనీ నిలిపివేసింది. ఈ మోడల్‌లో టెక్టోనిక్ బ్లూ కలర్ నిలిపివేసిన తరువాత, టాటా నెక్సాన్ ఇకపై 5 పెయింట్ స్కీమ్‌లలో మాత్రమే లభిస్తుంది. అవి: ఫోలియేజ్ గ్రీన్, కాల్గరీ వైట్, ఫ్లేమ్ రెడ్, ప్యూర్ సిల్వర్ మరియు డేటోనా గ్రే.

నెక్సాన్‌ని సైలెంట్‌గా అప్‌డేట్ చేసిన టాటా మోటార్స్; కొత్త ఫీచర్ల జోడింపు!

టాటా మోటార్స్ అందిస్తున్న మరో ఎంట్రీ లెవల్ కారు టియాగోలో కూడా కంపెనీ ఇదేరకమైన కలర్ ఆప్షన్ మార్పులు చేసింది. అయితే, ఈ హ్యాచ్‌బ్యాక్‌లో నిలిపివేయబడిన టెక్టోనిక్ బ్లూ కలర్ స్థానంలో కొత్త అరిజోనా బ్లూ కలర్ ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది. మరి టాటా నెక్సాన్‌లో కూడా ఇదే విధమైన మార్పు ఉంటుందో లేదో చూడాలి.

MOST READ:విధుల్లో ఉన్న అంబులెన్స్ డ్రైవర్ తన తల్లి మరణ వార్త విన్నాడు.. తరువాత ఏం జరిగిందంటే?

నెక్సాన్‌ని సైలెంట్‌గా అప్‌డేట్ చేసిన టాటా మోటార్స్; కొత్త ఫీచర్ల జోడింపు!

టచ్‌స్క్రీన్ బటన్లు తొలగించబడ్డాయి

టాటా నెక్సాన్‌లో చేసిన మార్పులో చివరది ఇంటీరియర్లలో చేయబడింది. ఇందులోని టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కోసం భౌతిక బటన్లు తొలగించారు. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు డాష్‌బోర్డ్‌లోని ఎయిర్ కండిషనింగ్ వెంట్ల మధ్య ఉంచిన బటన్ల సెట్ ఇకపై కనిపించబోదు.

నెక్సాన్‌ని సైలెంట్‌గా అప్‌డేట్ చేసిన టాటా మోటార్స్; కొత్త ఫీచర్ల జోడింపు!

టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లోని వాల్యూమ్ ఆపరేషన్, ట్రాక్‌లను మార్చడం, ఫోన్‌బుక్‌ను యాక్సెస్ చేయడం వంటి మరెన్నో ఫీచర్లను యాక్సెస్ చేయడానికి ఈ భౌతిక బటన్లు ఉపయోగపడేవి. కాగా, ఇప్పుడు ఈ బటన్లు ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ యూనిట్ లోపల డిజిటల్‌గా విలీనం చేయబడ్డాయి.

MOST READ:ప్రజల కోసం తన కారును అంబులెన్సుగా మార్చిన కాంగ్రెస్ నాయకుడు, ఎవరో తెలుసా?

నెక్సాన్‌ని సైలెంట్‌గా అప్‌డేట్ చేసిన టాటా మోటార్స్; కొత్త ఫీచర్ల జోడింపు!

ఇవి ఇప్పటి వరకూ టాటా నెక్సాన్‌లో కంపెనీ సైలెంట్‌గా చేసిన మార్పులు, ఈ కొత్త మార్పులకు సంబంధించి కంపెనీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ఇది బ్రాండ్ యొక్క సాధారణ ఉత్పత్తి మెరుగుదలలో భాగమని మేము భావిస్తున్నాము.

నెక్సాన్‌ని సైలెంట్‌గా అప్‌డేట్ చేసిన టాటా మోటార్స్; కొత్త ఫీచర్ల జోడింపు!

ఇదిలా ఉంటే, టాటా మోటార్స్ ఇటీవలే భారత మార్కెట్లో తమ నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ధరలను కూడా పెంచింది. ధరల పెరుగుదల తరువాత, కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇప్పు రూ.7.19 లక్షల (బేస్ వేరియంట్) నుంచి రూ.12.95 లక్షల (టాప్-స్పెక్ డీజిల్ ఎక్స్‌జెడ్ఏ + డిటి (ఓ) వేరియంట్) మధ్యలో అమ్ముడవుతోంది.

MOST READ:పనికిరాని సీట్ బెల్టులతో వ్యాపారం.. మిలియన్ల కొద్దీ సంపాదన.. ఎలా అనుకునుటున్నారా?

నెక్సాన్‌ని సైలెంట్‌గా అప్‌డేట్ చేసిన టాటా మోటార్స్; కొత్త ఫీచర్ల జోడింపు!

టాటా నెక్సాన్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. పెట్రోల్ వెర్షన్‌లో 1.2-లీటర్ త్రీ-సిలిండర్ టర్బో ఇంజన్ ఉంటుంది. ఇది గరిష్టంగా 108 బిహెచ్‌పి శక్తిని మరియు 170 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే, ఇందులోని 1.5-లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో-డీజిల్ ఇంజన్ గరిష్టంగా 108 బిహెచ్‌పి శక్తిని మరియు 260 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది.

నెక్సాన్‌ని సైలెంట్‌గా అప్‌డేట్ చేసిన టాటా మోటార్స్; కొత్త ఫీచర్ల జోడింపు!

ఈ రెండు ఇంజన్లు కూడా స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా సిక్స్-స్పీడ్ ఏఎమ్‌టి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తాయి. ప్రస్తుతం దేశంలో లభిస్తున్న బెస్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో టాటా నెక్సాన్ కూడా ఒకటి. గడచిన ఏప్రిల్ 2021లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కాంపాక్ట్ ఎస్‌యూవీలలో టాటా నెక్సాన్ నాల్గవ స్థానంలో ఉంది.

Most Read Articles

English summary
Tata Motors Silently Updates Tata Nexon: Here Are All The Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X