Just In
- 1 hr ago
3 కి.మీ ట్రక్కుని రివర్స్ గేర్‌లో నడిపిన డ్రైవర్.. ఎందుకనుకుంటున్నారా, అయితే ఇది చూడండి
- 1 hr ago
దేశంలోనే అతిపెద్ద మల్టీ-బ్రాండ్ కార్ సర్వీస్ సెంటర్‌ను ఓపెన్ చేసిన బాష్
- 2 hrs ago
టీవీఎస్ ఎక్స్ఎల్ 100 విన్నర్ ఎడిషన్ లాంచ్ : ధర & వివరాలు
- 16 hrs ago
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
Don't Miss
- News
నాన్సీ ల్యాప్‌టాప్ చోరీ? రష్యా ఇంటలిజెన్స్‌కు చేరవేసే ప్లాన్.. ఎఫ్‌బీఐ అఫిడవిట్లో సంచలనాలు..
- Sports
వికెట్ కీపర్‌గా పంత్ అరుదైన రికార్డు.. ధోనీ కన్నా వేగంగా!!
- Finance
Gold prices today : స్థిరంగా బంగారం ధరలు, వెండి ధరలు జంప్
- Lifestyle
మీరు ఎప్పుడూ ఎందుకు అలసిపోతున్నారు?అందుకు సాధారణ కారణాలు ఇక్కడ ఉన్నాయి..
- Movies
Master box office: 6వ రోజు కూడా పవర్ఫుల్ కలెక్షన్స్.. విజయ్ మరో బిగ్గెస్ట్ రికార్డ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
గురుగ్రామ్‌లో 55 శాతం తగ్గిన ట్రాఫిక్ ఫైన్స్.. దీనికి కారణం ఇదే
కరోనా మహమ్మరి కారణంగా ప్రారంచంలోని అన్నిదేశాలను అతలాకుతలం చేసింది. ఎంతోమంది ప్రజలు ఈ మహమ్మరి వల్ల ప్రాణాలు కోల్పోయారు, మరికొంతమంది ఉపాధి కోల్పోయారు. ఇంత నష్ఠాలను కలిగించిన కరోనా, ఒక విషయంలో మాత్రం కొంత ఉపయోగకరంగానే ఉంది.

కరోనా అధికంగా వ్యాపించడం వల్ల కరోనా లాక్ డౌన్ విధించబడింది. ఈ కారణంగా ట్రాఫిక్ రద్దీ పూర్తిగా తగిపోయింది. దీని వల్ల కాలుష్యం కూడా తగ్గిపోయింది. సాధారణ పరిస్థితుల్లో వాహనాల రాకపోకలతో రద్దీగా ఉంటుంది. ఈ సమయంలో చాలామంది వాహనదారులు టాఫిక్ ఉల్లంఘిస్తూ పోలీసులకు పట్టుపడతారు.

ఇటీవల కొన్ని నివేదికల ప్రకారం హర్యానాలోని గురుగ్రామ్‌లో ట్రాఫిక్ ఉల్లంఘన కేసుల సంఖ్య 2019 తో పోలిస్తే ఈ ఏడాది దాదాపు 55% వరకు తగ్గాయి. దీనికి ప్రధాన కారణం కరోనావైరస్ సంక్రమణ. ఈ ఏడాది డిసెంబర్ 14 నాటికి గురుగ్రామ్ ట్రాఫిక్ పోలీసులు 2,16,199 చలాన్లను జారీ చేశారు. వీటిలో మద్యం తాగి డ్రైవ్ చేయడం, సిగ్నల్ జంప్, రాంగ్ రూట్ లో ప్రయాణించడం మరియు నో పార్కింగ్ ప్లేస్ లో పార్క్ చేయడం వంటివి ఉన్నాయి.
MOST READ:మరో రెండేళ్లలో దేశంలో టోల్ బూత్‌లనేవే ఉండవు: నితిన్ గడ్కరీ

వాహనదారులు హెల్మెట్ డ్రైవ్ చేయడం వంటివి కూడా ఇందులో భాగంగా ఉన్నాయి. మద్యం తాగి వాహనాలు డ్రైవ్ చేసిన కేసులు ఇందులో 4067 కేసులు ఉన్నాయి. గురుగ్రామ్ పోలీసులు మద్యం తాగి వాహనాలు నడిపిన 4,067 మంది వాహనదారులకు జరిమానా విధించారు.

