Just In
- 2 hrs ago
525 హార్స్ పవర్ వి8 ఇంజన్‌తో వస్తున్న మోస్ట్ పవర్ఫుల్ డిఫెండర్ వి8
- 2 hrs ago
45 లీటర్ల ఇంధన ట్యాంక్‌లో 48 లీటర్ల పెట్రోల్.. దీనితో మొదలైన గొడవ.. చివరికి ఏమైందంటే
- 4 hrs ago
సూపర్ సోకో నుండి మూడు సరికొత్త ఎలక్ట్రిక్ టూవీలర్స్
- 4 hrs ago
చెన్నైలో కొత్త డీలర్షిప్ ప్రారంభించిన వోల్వో.. పూర్తి వివరాలు
Don't Miss
- Sports
రెండు రోజుల్లోనే 22 టెస్టులు పూర్తి.. ఇంగ్లండ్ జట్టుదే ఆధిపత్యం!! భారత్ ఎన్నిసార్లంటే?
- Movies
మహేశ్‌కు మళ్లీ కథ చెప్పిన సక్సెస్ఫుల్ డైరెక్టర్: ఈ సారి మరో ప్రయోగం అంటూ రిప్లై
- News
Same Sex marriage: మోడీ సర్కార్ నిర్ణయంపై భగ్గుమంటోన్న స్వలింగ సంపర్కులు: తొక్కేశారంటూ
- Finance
గుడ్‌న్యూస్, 30,000 మందికి క్యాప్‌జెమిని ఉద్యోగాలు! ఫ్రెషర్స్, ఎక్స్‌పీరియన్స్‌కు అవకాశం
- Lifestyle
ఈ 4 రాశుల వారికి లీడర్ షిప్ క్వాలిటీస్ ఉండవు... ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూసెయ్యండి...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బజాజ్ సిటి100 'కడక్' మోటార్‌సైకిల్ విడుదల; ధర, ఫీచర్లు
దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటో భారత మార్కెట్లో విక్రయిస్తున్న తమ పాపులర్ 100సీసీ కమ్యూటర్ మోటార్‌సైకిల్ సిటి100లో కంపెనీ ఓ కొత్త వెర్షన్‌ను విడుదల చేసింది. బజాజ్ సిటి100 కడక్ పేరుతో విడుదలైన ఈ కొత్త మోటార్‌సైకిల్ ధరను మార్కెట్లో రూ.46,432గా (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) నిర్ణయించారు.

స్టాండర్డ్ సిటి100తో పోల్చుకుంటే ఈ కొత్త సిటి100 'కడక్' వెర్షన్ ఇప్పుడు అనేక ఫీచర్లు మరియు పరికరాలతో లభిస్తుంది, ఇది ఈ విభాగంలోనే ఆకర్షణీయమైన మోడల్‌గా నిలుస్తుంది. కొత్త బజాజ్ సిటి100 కడక్‌లో కంపెనీ తాజాగా ఎనిమిది కొత్త ఫీచర్లను జోడించింది.

ఇందులో మెరుగైన స్థిరత్వం కోసం క్రాస్-ట్యూబ్ హ్యాండిల్ బార్, అదనపు రైడర్ సౌకర్యం కోసం రబ్బరు ట్యాంక్ ప్యాడ్లు, పిలియన్ రైడర్ కోసం విస్తరించిన గ్రాబ్ రెయిల్స్, ఇండికేటర్లకు అనువైన మరియు స్పష్టమైన లెన్స్, విస్తరించిన మిర్రర్ బూట్, ఫ్రంట్ ఫోర్క్ సస్పెన్షన్ బెలోస్, అదనపు సౌకర్యం కోసం మందమైన మరియు చదునైన సీటు మరియు ఒక ఫ్యూయెల్ లెవల్ ఇండికేటర్‌లు ఉన్నాయి.
MOST READ:ఫెస్టివెల్ సీజన్‌లో రికార్డ్ స్థాయిలో మెర్సిడెస్ బెంజ్ అమ్మకాలు

ఈ అదనపు ఫీచర్లతో పాటుగా, కొత్త బజాజ్ సిటి100 కడక్ ఇప్పుడు మూడు కొత్త కలర్ ఆప్షన్లలో కూడా లభ్యం కానుంది. వీటిలో బ్లూ డెకాల్స్‌తో గ్లాసీ ఎబోనీ బ్లాక్, యల్లో డెకాల్స్‌తో మ్యాట్ ఆలివ్ గ్రీన్ మరియు బ్రైట్ రెడ్ డెకాల్స్‌తో గ్లాసీ ఫ్లేమ్ రెడ్ కలర్స్ ఉన్నాయి. ఈ కొత్త కలర్ ఆప్షన్లు మరియు అప్‌డేటెడ్ బాడీ గ్రాఫిక్స్ ఈ కమ్యాటర్ మోటార్‌సైకిల్‌కు మరింత స్టైలిష్ రూపాన్ని జోడిస్తాయి.

పైన పేర్కొన్న మార్పుల మినహా సిటి100 కడక్‌లో వేరే ఏ ఇతర మార్పులు లేవు. ఇంజన్ పరంగా కూడా ఇందులో ఎలాంటి మార్పు లేదు. కొత్త బజాజ్ సిటి100 కడక్‌లో అదే 102సిసి ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్‌నే ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద 7.5 బిహెచ్‌పి పవర్‌ను మరియు 5500 ఆర్‌పిఎమ్ వద్ద 8.34 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.
MOST READ:ఎలక్ట్రిక్ వాహనాన్ని డ్రైవ్ చేసిన మైనర్ బాలుడు.. తర్వాత ఏం జరిగిందో తెలుసా ?

ఈ విషయంపై బజాజ్ ఆటో లిమిటెడ్ మార్కెటింగ్ హెడ్ నారాయణ్ సుందరరామన్ మాట్లాడుతూ, "బజాజ్ సిటి100 బ్రాండ్‌లో కొత్త వచ్చిన కడక్ మోడల్ ధృడమైన నిర్మాణం, సాలిడ్ ఇంజన్, అధిక విశ్వసనీయత మరియు అత్యధిక మైలేజీ వంటి విశిష్ట లక్షణాలతో కమ్యూటర్ మోటార్‌సైకిల్ విభాగంలో ఉత్తమమైన మోడళ్లలో ఒకటిగా నిలుస్తుంది. మా సిటి రేంజ్ మోడళ్లను ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకూ 68 లక్షలకు పైగా మోటార్‌సైకిళ్లను విక్రయించాము."

"కొత్త సిటి 100 కడక్‌లో అప్‌గ్రేడ్ చేసిన ఫీచర్లు కచ్చితంగా ఫీచర్ ప్యాక్డ్ మరియు ఇంధన సామర్థ్యంతో కూడిన మోటార్‌సైకిల్‌ను ఎంచుకునే కస్టమర్లను ఆకర్షిస్తాయి మరియు ఇది దాని విభాగంలో డబ్బుకు తగిన ఉత్తమ విలువను అందిస్తుందని" ఆయన అన్నారు.
MOST READ:మీకు తెలుసా.. భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరగటానికి ప్రధాన కారణం ఇదే

బజాజ్ సిటి100 కడక్ మోటార్‌సైకిల్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న పండుగ సీజన్‌లో మరింత అధిక సంఖ్యలో వినియోగదారులను ఆకర్షించేందుకు బజాజ్ ఆటో తమ పాపులర్ సిటి100 రేంజ్‌లో కొత్త ‘కడక్' మోటార్‌సైకిల్‌ను ప్రవేశపెట్టింది. బజాజ్ సిటి100 యొక్క కొత్త కడక్ వెర్షన్ ఈ విభాగంలో హీరో స్ప్లెండర్, హీరో హెచ్ఎఫ్ డీలక్స్ మరియు టివిఎస్ రేడియాన్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.