కానీ ఈ సంవత్సరం మొత్తం నమోదైన కేసులు సంఖ్య కేవలం 447 మాత్రమే. కరోనావైరస్ వ్యాప్తి చెందుతుందనే భయం మరియు తాగిన డ్రైవర్లను తనిఖీ చేయకపోవడం వల్ల కేసుల సంఖ్య తగ్గింది. కరోనావైరస్ సంక్రమణ మరియు లాక్డౌన్ కారణంగా ట్రాఫిక్ ఉల్లంఘనల సంఖ్య తగ్గిందని గురుగ్రామ్ పోలీసులు తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్డౌన్ జారీ చేసింది.
MOST READ:ప్రముఖ ఫుట్‌బాల్ ప్లేయర్ డ్రైవింగ్ లైసెన్స్ 9 నెలలు సస్పెండ్ : ఎందుకో తెలుసా ?

దీనివల్ల ట్రాఫిక్ పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు కూడా చాలా ప్రణతాలలో కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున, మద్యం తాగి వాహనాలు నడిపే పోలీసులు తాగిన డ్రైవర్లను కూడా తనిఖీ చేయడం లేదు. కరోనావైరస్ సంక్రమణ వ్యాప్తి చెందడంతో ట్రాఫిక్ పోలీసులు ఆల్కహాల్ బ్రీత్ ఎనలైజర్ యంత్రాల వాడకాన్ని నిలిపివేశారు. ఇప్పుడు న్యూ ఇయర్ వస్తోంది.

సాధారణంగా నూతన సంవత్సర వేడుకల సందర్భంగా చాలామంది యువకులు మద్యం తాగి హల్ చల్ చేస్తూ ఉంటారు. మద్యం తాగి విపరీతమైన వేగంతో వాహనాలను డ్రైవ్ చేయడం వల్ల ఎక్కువ సంఖ్యలో ప్రమాదాలు జరుగుతాయి. ఈ ప్రమాదాలలో చాలామంది ప్రాణాలు సైతం కోల్పోయే అవకాశం ఉంది.
MOST READ:ఫ్యాన్సీ నెంబర్ కోసం 32 లక్షలు వేలం పాడాడు.. కానీ చివరికి ఏమైందంటే ?

కరోనా వైరస్ మహమ్మారి ఇప్పటికీ ఎక్కువగానే ఉంది, ఈ సమయంలో ప్రభుత్వాలు కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపకూడదని ఆంక్షలు విధించింది. అయినప్పటికీ ఈ కొత్త సంవత్సరంలో మద్యం తాగిన డ్రైవర్లను గుర్తించడానికి పోలీసులు కొత్త పద్దతుఅల్ను అవలంబించే అవకాశం ఉంది.

కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ సమయంలో టెస్ట్ చేయడానికి ఆల్కహాల్ బ్రీత్ ఎనలైజర్ యంత్రాలను ఉపయోగించే అవకాశం లేదు. గురుగ్రామ్ పోలీసులు ఈ విషయాన్ని స్పష్టం చేశారు, నూతన సంవత్సర పండుగ సందర్భంగా తాగిన డ్రైవర్లను తనిఖీ చేయడానికి వారు ఆల్కహాల్ బ్రీత్ ఎనలైజర్ యంత్రాలను ఉపయోగించరు.
MOST READ:భారత్‌లో బెస్ట్ సేఫ్టీ రేటింగ్ దక్కించుకున్న టాప్-5 సేఫెస్ట్ కార్స్ ఇవే..

మద్యం తాగి డ్రైవ్ చేసేవారిని కనిపెట్టడానికి పోలీసులు ఎటువంటి పద్ధతులను అవలంబిస్తాయో వేచి చూడాలి. ఏది ఏమైనా కరోనా వ్యాపిస్తున్న తరుణంలో ప్రజలు ఎక్కువగా సంచరించడం, విచ్చల విడిగా తిరగటం మంచిది కాదు, వీలైనంతవరకు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కుటుంబంతో కలిసి చేసుకోవడం మంచిది.
Note: Images are representative purpose only.